Telugu News

భక్తరామదాసు కు మరో పైప్ లైన్ 

మూడు జీపీలకు సాగునీటి మోక్షం

0

భక్తరామదాసు కు మరో పైప్ లైన్ 

== మూడు జీపీలకు సాగునీటి మోక్షం

== భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి ప్రత్యేక పైప్ లైన్ నిర్మాణం

== రూ.1.19 కోట్ల బడ్జెట్ ని మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

== హర్షం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, రైతులు

(కూసుమంచి-విజయంన్యూస్)

ఎన్నో ఏళ్లుగా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న రైతులు, ప్రజల కోరిక అతిత్వరలోనే నేరవేరనుంది.. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి చొరవతో రైతులు, ప్రజల కోరిక తీరనుంది.. పదేళ్ల క్రితం వరకు అత్యంత కరువు ప్రాంతంగా పేరొందిన పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు పాలేరు జలాశయం బ్యాక్ వాటర్ పై భక్తరామదాసుప ప్రాజెక్టును నిర్మాణం చేయగా, ఆ ప్రాజెక్టు నుంచి మూడు మండలాలకు సాగునీటిని అందించారు. దీంతో రెండు దఫాలుగా పంటలు సాగులోకి వచ్చాయి. అయితే కొన్ని గ్రామ పంచాయతీలకు నీళ్లు అందకపోవడంతో ఆ గ్రామాల రైతులు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి వినతి చేశారు.

ఇది కూడా చదవండి: ప్రజల కోసమే పనిచేస్తున్నా: కందాళ

కూసుమంచి మండలంలోని లాల్ సింగ్ తండా, సంధ్యతండా, తిరుమలాయపాలెం మండలంలోని రాజారం,పైనంపల్లి,హాల్ తండ గ్రామ రైతులకు సంబంధించిన సుమారు 4,500 ఎకరాల చివరి ఆయకట్టుకు సాగునీరు అందించటం కోసం ప్రత్యేక పైప్ లైన్ కొరకు నిధుల మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు. కాగా స్పందించిన ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కు వినతి చేశారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ తక్షణమే ఆ కొన్ని గ్రామ పంచాయతీలకు పైప్ లైన్ నిర్మాణం కోసం రూ.1.19 కోట్ల నిధులను మంజూరు చేశారు. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేయడంతో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  ఆ పంచాయతీలతో పాటు తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు చెరువుకు నీటిని అందించడానికి ప్రత్యేక పైప్లైన్ మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ కు, అర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆయా గ్రామాల రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. రైతుల కోరిక తీర్చిన ప్రభుత్వం చల్లగా ఉండాలని దీవిస్తున్నారు. అలాగే పాలేరు నియోజకవర్గంలోని అతి కొద్ది రోజుల్లోనే మరో జీవో విడుదల చేయించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి, సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?