బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఇంట్లో మరో సంఘటన
== సాయితో నిశ్చితార్థమైన యువతి విజయ ఆత్మహత్యయత్నం
== నిద్రమాత్రలు మింగిన యువతి
(ఖమ్మం-విజయం న్యూస్);-
బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఇంట్లో మరో సంఘటన జరిగింది. సాయిగణేష్ తో నిశ్ఛితార్థం చేసుకున్న యువతి విజయ శనివారం ఆత్మహత్యయత్నం చేసుకుంది. నిద్రమాత్రలు మింగిన యువతిని స్థానికులు, కుటుంబ సభ్యులు తక్షణమే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాల్లోకి వెళ్లే ఖమ్మం నగరంలోని చర్చికంపౌండ్ పరిసరప్రాంతాల్లో నివాసం ఉంటున్న సాయిగణేష్ పై పోలీసులు ఇటీవలే పీడీయాక్ట్ కేసు నమోదు చేశారు. దీంతో మనస్తాపానాకి గురైన సాయిగణేష్ ఈనె 14న పోలీస్ స్టేషన్ అవరణంలోనే పురుగులు మందుతాగి ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషయమించడంతో హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
also read :-ప్రజాదర్బార్ విలేకరిపై సర్పంచ్ భర్త దాడి
కాగా ఆయన ఈనెల 16న 16న మృతి చెందాడు. దీంతో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున్న ఆందోళన చేశారు. జాతీయ, రాష్ట్రస్థాయి, జిల్లా బీజేపీ నాయకత్వం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేశారు. రాస్తోరోకలు, ధర్నాలు చేశారు. ప్రభుత్వాసుపత్రికలో తలుపులను ద్వంసం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్లెక్సిలను తగలబెట్టారు. అనంతరం రాష్ట్ర,జాతీయ స్థాయి నాయకులు, కేంద్రమంత్రులు ఖమ్మంలో పర్యటించిన సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. వారం రోజుల పాటు సంతాప సభలు నిర్వహించారు.
also read :-విద్యార్థులు చదువులతో పాటు క్రీడాల్లో రాణించాలి
ప్రధాని నరేంద్రమోధీ, హోమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా స్పందించి సాయిగణేష్ కు నివాళ్లు అర్పించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామినిచ్చారు. అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల పనితీరుపై మండిపడ్డారు. సమగ్రవిచారణ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రమేష్ తదితరులు ఖమ్మం నగరానికి వచ్చి సంతాపసభలో పాల్గొన్నారు. ఆయన కుటుంబానికి రూ.8లక్షల చెక్కులను అందించారు. అనంతరం ఈ కేసును హైకోర్టులో కూడా వేశారు.
అయితే అంతా పర్వాలేదు. కొంత మేరకు ఖమ్మంలో ఉద్రికత్త పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని అనుకుంటున్న తరుణంలో మరో సంఘటన జరిగింది. సాయిగణేష్ తో నిశ్చితార్థం చేసుకున్న యువతి విజయ ఆత్మహత్యయత్నం చేసింది. ఇంట్లో ఉన్న ఆమె నిద్రమాత్రలు మిగింది. దీంతో ఆమె అపరమాత్మకస్థితిలోకి వెళ్లిపోయింది. స్థానికులు ఆమెను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. యువతి ఆరోగ్యంగా ఉండాలని, తిరిగి నిండైన ఆరోగ్యంతో ఇంటికి రావాలని ఆకాంక్షించారు.