Telugu News

పాలేరు కు మరో రైల్వేలైన్

ఖమ్మం రూరల్, కూసుమంచి మండలం మీదగా రైల్వేలైన్ కు కేంద్రం ప్రతిపాదన

0

పాలేరు కు మరో రైల్వేలైన్

== ఖమ్మం రూరల్, కూసుమంచి మండలం మీదగా రైల్వేలైన్ కు కేంద్రం ప్రతిపాదన

== రూ‌. 5,333కోట్ల బడ్జెట్ అంచనా 

(కూసుమంచి -విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గంలో రవాణా విషయంలో ఇబ్బందులు పడుతున్న పాలేరు నియోజకవర్గ ప్రజలు..రైల్వే స్టేషన్ ఉంటే బాగుండేదని ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నారు. రైల్వే లైన్ కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూస్తున్నారు. అది కాస్తా నెరవేరే సమయం ఆసన్నమైంది. కేంద్రప్రభుత్వం కొత్త రైల్వేలైన్ కు ప్రతిపాదనలు చేసింది.

ఇది కూడా చదవండి:-  ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా  ‘షర్మిళ’

డోర్నకల్ నుంచి పాలేరు, సూర్యాపేట, నియోజకవర్గాల మీదగా గద్వాల వరకు 296కిలోమీటర్ల వరకు నూతన రైల్వే లైన్ ను కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. అందుకు గాను రూ.5,330కోట్లను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను కేటాయించే అవకాశం ఉంది. ఇది దక్షిణ తెలంగాణా ను కలిపే లైన్.. డోర్నకల్ నుంచి ఖమ్మం రూరల్ శివారు, కూసుమంచి, పాలేరు, మోతే, సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా గద్వాల వరకు నూతన రైల్వేలైన్ ను మంజూరు చేసేందుకు ప్రతిపాదన చేసింది.. అందుకు గాను 4జంక్షన్లు, 15స్టేషన్లను నిర్మాణం చేయాలని సూచించిట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి:- తుమ్మలపై మంత్రి సెటైర్.. ఏమన్నారంటే..?

ఈ రైల్వేలైన్ వల్ల ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహుబూనగర్ జిల్లాలోని ముఖ్యమైనా ప్రాంతాలన్నీ అనుసంధానమై వుంటాయి.. పత్తి, మిర్చి, బియ్యం రవాణా తో పాటు గ్రానైట్ పరిశ్రమకు అనుకూలంగా ఉండటం, సింగరేణి, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడుతుంది అని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుందని అంచనా వేశారు. అయితే ఇప్పటికే ఖమ్మం రూరల్ మండలం, నేలకొండపల్లి మండలం మీదగా ఒక రైల్వే లైన్ మంజూరు కాగా ఇప్పటికే ఆ రైల్వే లైన్ నిర్మాణాన్ని రైతులు అడ్డుకుంటున్నారు. మరీ పాలేరు మరో రైల్వే లైన్ ను నిర్మాణం చేస్తారా..? అడ్డుకుంటారా..?