Telugu News

ముదిగొండ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

కష్ట,సుఖాల్లో ఒకరికొకరం అండగా ఉందాం.

0

ముదిగొండ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

== కష్ట,సుఖాల్లో ఒకరికొకరం అండగా ఉందాం.

(ముదిగొండ-విజయంన్యూస్)

        జిల్లా పరిషత్ హైస్కూల్ ముదిగొండ 1986-87 బ్యాచ్ పదవ తరగతి విద్యార్థులు ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఒకరికొకరు ఆత్మీయ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆనందోత్సాహాల నడుమసాగిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.  ఆదివారం ఉదయం ఖమ్మం లోని శ్రీశ్రీశ్రీ హోటల్ కన్వెన్షన్ లో ఫ్రెండ్స్ టీం,నిర్వహణా కమిటీ భాధ్యులు కమర్తపు వెంకట్,కట్లా శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వివిధ వృత్తులలో,వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన విద్యార్థులు అందరూ పాల్గొన్నారు.తమతో చదివి చనిపోయిన విద్యార్థి మిత్రులకు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.

allso read- కేసీఆర్ పేరు కోసమే సచివాలయం: షర్మిళ

కార్యక్రమంలో పాల్గొన్న ఆనాటి విద్యార్థులు పూల బొకేలతో ఒకరికొకరు స్వాగతం పలికారు.అందరూ తమను తాము వ్యక్తిగతంగా పరిచయం చేసుకున్నారు.ఈ పరిచయాలను ఇలానే కొనసాగిస్తూ భవిష్యత్తులో ఒకరికొకరం అండగా ఉందామని,వివిధ రంగాల్లో వృత్తుల్లో పనిచేస్తున్న మనందరం మన అవసరాల కోసం ఒకరికొకరం సహాయం చేసుకుందామని,మనలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయ సహకారాలు అందిద్దామని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలం 36 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ టీం గ్రూపును ఏర్పాటు చేసి అందర్నీ చేరదీసి  గెట్ టుగెదర్(ఆత్మీయ కలయిక) కార్యక్రమానికి రూపకల్పన చేసిన కమర్తపు వెంకట్, జమాలుద్దీన్,పి.ఎల్.ఎన్ స్వామి లకు కరతాళ ధ్వనుల మధ్య అందరూ అభినందనలు తెలిపారు.ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుందామని,కుటుంబ సభ్యులందరితో జరుపుకుంటే బాగుంటుందని,ఆత్మీయ కుటుంబ బంధాలు కొనసాగించాలని అందరూ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు పండిట్ మాశెట్టి నరేష్,ఆర్టీసి గుండు మాధవరావులు ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన కవితలను ఆలపించగా వారిని కరతాళ ధ్వనులతో అభినందించారు.36 సంవత్సరాల సుదీర్ఘకాలంలో కుటుంబాలలో అత్తయ్య, మామయ్యలుగా పెద్దరికంగా వ్యవహరిస్తున్న వారు అత్తయ్యలుగా వారి అనుభూతులను, మామయ్యలుగా వారి బాధ్యతలను వివరించారు.

allso read- మావోయిస్టు పార్టీ ఆరాచకాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఓఎస్డీ 

                  కార్యక్రమంలో భాగంగా మిమిక్రీ,తంబోళా ఆట,బంతాట,ఆటలు,పాటలు,అంత్యాక్షరి కార్యక్రమాల్లో పూర్వ విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు.అందరి ఆత్మీయ కలయికకు తీపి గుర్తుగా కాంపాటి లక్ష్మికాంత మహిళలందరి సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ పంచారు.             ఈ కార్యక్రమంలో కట్ల శ్రీనివాస్,కమర్తపు వెంకట్,కమర్తపు వెంకటేశ్వర్లు,షేక్ నిజాం,గుండు మాధవరావు,బయ్యం రమేష్,సామినేని భవాని ప్రసాద్,చిలుకూరి వీర బ్రహ్మచారి,జమాలుద్దీన్ లక్ష్మీనరసింహస్వామి,సిహెచ్ నాగేశ్వరరావు,తాళ్లూరి నాగరాజారావు,జంపాల రజని,సీతమ్మ, వెంకటరత్నం,కాంపాటి లక్ష్మీకాంత,బండి పద్మ, సరస్వతి,ఖాదర్ మణి,అన్నపూర్ణ,నాగమణి ముచ్చర్ల లలిత కుమారి, విజయలక్ష్మి,పోతునూక మధుసూదన్ రావు,బంక నాగార్జునడు,బంక రాములు,నాగదాసు,కొలిక పొంగు మాధవరావు, నరసింహచారి,సీతారామరావు,బయ్యం శ్రీనివాస రావు,మాశెట్టి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

allso read- సొమ్మసిల్లి పడిపోయిన వైఎస్ షర్మిళ