రాగల 24గంటల్లో మరో అల్పపీడనం
ఈనెల 27 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం.
ప్రకటించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
(హైదరాబాద్ –విజయంన్యూస్) :-
హైదరాబాద్: దక్షిణ బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27 వరకు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. మంగళవారం దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు చెప్పింది. అలాగే తెలంగాణలోకి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి కింది స్థాయి గాలులు బలంగా వీస్తున్నాయని పేర్కొన్నది. దీంతో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఈశాన్య దిశ ఉపరితల గాలులు గంటకు ఆరు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.
also read :- ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ వేసిన కవిత.