Telugu News

అంగన్వాడి సెంటర్ల ను తనిఖీ చేసిన పి.వొ

అశ్వరరావుపేట-విజయం న్యూస్

0

అంగన్వాడి సెంటర్ల ను తనిఖీ చేసిన పి.వొ
(అశ్వరరావుపేట-విజయం న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లో శుక్రవారం ఐటీడీఏ పీవో  గౌతమ్ కొండరెడ్ల గ్రామాల్లో పర్యటించారు. గిరి పోషణలో భాగంగా కొండరెడ్ల పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించే ఉద్దేశంతో ఐటీడీఏ ద్వారా జోవర్ మీల్స్, మల్టీగ్రెయిన్ మిల్స్, మల్టీ గ్రీన్ స్వీట్ మీల్స్ అందిస్తున్నారు. ఈ పోషకాహరం పంపిణీని పరిశీలించారు. ముందుగా రెడ్డిగూడెం అంగన్ వాడి సెంటర్ లో ఆహార పదార్థాలను పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా, లేదా అని అడిగి తెలుసుకున్నారు. వర్షం వస్తే అంగన్ వాడి  సెంటర్ కురుస్తుందని పిల్లలకు ఇబ్బంది కరంగా ఉందని అక్కడ ప్రజలు తెలపగా కొత్తగా అంగన్ వాడి మంజూరు చేసి త్వరలోనే పనులు మొదలు పెడతామని, కుక్కర్స్, స్టోరేజ్ బౌల్స్ అందిస్తామని తెలిపారు.

పిల్లలకు  ఆటలు ఆడుకునేందుకు  ఉయ్యాల జారుడు బల్ల లు ఏర్పాటు చేయిస్తామని ఐటీడీఏ పీవో హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న అంగన్వాడి సెంటర్ ను పడేసి అదే స్థలంలో నిర్మాణాలు చేపడతామని అంతవరకు స్కూల్ కంపౌండ్ లో ఉన్న బిల్డింగ్ లో అంగన్ వాడి సెంటర్ ను కొనసాగించాలని ఆదేశించారు. కాసేపు పిల్లలతో ముచ్చటించారు. అనంతరం బండారు గుంపు లో ఉన్న అంగన్వాడి సెంటర్ ను సందర్శించి పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. అక్కడ పిల్లలను అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కొండరెడ్ల గ్రామాల్లో సమస్యలు ఉంటే  త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ పీ ఓ జనరల్ డేవిడ్ రాజు, ఏ పీ ఓ పి టి జి సురేష్ బాబు, తాసిల్దార్ చల్లా ప్రసాద్, ఐ టి డి ఎ .డి ఈ రాజు, సి డి పి వో లు రోజా రాణి రేవతి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, ఆర్ఐ అనిల్, వి ఆర్ ఓ లాలు, ఏఎన్ఎం భూబి నాంచారి, రాములమ్మ, అంగన్ వాడి టీచర్ ధనమ్మ, తదితరులు పాల్గొన్నారు.

also read:-♦️ దారి తప్పిన జింక పిల్లను అటవీ అధికారులకు అప్పగించిన మందమర్రి పోలీసులు