Telugu News

అకాల వర్షంతో అన్నదాతల ఆగమాగం ..

కల్లాల్లోనే తడిసి ముద్దైన ధాన్యం..

0

అకాల వర్షంతో అన్నదాతల ఆగమాగం …
కల్లాల్లోనే తడిసి ముద్దైన ధాన్యం..
ధాన్యం కొనుగోలు కేంద్రాల జాప్యంతో రైతన్నలకు తీరని నష్టం…
ఆదుకోండి మహాప్రభో… అన్నదాతల ఆక్రందన…

(మణుగూరు.విజయం న్యూస్.)

ప్రకృతి కన్నెర్ర తో ఆరు కాలం కష్టించి పండించిన వరి పంట గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షాలకు కళ్లెదుటే కళ్ళల్లో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి పోతుంటే రైతన్నల హృదయం కకావికలం అయినది. ప్రకృతి అనుకోని విధంగా కన్నెర్ర చేయడంతో ధాన్యాన్ని వర్షం బారినుండి కాపాడుకునేందుకు జోరు వర్షంలోనూ రైతులు చేసిన ప్రయత్నాలు కలచివేశాయి.దాన్యం కుప్పలపై టార్బాల్ పట్టాలు కప్పి దాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయగా ఈదురుగాలులతో అవి దాన్యం కుప్పలపై లేచిపోవడంతో దాన్యం వర్షానికి పూర్తిగా తడిసి ముద్దయింది. ఆరుగాలం పండించిన పంట కళ్లెదుటే తడిసి ముద్ద కావడంతో అన్నదాతలు ఆవేదన ఆక్రందన వ్యక్తం చేస్తున్నారు.

మణుగూరు మండలంలోని రామన్ జరం పగిడేరు, మణుగూరు, అన్నారం సమితి సింగారం, కమలాపురం రాయి గూడెం, తోగ్గుడెం ప్రాంతాలలో వందలాది ఎకరాల్లో కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దవగా ఐకేపీ సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జాప్యంతో నెలల తరబడి ధాన్యాన్ని అమ్ముకునేందుకు నిరీక్షిస్తూ ఎదురుచూస్తున్నా రైతన్నలకు అకాల వర్షం తీరని నష్టాన్ని చేకూర్చుంది. మణుగూరు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో పలు సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాయి. రామను జరం పంచాయతీలోని అయోధ్య నగర్ లో ఏర్పాటుచేసిన సహకార సంఘం కొనుగోలు కేంద్రంలో రైతులకు టార్పాలిన్లు, ధాన్యం ను ఆర పెట్టుకునేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేయలేదని రైతులు విమర్శిస్తున్నారు కొనుగోలు కేంద్రాల నిర్వహణ లోపం తోనే నెలల తరబడి దాన్యాన్ని అమ్ముకునేందుకు ఎదురుచూసిన కొనేవారు లేకపోవడంతో అకాల వర్షంతో తీవ్ర నష్టం చేకూరిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో పంట దిగుబడి పెరిగిందని ఆశించిన తమకు వరుణదేవుడు తమ ఆశలపై నీళ్లు చల్లారని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

కొనుగోలు కేంద్రాల జాప్యంతో రైతులకు తీరని నష్టం…

మండలంలో సొసైటీ ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 20 రోజులకు పైగా కావస్తున్నా దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొనివచ్చి రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టి కొనుగోలు కోసం ఎదురుచూస్తూ పడిగాపులు కాయాల్సి పరిస్థితి నెలకొంది. రోజుల తరబడి ధాన్యాన్ని కాపాడుకుంటూ నిరీక్షించాల్సి పరిస్థితి నెలకొంది. అకాల వర్షంతో ధాన్యం అధికారుల తీరుపై అన్నదాతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు తేమ పేరిట వేధించకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఆరుగాలం కష్టించి పనిచేసి వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంట కొనుగోలు కోసం దాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొని వస్తే ప్రభుత్వం అధికారుల తీరుతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష నాయకులు రైతు సంఘాల నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గురువారం కురిసిన అకాల వర్షాలకు తడిసి ముద్దైన ధాన్యం ని ఎటువంటి షరతులు లేకుండా తేమ, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వమే రైతులకు అండగా నిలిచి దాన్యాన్ని కొనుగోలు చేసి రైతన్నలకు అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు.మరోవైపు ధాన్యానికి గిట్టుబాటు ధర కలిపించి ఆదుకోండి మహా ప్రభో అంటు అన్నదాతలు కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వాలను చేతులు జోడించి వేడుకుంటున్నారు.

also read :- యువకుడిని నరికి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు.