Telugu News

రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన

5 మందితో తొలిజాబితాను సిద్దం చేసిన ఏఐసీసీ

0

రేపు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన

== 65 మందితో తొలిజాబితాను సిద్దం చేసిన ఏఐసీసీ

== నేడు స్ర్కీనింగ్ కమిటీ అత్యవసర సమావేశం

== అర్థరాత్రి ప్రకటన వచ్చే అవకాశం

== అసక్తిగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ శ్రేణులు

(హైదరాబాద్-విజయంన్యూస్)

ఎన్నికల సమయం ముంచుకోస్తున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది.. అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది.. ఇప్పటికే అభ్యర్థుల జాబితా విషయంలో ఆలస్యం చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. మరింత ఆలస్యం చేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావించి వేగం పెంచింది.. అందులో భాగంగానే సోమవారం కేంద్ర ఎన్నికల  స్ర్కీనింగ్ కమిటీ  అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ ఆగ్రనేతలు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: నేడు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్  విడుదల

అందులో భాగంగానే ఇప్పటి వరకు సింగిల్ పేరు ఉన్న వాటిని మొదటి లిస్ట్ లో ప్రకటించాలని నిర్ణయించింది. మంగళవారం అర్థరాత్రి సమయానికి మొదటి లిస్ట్ ను ప్రకటించే అవకాశం ఉంది. పదికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్న, పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలు మినహా మిగిలిన వాటిని ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. టిక్కెట్ రాని వారిని బుజ్జగించేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు ఏఐసీసీ ఆగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేసే అవకాశం ఉంది.

== 65 మందితో రేపు అభ్యర్థుల ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ప్రకటనపై ద్రుష్టి సారించింది. 119 నియోజకవర్గాలకు గాను 65 నుంచి 71 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఒక పేరుతో సిద్దం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని సింగిల్ పేర్లను పంపించగా, కేంద్ర స్ర్కీనింగ్ కమిటీ ఆధ్వర్యంలో కొన్ని నియోజకవర్గాలకు సింగిల్ పేర్లను ఖరారు చేసి ఏఐసీసీ ఆగ్రనేతలకు పంపించినట్లు తెలుస్తోంది.  మొదటి విడతగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే వాటిని రెండవ విడతలో ప్రకటించే అవకాశం ఉంది.  మొదటి విడతలో ఉమ్మడి జిల్లాకు 5 నుంచి 6పేర్లను ప్రకటించే అవకాశం కన్పిస్తోంది..

ఇది కూడా చదవండి: రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే : పొంగులేటి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిండెంట్ మదుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య, ప్రస్తుత ఎమ్మెల్యేలు సీతక్క, పోడెం వీరయ్య, జగ్గారెడ్డి తో పాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పాలేరు, ఖమ్మం సీట్లను తరువాత ప్రకటించే అవకాశం ఉంది. గిరిజన స్థానాలు, దళిత స్థానాల్లో ఒక్కోక్కటి ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో కూడా ఐదు నుంచి ఏడు స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతిమణి పద్మావతి, కొమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, అద్దంకి దయాకర్, నకిరికల్ వేముల వీరయ్య లతో పాటు సూర్యపేట ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదిలాబాద్ లో ప్రేమ్ సాగర్ తో పాటు మరి రెండు స్థానాలను పైనల్ చేసే అవకాశం ఉంది. అయితే అభ్యర్థలు ప్రకటన ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళనలో పార్టీ శ్రేణులు చాలా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. త్వరగా ప్రకటిస్తే బాగుండును అంటూ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.