తెలంగాణ ప్రజలకు అండా… కేసిఆర్ గులాబీ జెండా..:మంత్రి
▪️కేసిఆర్ జనరంజక పాలనకు యావత్ దేశం ఫిదా.
▪️ప్రజల సంక్షేమమే కేసిఆర్ అజెండా.
▪️కేసిఆర్ నాయకత్వం తెలంగాణకు శ్రీరామ రక్ష.
▪️సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తెలంగాణ ప్రజలకు అండా..సీఎం కేసీఆర్ గులాబీ జెండా అని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం వీఆర్ బంజర, జీకే బంజర, పాపాటపల్లి గ్రామంలో రూ.1.95 కోట్లతో చేపట్టిన సీసీ డ్రెయిన్లు, సీసీ రోడ్స్, డొంక రోడ్లు, హై మాస్ట్ లైట్స్ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.
ఇది కూడా చదవండి:- సకల జనుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి
వీఆర్ బంజర గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.54 లక్షలతో నిర్మించిన 12 సీసీ రోడ్స్ ను ప్రారంభించారు. ఎస్డీఎఫ్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన మూడు రోడ్స్, సీఎస్ఆర్ ట్రాన్స్ కో నిధులు రూ.10 లక్షలతో అభివృద్ది చేసిన డొంక రోడ్డు ను ప్రారంభించారు. సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై-మాస్ట్ లైట్స్ ను స్విచ్ అన్ చేసి ప్రారంభించారు. జీకే బంజర గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.34 లక్షలు తో నిర్మించిన 8 సీసీ రోడ్స్, సీఎస్ఆర్ ట్రాన్స్ కో నిధులు రూ.2 లక్షలతో అభివృద్ది చేసిన ఒక డొంక రోడ్డు ను ప్రారంభించారు. ఎస్డీఎప్ నిధులు రూ. 10 లక్షలతో నిర్మించనున్న 3 సీసీ సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై-మాస్ట్ లైట్స్ ను స్విచ్ అన్ చేసి ప్రారంభించారు. గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన ఊరు మన బడి పథకం ద్వారా పాఠశాలలో చేపట్టిన అభివృద్ది పనులను ప్రారంభించారు. పాపటపల్లి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.50 లక్షలు నిర్మించిన 17 సీసీ రోడ్స్ ను ప్రారంభించారు.
ఇది కూడా చదవండి:-;ఖమ్మాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతా: మంత్రి
ఎస్డీఎఫ్ నిధులు రూ.10 లక్షలతో నిర్మించిన 6 సీసీ రోడ్స్, సీఎస్ఆర్ ట్రాన్స్కో నిధులు రూ.5 లక్షలతో అభివృద్ది చేసిన డొంక రోడ్డు ను ప్రారంభించారు. సుడా నిధులు రూ.3.50 లక్షలతో నిర్మించిన హై-మాస్ట్ లైట్స్ ను స్విచ్ అన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాపటపల్లి గ్రామంలో జరిగిన సభలో వారు మాట్లాడుతూ.. కేసిఆర్ గారి జనరంజక పాలనలో నేడు గ్రామాలు అద్భుతంగా మారాయని, అనేక కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో అన్ని సదుపాయాలు, వసతులు కల్పించుకునన్నామని అన్నారు. మండలం కు వేస్తే అన్ని బిర్యానీ లు తిన్న తృప్తిగా ఉంటుందని, గడచిన పదేళ్ల లో నాపై చూపిన ప్రేమకు మీ అందరికీ ధన్యవాదాలు. ఒక్క పాపటపల్లి గ్రామంలోనే రూ.10 కోట్లు ఇచ్చి ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ది చేశామన్నారు. దాదాపు రూ.350 కోట్లు రఘునాథపాలెం మండలం కు ఇచ్చినం.. ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసి ప్రజలకు కావాల్సిన అభివృద్ధిని చేసిన గ్రామ సర్పంచ్ లకు అభినందనలు.
