Telugu News

ఖమ్మం ఫారెస్ట్ శాఖకు మరో షాక్

పెనుబల్లి మండలంలో మరో సంఘటన

0

ఖమ్మం ఫారెస్ట్ శాఖకు మరో షాక్

==పెనుబల్లి మండలంలో మరో ఘటన

== ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోటర్ సైకిల్ దగ్ధం

== అటవీ సమీపంలో వరిపొలంలో ద్విచక్రవాహనం పార్క్ చేయగా నిప్పంటించిన దుండుగులు

== ఫారెస్ట్ శాఖలో భయం..భయం

(ఖమ్మం,పెనుబల్లి-విజయంన్యూస్)

ఒక పక్క ఫారెస్ట్ అధికారులపై దాడులు.. మరో పక్క ఫారెస్ట్ అధికారిని హత్య చేయడంతో ఫారెస్ట్ శాఖలోనే భయాందోళన నెలకొనగా, ఆ సంఘటనలు మర్చిపోకమునుపే మరో సంఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మోటర్ సైకిల్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పటించి పరారైయ్యారు.

Allso read-గుత్తి కోయల దాడిలో గాయపడిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మృతి

దీంతో ఫారెస్ట్ శాఖలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎఫ్ఆర్వో హత్య అనంతరం మాకు రక్షణ కల్పించాలని, మాకు ఆయుదాలు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులు ఆందోళన చేస్తుండగానే మరోక సంఘటన జరగడంతో వాళ్లు ప్రభుత్వంపై మరింత డిమాండ్ పెంచే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మళకుంట శివారులో అడవిలో వేటగాళ్లు జంతువుల కోసం కరెంటు వైర్లు బిగిస్తున్నారనే సమాచారం ఫారెస్ట్ అధికారులకు తెలిసింది. దీంతో సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కాళీ ద్విచక్ర వాహానంపై సంఘటనకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. కాగా వరిపోలాలు అడ్డు రావడంతో ఆయన పోలం పక్కనే మోటర్ సైకిల్ ను అక్కడ పెట్టి లోపలికి వెళ్లి వచ్చి తిరిగి చూసే సరికి గుర్తు తెలియని వ్య‌క్తులు మోటర్ సైకిల్ కు నిప్పు పెట్టి తగులబెట్టారు.

Allso read-ఖమ్మం లో మంత్రులకు నిరసన సెగ

 సమీప రైతులు, ఫారెస్ట్ అధికారి ఫోన్ చేసి తెలియ‌జేయ‌టంతో సంఘటనా స్థలానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఈ లోపే వాహనం పూర్తిగా దగ్ధం అయ్యింది. దీంతో ఆ ఫారెస్ట్ అధికారి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంతలో మీడియాలో రావడంతో ఫారెస్ట్ అధికారులు, ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. అయితే  చండ్రుగొండ మండలం బెండాలపాడు ఘటన మరవక ముందే మరో ఘటన జరగటంతో అటవీ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఫారెస్ట్ అధికారులు విధులను బహిష్కరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Allso read:-ఎఫ్ఆర్వో కుటుంబానికి వద్దిరాజు రూ. 2 లక్షల ఆర్థిక సాయం