Telugu News

మిసెస్ ఇండియా ఫర్హాకు మరో అరుదైన గౌరవం….

* మిసెస్ యూనివర్స్ గా మహమ్మద్ ఫర్హా....

0

మిసెస్ ఇండియా ఫర్హాకు మరో అరుదైన గౌరవం….
* మిసెస్ యూనివర్స్ గా మహమ్మద్ ఫర్హా….
*అంచెలంచెలుగా ఉన్నత స్థానాలకు అధిరోహణ…
* జాతీయ స్థాయిలో ఫర్హాకు ప్రత్యెక గుర్తింపు…
*మహిళా సాధికారిత అవేర్నెస్ అంశంలో ఫర్హాదీ కీలక పాత్ర..
* ప్రశంసల వెల్లువలో…తెలంగాణ గృహిణి…

మహిళలు తలుచుకుంటే సాధించలేనిది లేదు …. అనేది జగమెరిగిన సత్యం… ఖమ్మం జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ ఫర్హాకు ఉత్తమ బిరుదులతో పాటు మిసెస్ యూనివర్స్ పురస్కారo వరించింది… దీంతో జాతీయ స్థాయిలో ఫర్హా పేరు ఇపుడు మారుమ్రోగుతుంది…గృహిణిగా వుంటు… మహిళల సమస్యల పట్ల తన రచనలు, వ్యాసాలు, ప్రసంగాలు, అవగాహన కార్యక్రమాలతో మహమ్మద్ ఫర్హా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ఏకంగా మిసెస్ యూనివర్స్ పురస్కారాన్ని పొందారు…
అసలు ఈ మహమ్మద్ ఫర్హా ఎవరు…అనేదే కదా మీ సందేహం…ఈమెను పలువురు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు….

ఫర్హాకు తాజ్ మిస్ అండ్ మిసెస్ ఇండియా యూనివర్స్ ఆర్గనైజేషన్ అధ్వర్యంలో ఈనెల 23 న మిసెస్ యూనివర్స్ కేటగిరీలో ఫర్హాకు ఈ టైటిల్ దక్కింది… ఈ పురస్కారాన్ని ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో దేశంలోని పలు రాష్ట్రాలనుంచి వచ్చిన వివిధ మహిళలపై ఈనెల 21 నుంచి 3రోజుల పాటు జరిగిన పోటీలలో అన్ని రౌండ్లలో పైచేయి సాధించి ఫర్హా ఈ విజయం పొందారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మిస్సెస్ ఇండియా మొదటి రన్నర్ అప్ గా నిలవడంతోపాటు సెప్టెంబర్ లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వున్న వరల్డ్ హ్యుమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్( WHRPC ) వారు ఫర్హాను సభ్యత్వంతో పాటు గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు.గత అక్టోబరు లో గ్లోబల్ స్కాలర్స్ ఫౌండేషన్ వారు వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారిని గుర్తించి మహిళా సాధికారతకు తన కృషికిగాను భారతీయ‘నారీరత్న’ అవార్డ్ తో సత్కరించారు.అలాగే ఈ డిసెంబరు లో ఉత్తర్ ప్రదేశ్ లో జరగబోయే మిస్ ఆసియా మరియు మిసిస్ ఆసియా పోటీలకు ఫర్హా జూరీ మింబర్ గా ఎన్నుకోబడ్డారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ మిషన్ ( WHRJSM ) కు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వున్న ఫర్హా ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం వుంటే మహిళలు ఎంతైనా సాధించన్నారు.
మహిళా సాధికారత కోసం కృషి చేయడానికి తాను ఎల్లప్పుడూ ముందుటానని ఫర్హా తెలిపారు…. ఫర్హాకు అరుదైన గౌరవం లభించడంతో విద్యావేత్తలు, ప్రముఖలు, మేధావులు, సామాజిక సేవకులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు….

also read :- తెరాసకు గట్టు రామచంద్రరావు రాజీనామా