Telugu News

తెలంగాణలో తెరపైకి మరో పార్టీ

ఆ దిశగా అడుగులేస్తున్న మాజీ ప్రజాప్రతినిధి

0

తెలంగాణలో తెరపైకి మరో పార్టీ

== ఆ దిశగా అడుగులేస్తున్న మాజీ ప్రజాప్రతినిధి

== ప్రాంతీయ పార్టీని ప్రారంభించే అవకాశం

== భారీ స్కెచ్ వేసిన కీలక నాయకుడు

== ఆయన వ్యూహమేంటి..?

పెట్టుకుంటే కొండతో  ఢీకొట్టుకోవాలి.. గులకరాయితో ఢీకొట్టుకుంటే ఏముంటుందన్నా నానుడి ఆ నాయకుడ్ని చూస్తే అర్థమవుతుంది..దేశ ప్రధానినే వణికిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి నిద్రపట్టకుండా చేస్తున్న మాజీ ప్రతినిధి .. జనవరి 1, 2023న బీఆర్ఎస్ పార్టీకి రామ్ రామ్ ప్రకటించారు..  ఆ నాటి నుంచి చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నానరు.. అయితే ఆయన వేరే పార్టీలోకి వెళ్తారా..? కొత్తపార్టీ పెడతారా..? అనే అంశంపై ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారింది.. జనవరి 1 నుంచి ఆయన ప్రకటన చేసిన తరువాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి.. ఈ నేపథ్యంలో ఆయన పేరు ప్రస్తుతం ఏ మూలాన చూసిన వినిపించే పరిస్థితి ఏర్పడింది..  రాష్ట్ర వ్యాప్తంగా ఆయన గురించే చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొత్త రాగం బయటకు వచ్చింది.. మాజీ ప్రజాప్రతినిధి మరో కొత్తపార్టీని స్థాపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.. కొత్త పార్టీ కాదు.. పాత పార్టీ పేరుతోనే రంగంలోకి రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. నిజంగా పార్టీని నడిపించబోతున్నారా…? లేదంటే ప్రచారమేనా..? చూద్దాం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మాజీ ఎంపీ పొంగులేటి వ్యూహం ఎవరికి అర్థం కావడం లేదు.. సీనియర్ పొలిటిషయన్లకు, రాజకీయ విశ్లేషకులకే అందని విధంగా పొంగులేటి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఎవరు ఊహించని విధంగా అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి ఇతర పార్టీలో చేరేందుకు సిద్దమైయ్యారని అందరు ఊహించారు.. బీజేపీనా..? కాంగ్రెస్ లోకా..? వైసీసీ లేదా వైఎస్ఆర్ టీపీ లోకా అని అందరు ఊహించారు… ఆయన వర్గీయులు కూడా దాదాపుగా బీజేపీ పార్టీలోకే అని డిసైడ్ అయ్యారు.. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయడం లేదు.. స్వంత కుంపటి పెట్టుకునే పనిలో నిమగ్నమైయ్యారు.. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 9ఏళ్ల పాటు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీ పేరుగా ప్రఖ్యాత గాంచిన ‘టీఆర్ఎస్’ పార్టీ పేరుతో కొత్త పార్టీని స్థాపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది..?

ఇది కూడా చదవండి: “మట్టా” పయనమెటో….?

అందులో భాగంగానే ఆయన ముందునుంచే పక్కా ప్రణాళికతో అడుగులేస్తున్నట్లుగా కనిపిస్తోంది.. అభ్యర్థులను ప్రకటించడం, అందరు పోటీ చేస్తారని చెప్పడం వెనక ఇంత రహస్యం ఉందా..? అని రాజకీయ విశ్లేషకులే ముక్కున వేలేసుకునే పరిస్థితికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకొచ్చారనేది రాజకీయ వ్యూహమే. అందులో సందేహమే లేదు.  రాజకీయ వ్యూహానికే నిలువుటద్దమైన సీఎం కేసీఆర్ కే వరసగా షాక్ లిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో..? చూడోచ్చు.. అయితే ఆయన నిజంగా టీఆర్ఎస్ పార్టీ పెడతారా..? పెడితే ఆ పార్టీ రిజిస్ట్రేషన్ ఏ విధంగా వస్తుంది..? ఎలాంటి ఆలోచన చేస్తున్నారు..? లేదంటే ఇదంతా గాలిలో మేడలేనా..? ఉత్తుత్తి ప్రచారమేనా..? మరింత వివరాలు చూద్దాం..