ఇది కూడా చదవండి:- ఖమ్మాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతా: మంత్రి
మండలంలోని గ్రామాల సర్పంచ్ లు ముందు చూపు ఉన్న ప్రజాప్రతినిధులే.. ఇలాంటి నాయకుడే కదా ప్రజలకు కావాల్సింది. ఖమ్మం జిల్లా కేంద్రం కు అత్యంత దగ్గర గా ఉన్న పాపటపల్లి గ్రామంలో ఎందుకు అభివృద్ది జరగలేదు. 60 సంవత్సరాల పాలించిన కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇల్లు ఎందుకు లేవు..? సీసీ రోడ్లు ఎందుకు లేవు.. సైడ్ డ్రెయిన్లు ఎందుకు లేవు..? డంపింగ్ యార్డులు, వైకుంఠధామం, చెత్త సేకరణ వాహనాలు ఇలా అనేక పనులు ఎందుకు లేవు..? ఎందుకు చేయలేదు చెప్పాలి అన్నారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చారు..? ఇచ్చింది రూ .200. కానీ నేడు కేసీఅర్ ఇస్తుంది ఎంత.. రూ.2016 పెన్షన్ ఇస్తున్నారు.. ఇన్ని నాళ్లు లేనిదీ ఇప్పుడు కొత్తగా గుర్తుకొచ్చి నాలుగు వేలు
ఇది కూడా చదవండి:-;అభివృద్ధి లో రోల్ మోడల్ గా రఘునాధపాలెం:మంత్రి
ఇస్తాం అని రేవంత్ రెడ్డి అంటున్నాడు .. నమ్ముతారా ప్రజలారా..? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేదు.. దమ్ముంటే చెప్పాలన్నారు. ముందు మీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో అమలు చేసి చూపించి అప్పుడు తెలంగాణలో ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామంలో కొత్తగా వచ్చిన గృహలక్ష్మి, దళిత బందు ఇచ్చినం.. అర్హులైన ప్రజలందరికీ ఇంకా ఇస్తామన్నారు. మా నాన్న ఇక్కడ ఎమ్మేల్యే గా పని చేసిన నాటి నుండి నేటి వరకు ఖమ్మంలోనే ఉన్నాం.. నేను కూడా ఇక్కడే ఉన్న ఎక్కడికి పోలేదు.. పక్క చూపులు మా కుటుంబం ఎప్పుడూ చూడలేదు.. చూడము అని స్పష్టం చేశారు. ఈ సారి హ్యాట్రిక్ కొట్టడం పక్కా.. మళ్ళీ నేనే వస్తా ప్రభుత్వ పథకాలు అన్ని మీకు అందిస్తా.. నాది బాధ్యత అని చెప్పారు. ప్రజలకు ఎప్పుడూ అండగా నిలిచేది, వారి శ్రేయస్సు కోరేది ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మంత్రి పువ్వాడ స్పష్టం చేశారు. కేసిఆర్ సంక్షేమ పథకాలకు, జనరంజక పాలన చూసి యావత్ దేశమే ఫిదా అవుతుందని, ఎట్లా సాధ్యమని వివిధ రాష్ట్రాల నేతలు నోరెళ్ళ పెడుతున్నారని అన్నారు. ఎవ్వరికీ సాధ్యం కానివి సుసాధ్యం చేసిన ఘనత కేసిఆర్ గరిదేనని, దేశాన్ని ఆలోచింప చేస్తున్నారని అన్నారు.
ఇది కూడా చదవండి:- మున్నేరు రివర్ ఫ్రంట్ గా నామకరణం:మంత్రి
స్వరాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, తెలంగాణ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని తెలిపారు. ఇక్కడ ప్రజలే నా ఆశా… శ్వసగా భావిస్తున్నానని తేల్చి చెప్పారు. నా ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఎన్ని కోట్లు అయిన ప్రభుత్వం నుండి తీసుకొచ్చి ఇక్కడ కుమ్మనన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలను గోస పెట్టే పార్టీ అని వారి పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. యువకులు ఎక్కడిక్కడ కథానాయకులై కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కేసిఆర్ చేసిన మంచి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నటికైనా కేసిఆర్ నాయకత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష అని మంత్రి పువ్వాడ మరోమారు పునరుద్ఘాటించారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో క్రీడా విప్లవం రావాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ స్పోర్ట్స్ కిట్స్ ను పంపిణీ చేస్తున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం నగరం.. అభివృద్ధి గుమ్మం: పువ్వాడ
దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేటి వరకు యువత, క్రీడాకారుల కోసం ఇలా కిట్స్ పంపిణి చేయలేదని, సీఎం కేసీఆర్ ప్రభుత్వం యువత కోసం గొప్ప స్కీం కు శ్రీకారం చుట్టిందన్నారు. ఇలాంటి మంచి పనులు మనకు ఎల్లవేళలా అందాలంటే మీరందరూ కంకణబద్దులై బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.