Telugu News

నేడు ఖమ్మానికి అమిత్ షా..

భారీ ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు

0

నేడు ఖమ్మానికి అమిత్ షా..

== భారీ ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు

== ఖమ్మం ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ

== లక్షకు పైగా జన సమీకరణ

== నియోజకవర్గానికి ఇంచార్జీలుగా ఎమ్మెల్యే, జాతీయ నేతలు

== చాలెంజ్ గా తీసుకున్న కాషాయదళం

== అబ్బురపరిచే వేదిక.. సభా స్థలం

== కషాయమయంగా మారిన ఖమ్మం నియోజకవర్గం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

చాలా రోజుల తరువాత ఖమ్మంలో బీజేపీ బహిరంగ సభను నిర్వహించబోతుంది..ఆ పార్టీ జాతీయ కీలక నేత, కేంద్ర హోమంత్రి అమిత్ షా ఈ బహింరగ సభకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. ఆదివారం సాయంత్రం జరిగే ఈ సభకు పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం సర్వం సిద్దమైందది. అందుకు గాను భారీ ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైయ్యారు. బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేయలనే ఉద్దేశ్యంతో జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, కీలక నాయకుడ్ని ఇంచార్జ్ లుగా నియమించారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం పొలిటికల్ లో విచిత్రం..?

ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి లక్షకు పైగా జన సమీకరణ చేయాలని, బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు కాషాయ దళం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అలాగే పోలీసులు భారీ పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నారు. కేంద్ర హో మంత్రి అమిత్ షా జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్.వారియర్, జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఎక్కడ చిన్న అవాంచనీయ సంఘటన చోటు చేసుకోకుండా అణువనువునా తనిఖీలు చేసే అవకాశం ఉంది. వీఐపీ గ్యాలరీకి వెళ్లాలంటే పాస్ లేకుండా అనుమతినిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అలా  భారీ పటిష్ట బందోబస్తును నిర్వహిస్తున్నారు.

== మధ్యాహ్నం 3.30గంటలకు ఖమ్మంకు అమిత్ షా

తెలంగాణ రాష్ర్టంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభలను నిర్వహిస్తోంది. ఈ సభలకు జాతీయ కీలక నాయకత్వం హాజరయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది.

ఇది కూడా చదవండి:- జలగం దారేటు..?

ముఖ్యంగా బీజేపీకి అణువైన జిల్లాల్లో కేంద్ర హోమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా బహిరంగ సభలకు హాజరువుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.ఈ సభకు కేంద్ర హోమంత్రి అమిత్ షాను ఆహ్వానించగా, గత రెండు నెలల క్రితమే ఈ సభ జరగాల్సి ఉంది. కానీ రెండు సార్లు పలు కారణాల రిత్యా సభ వాయిదా పడింది. దీంతో తిరిగి ఆగస్టు 27న ఖారారు చేయగా, భద్రాచలంలో భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ఖమ్మం వచ్చే విధంగా పర్యటన షెడ్యూల్ ను ఖరారు చేశారు. కానీ అనివార్యకారణాల వల్ల సమయభావం వల్ల భద్రాచలంలోని రామయ్య దర్శనాన్ని రద్దు చేసి బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారని షెడ్యూల్ ను మరోసారి విడుదల చేశారు.

== రైతు గోస- బీజేపీ భరోసా పేరుతో సభ

తెలంగాణ రాష్ట్రంలో రైతులు అరిగోస పడుతున్నారని, ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపిస్తుందని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగానే అమిత్ షా వచ్చే బహిరంగ సభకు ‘రైతు గోస- బీజేపీ భరోసా’ పేరు పెట్టి సభను నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభలో అమిత్ షా రైతులకు కొన్ని హామిలు ఇచ్చే అవకాశం ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఒక రకంగా బీజేపీ రైతు డిక్లరేషన్ అని చెప్పవచ్చు. రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని వివరించే అవకాశాలు ఉన్నాయి.

== అబ్బుర పరిచే విధంగా సభ

రైతు గోస- బీజేపీ భరోసా పేరుతో నిర్వహించే బహిరంగ సభ ప్రాంగాణాన్ని ప్రజలందరు అబ్బురపరిచే విధంగా తయారు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ కు తుమ్మల గుడ్ బై..?

సుమారు 100 అడుగుల వెడల్పు, 40 అడుగుల పొడవుతో సభా వేదికను తయారు చేయగా, సుమారు 100 మీటర్ల పొడవు, 200 మీటర్ల వెడల్పతో భారీ సభా ప్రాంగణాన్ని తయారు చేశారు. మొత్తం డేరా టైఫ్ లో ప్లాస్టిక్ వేదికను తయారు చేస్తున్నారు. వర్షం వచ్చిన కురవకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. సుమారు 30వేల నుంచి 50వేల వరకు ప్రజలు కుర్చునే విధంగా అందరికి కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మీటింగ్ కు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా ప్యాన్లను, ఎల్ ఈడీ బల్బులు, భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం నగరాన్ని సుందర్భంగా కాషాయ జెండాలతో నింపిపడేశారు. ఎక్కడ చూసిన ఖమ్మంలోని ప్రధాన వీధులు కషాయ జెండాలతో నిండిపోయాయి. అడుగడుగ ప్లెక్సీలు, హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు. మొత్తానికి బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు బీజేపీ నాయకత్వం తీవ్రంగా కష్టపడుతోంది.