ఇదికూడా చదవండి: రేగా అభివృద్ధి పై చర్చకు సిద్దమా..?: పాయం

బీజేపీ పార్టీకి కొరకరానికొయ్యగా మారిన సీఎం కేసీఆర్ కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొరకరాని కొయ్యగా మారాడనే చెప్పాలి. జాతీయ రాజకీయాలకు బీఆర్ఎస్ తో వెళ్లిన సీఎం కేసీఆర్ కు అదిలోనే హంసపాదు అన్నట్లుగా పార్టీ స్థాపించిన కొద్ది రోజులకే అత్యంత కీలక నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వర్గీయులు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీలో వణుకుపుట్టిందనే చెప్పాలి. ఆయన్ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం లేకుండా పోతుంది. శ్రీనివాస్ రెడ్డి రోజురోజుకు ప్రజాభిమానాన్ని చొరగొంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం పెట్టిన విఫరీతమైన జనం తరలివస్తున్నారు.  అయితేపొగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయన బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ టీపీల్లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆయన మాత్రం ఏ పార్టీలో చేరేది ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఆయా పార్టీల నాయకులతో సుదీర్ఘ చర్చలు చేశారు. కానీ ఏ పార్టీలోకి వెళ్లేది ఇప్పటి వరకు చెప్పలేదు.

== అభ్యర్థుల ప్రకటనే సంచలనం

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  పార్టీని స్థాపించలేదు.. మరో పార్టీలోకి వెళ్లలేదు.. వేరే పార్టీలోకి వెళ్తామని చెప్పలేదు. కానీ ఆయా నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రం స్వయంగా ప్రకటిస్తున్నారు. అంతే కాకుండా కచ్చితంగా వారే పోటీ చేస్తారని, నా అభిమానులు కష్టపడి పనిచేసి గెలిపించాలని కోరుతున్నారు.

ఇదికూడా చదవండి: నేను తలుచుకుంటే..? అడుగుపెట్టగలవా రేవంత్ :రేగా

ఖమ్మం జిల్లా పరిధిలో కొద్ది రోజులుగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. బహిరంగంగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్నారు. పినపాకలో మొదలైన విమర్శలు నేటికీ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో అడుగు ముందుకేసి పినపాక, వైరా, ఇల్లందు, అశ్వరావుపేట, మధిర నియోజకవర్గాలకు తన అభ్యర్థులను ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఆయా మండలాల్లో పొంగులేటి శ్రీనన్న పేరుతో కార్యాలయాలు ఓపెన్ చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరకముందే ఆయన తన అభ్యర్థులను ప్రకటించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

== కొత్త పార్టీ వైపు అడుగులు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అడుగులు ఎవరికి అర్థం కావడం లేదు.. ఆయన ఎటువైపు అడుగు వేస్తారో..? లేదంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారో..? ఎవరికి అర్థమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వైపు బీజేపీ పిలుస్తోంది అంటుంటే..? మరో వైపు కాంగ్రెస్ నేతలు కావుకావు అంటున్నారు.. ఏమోద్దు మన పార్టీ నడుపుకోమని వైసీపీ శ్రేణులు ఆహ్వానిస్తుంటే, నాకు కచ్చితంగా పొంగులేటి మాటిచ్చాడు.. నా పార్టీ బాగోగులన్ని ఆయనకు తెలుసు అంటూ వైఎస్ షర్మిళ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇంకేముందే రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ గా మారింది.

ఇది కూడా చదవండి: స్వంత గూటికా..?సోదరి గూటికా..?  పొంగులేటి దారేటు..?

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కచ్చితంగా బీజేపీ లేదంటే వైఎస్ షర్మిళ పార్టీలోకి వెళ్లడం ఖాయమనుకున్నారు. కానీ పొంగులేటి మాత్రం తన బాదనంతా కడుపులోని దాచుకుంటూ బయటకు చాలా ఆనందంగా ఉన్నానంటూ వివిద నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్  ఇప్పటికే ఉమ్మడి ఖమ్మంలోని 10 నియోజకవర్గాలు ఉండగా.. 5 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఏ పార్టీలో చేరిన ఆయన అనుచరులకు టికెట్ ఇవ్వాలనే సంకేతమా..? లేక ఆయనే కొత్త పార్టీ పెట్టి రాష్ట్రంలో కీలక భూమిక పోషించాలనే ఆలోచన నేటికీ అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన కొత్త పార్టీ పెడుతున్నారని, అందులోనూ బీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చేలా తెలంగాణ రైతు సమితి (టీఆర్ఎస్) పేరా పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్ అంటే ఓ బ్రాండ్. ఆ పేరుతో ఆయన తన వర్గాన్ని గెలిపించుకొని అసెంబ్లీలో చక్రం తిప్పే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన పార్టీ పేరు కోసం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు పొంగులేటి అనుచరులు చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ అనే బ్రాండ్ తో ఓట్లను సునాయాసంగా కొల్లగొట్టవచ్చనే యోచనలో భాగంగానే తెలంగాణ రైతు సమితి (టీఆర్ఎస్) పేరు ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చూద్దాం.. రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?