Telugu News

సొంత ఖర్చులతో కాలువ తీయించుకున్న అన్నారుగూడెం రైతులు.

సొంత ఖర్చులతో కాలువ తీయించుకున్న అన్నారుగూడెం రైతులు..

0

సొంత ఖర్చులతో కాలువ తీయించుకున్న అన్నారుగూడెం రైతులు..

 

(ఖమ్మం ప్రతినిధి – విజయంన్యూస్) :-

తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామ రైతులు తమ పొలాలకు సాగునీరు వెళ్లేందుకు కాలువ తీయించుకున్నారు. అన్నారుగూడెం గ్రామ పరిధిలోని పాపినేని బ్రిడ్జి కాలువ వద్ద నుండి బాలపేట కెనాల్ పరిధిలోని నరసింహారావు పేటప్రధాన రహదారి వరకు కాలువ తీయించుకున్నారు. రైతులు తమ సొంత ఖర్చులతో ఎకరానికి వెయ్యి రూపాయల చొప్పున వేసుకొని కాలువను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలువ పరిధిలోని అనేక ఎకరాలు పంట సాగవుతోంది.

ఈ  విషయాన్ని అనేకసార్లు ఎన్ఎస్పీ అధికారులకు తెలియ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు.

దీంతో రైతులంతాఏకమై  తమ సొంత డబ్బులతో పొక్లెయిన్ ద్వారా కాలువ తీసుకున్నారు. దీంతో తమకు సాగునీటి కష్టాలు. తొలగిపోయాయి అని రైతులు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో అన్నారుగూడెం గ్రామ రైతులు గోవిందు శ్రీనివాసరావు (ట్రాక్టర్), సూదా సత్యనారాయణ, సూదా పుల్లయ్య, తోట సత్యనారాయణ, తోట వేలాద్రి, పుట్టా కిట్టు, పుత్తం రాజు, సూదా నాగేశ్వరరావు. బాబు, తోట శ్రీనివాసరావు, పుట్టా వెంకటనారాయణ తదితరులు ఉన్నారు.

also read ;-విశ్వ విజేత ఆసిస్.తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆస్ట్రేలియా.