Telugu News

రెండు మృతదేహాలకు అన్నం ట్రస్ట్అంత్యక్రియలు 

అభినందనలు తెలిపిన పోలీసులు

0

రెండు మృతదేహాలకు అన్నం ట్రస్ట్అంత్యక్రియలు 

== అభినందనలు తెలిపిన పోలీసులు

(ఖమ్మం-విజయమ్ న్యూస్)

ఇటీవల ఖమ్మం డోర్నకల్ రైల్వే పోలీస్ పరిధిలోని రైలు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా గత వారం క్రితం డోర్నకల్ పోలీస్ పరిధిలోని మెహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో మధ్యలో కుళ్ళిపోయిన మృతదేహం లభ్యం కాగా ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల శవాల గదిలో భద్రపరచగా ఈ మృతదేహం యొక్క ఆచూకీ కనుగొనగా తెలం రైల్లో ప్రయాణిస్తూ జారిపడి మృతి చెందినాడు అని తెలిసింది.

ఇది కూడా చదవండి:- అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి

ఇతను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సీతాపూర్ జిల్లా కమలాపూర్ గ్రామానికి చెందిన సుమన్ దీక్షిత్ గా గుర్తించి కుటుంబ సభ్యుల్ని పిలిపించగా కుళ్ళిన పోయిన దశలో ఉన్న మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లే స్తోమత లేక కుటుంబ సభ్యుల సమక్షంలో రైల్వే పోలీసులు వైద్యశాల సిబ్బంది సమక్షంలో శవాల గది నుండి మృతదేహాలను స్వాధీనం చేసుకొని ఈ యొక్క రెండు రైల్వే కుళ్ళిపోయిన మృతదేహాలను ఖమ్మం నగరానికి చెందిన అన్నం ఫౌండేషన్ సాంప్రదాయ బద్ధంగా తెల్ల వస్త్రం పూలతో గౌరవించి నగరంలోని బల్లేపల్లి వైకుంఠధామంలో దహన సంస్కారం చేయడం జరిగినది.

ఇది కూడా చదవండి:- ఖమ్మం లో సీఎం కేసీఆర్, మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం.
ఈ కార్యక్రమంలో అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు తో పాటు అన్నం ఫౌండేషన్ సిబ్బంది రైల్వే పోలీస్ పాల్గొన్నారు