Telugu News

వృద్దురాలుకు వెంటవెంటనే డబుల్ డోస్

సెల్ ఫోన్లో మాట్లాడుతూ మరో డోస్ వేసిన ఏఎన్ఎం

0

ఎంత పనిచేసనవే సెల్ పోనా..?

వృద్ధురాలకు వెంటవెంటనే డబుల్ డోస్ 

— సెల్ ఫోన్లో మాట్లాడుతూ మరో డోస్ వేసిన ఏఎన్ఎం

— డోస్ ఎక్కువ కావడంతో మంచంపట్టిన వృద్దురాలు

— వైద్యసేవలందిస్తున్న వైద్యులు

చండ్రుగొండ( విజయం న్యూస్ ):

సెల్ పోన్ ఎంత పనిచేసిందో చూడండి..? ఓ వృద్దురాలు ప్రాణాల మీదకు తెచ్చింది.. సెల్ ఫోన్ లో మాట్లాడుతున్న ఏఎన్ఎం  సెల్ పోన్ జ్యాసలో పడిపోయి పెద్ద తప్పిదమే చేసింది.. ఆ తప్పు ఇప్పుడు వైద్యశాఖనే వణికిస్తోంది.. అసలేం జరిగింది..? 

పోకలగూడెం గ్రామంలో శుక్రవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. నూరు శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఏఎన్ఎం, ఆశవర్కర్లు, సమాఖ్య సభ్యులు కలిసి వ్యాక్సినేషన్ చేస్తున్నారు. అయితే  వృద్ధురాలు బానోత్ సక్రి (72) ఆమెకు వ్యాక్సిన్ చేద్దామని వెళ్ళిన ఏఎన్ఎం ఆమెతో మాట్లాడి మొదటి డోస్ టీకా వేసే ముందు పోన్ వచ్చింది. దీంతో ఏఎన్ఎం పోన్లో మాట్లాడుతూనే ఆ వృద్దురాలుకి టీకా వేసింది. అంతే పోన్ జ్యాసలో పడిన ఆమె వెంటనే మరో డోస్ వేసింది.  వృద్ధురాలు కు పొరపాటున వ్యాక్సిన్ ఇచ్చింది. అక్కడే ఉన్న కొంతమంది గ్రామస్తులు గమనించి ఏఎన్ఎం అడగగా ఆమె ఆశ్ఛర్యపోయింది.  పొరపాటు జరిగిందని ఒప్పుకుంది. దీంతో వృద్ధురాలు మంచం పట్టింది. ఓవర్ డోస్ కావడంతో ఆమెకు
జ్వరం, ఒళ్ళు నొప్పులు, బీపీ పెరగడం, ఆయాసం రావడం, నీరసంగా ఉండటం, మొదలైన సమస్యలు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ఈ విషయంపై విజయం పత్రిక విలేకరి వృద్ధురాలు గ్రామానికి వెళ్లి ఆమెను కలిసి మాట్లాడగా జ్వరం, ఒళ్ళు నొప్పులు, బీపీ పెరగడం, ఆయాసం రావడం, నీరసంగా ఉండటం, మొదలైన సమస్యలు వస్తున్నాయని తెలిపింది.

ఈ విషయంపై.. ఎంపీహెచ్ సీ  డాక్టర్ రాకేష్ కుమార్ ని వివరణగా….. గత రెండు రోజులుగా బాధితురాలిని ఆమె ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఏ విధమైన ఆరోగ్య సమస్యలు వచ్చినట్లయితే మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లి వైద్యం చేయిస్తామని బాధితురాలికి ధైర్యం చెప్పారు..ఇదే విషయంపై డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో వినోద్ కుమార్ వివరణ ఇచ్చారు. వాళ్లకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసి భరోసా ఇచ్చారు.

వృద్ధురాలి వృద్ధురాలి కుమార్తె ధరవాత్తు పార్వతి మాట్లాడుతూ మా అమ్మకి మెరుగైన వైద్యం అందించాలని ఆమెను మెరుగైన వైద్యం కోసం వైద్యుల పర్యవేక్షణలో హాస్పటల్లో ఉంచాలని కోరుతున్నారు. మరీ వైద్యులు మెరుగైన వైద్యసేవలందిస్తారా..? నిర్లక్ష్యం వహించిన ఏఎన్ఎంపై చర్యలు తీసుకుంటారా..? వేచి చూడాల్సిందే.

also read : ఐలమ్మపై మంత్రి పువ్వాడ అసక్తికర కామెంట్స్

ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ చూడాలనుకుంటున్నారా.. బ్రెకింగ్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే👆 ఒపెన్ చేయండి మీకు కనిపించే 🛎️ గంటను నొక్కండి.. ‘ఎప్పటికప్పుడు మా న్యూస్ మీ ముంగిట..’ సబ్ స్రైబ్ చేయండి ఫ్లీజ్