Telugu News

ప్రమాదాలకు అడ్డాగా మారిన పినపాక వంతెన..

అమ్మా.. వంతెన

0

అమ్మో వంతెన…

** ఘోర రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారిన పినపాక వంతెన..

** అటుగా ప్రయాణించాలంటే భయపడుతున్న జనం

(వైరా-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా వైరా పినపాక బ్రిడ్జి సమీపంలో వరుస ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ఒకే వారంలో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. గతంలో బొగ్గు లారీ TS04UB2466 బీభత్సం వల్ల ఒకరి మృతి మరియు ద్విచక్ర వాహనంపై TS04FB1723 ప్రయాణిస్తున్న దంపతులు ను లారీ ఢీకొనడంతో భార్య తాళ్లూరి మరియమ్మ అక్కడికక్కడే మృతి చెందింది ఇది చూసిన స్థానికులు బ్రిడ్జి వద్దకు రాగానే భయాందోళనకు గురవుతున్నారు.. ఇలా నెలలో లెక్కలోకి రాణి ప్రమాదాలు ఎన్నో జరిగాయి..

ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రహదారులపై ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రమాదాలు, మృతుల సంఖ్య తగ్గడం లేదు. అతివేగం, డ్రైవింగ్‌లో నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది బతుకులు గాలిలో కలిసి పోతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో చాలా వరకు మలుపుల వద్దే జరుగుతున్నాయి. మలుపులు, ఇరుకు రోడ్లు, వంతెనల్ని బ్లాక్‌ స్పాట్‌లుగా గుర్తించ ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టినా పరిస్థితిలో పెద్దగా మార్పు కనిపించడం

also read :-ద‌ళితులకు గుడ్ న్యూస్.. దళితబంధు నిధులు విడుదల