నగరంలో మరో రెండు వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్లు : మంత్రి పువ్వాడ
◆ ఒక్కో మార్కెట్ కు రూ.4.50కోట్లు.. 134 స్టాల్స్.
నగరంలో మరో రెండు వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్లు : మంత్రి పువ్వాడ
◆ ఒక్కో మార్కెట్ కు రూ.4.50కోట్లు.. 134 స్టాల్స్.
◆ అన్ని ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా చర్యలు.
◆ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ.
◆ త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశం.
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నగర ప్రజల సౌకర్యార్థం కూరగాయలు, పండ్లు, మాంసాహారం, చేపలు తదితరుల నిత్యావసర వస్తువులు అన్ని ఒకే చోట అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందుకు తగు చర్యలు చేపట్టారు.ఖమ్మం నగరం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌ను ఆధునాతనంగా నిర్మించనున్నారు. ఖమ్మం నగరంలోని ఖానాపురంలో రూ. 4.50 కోట్లు, వీడిఓస్ కాలనీలో రూ.4.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను బుధవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మేయర్ పునుకొల్లు నీరజ తో కలిసి పరిశీలించారు.
also read:-బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు పోడియం ముత్యాలమ్మ ఆగ్రహం
ఖానాపురం, వీడిఓస్ కాలనీ లోని ఒక్కో మార్కెట్ నకు 2.01 ఎకరాల్లో నిర్మిస్తున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ లో వెజ్ స్టాల్స్-65, ఫ్రూట్ స్టాల్స్ – 23, నాన్-వెజ్ స్టాల్స్ -46 మొత్తం-134 స్టాల్స్ తో అన్ని సౌకర్యాలు ఒకే చోట ప్రజలకు కావలసినవి అందుబాటులో ఉండనున్నాయి. ఆయా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని మున్సిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి కి, సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రద్దీని నివారించేందుకు మార్కెట్ కు వచ్చే వారికి, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవకాశం ఉన్న అన్ని వైపులా రోడ్డు అనుసంధానం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడలని, ఈ సందర్భంగా మార్కెట్ ప్లాన్ మ్యాప్‌ను మంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు.పట్టణాలను అన్ని మౌలిక వసతులతో పరిశుభ్ర పట్టణాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ముందుకు వెళ్తుందని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు, పట్టణాల అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటుందన్నారు.
also read :-బిజెపి ప్రభుత్వానికి పతనం తప్పదు
అన్ని పట్టణాలలో మంచి వసతులు ఉండాలనే ఉద్దేశంతోనే రెండెకరాల స్థలంలో రూ.4.50 కోట్ల నిధులతో సమీకృత వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.కోట్ల రూపాయల విలువైన భూమిని ప్రజల సౌకర్యార్థం ఇక్కడ వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, త్వరితగతిన ఆయా నిర్మాణ పనులు పూర్తి చేసి వాడుకలోకి తేవాలని ఆదేశించారు.
మార్కెట్ ప్రాంగణంలో పార్కింగ్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించాలన్నారు. పచ్చదనం ఉట్టిపడేలా మొక్కలు నాటాలని, అంతేకాకుండా రైతులు, వ్యాపారులు, వినియోగదారుల కోసం త్రాగునీటి వసతులు, కూర్చోడానికి బల్లాలు ఏర్పాటు చేయాలన్నారు.
ఇప్పటికే ఖమ్మం నూతన బస్ స్టాండ్ వద్ద నిర్మించిన వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ మంచి ఫలితాలను ఇస్తుందని, అన్ని ఒకే చోట దొరకడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.
ఎక్కడి ప్రజలకు అక్కడే వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయడంతో దూరప్రాంతాలకు వెళ్లే బాధలు తప్పాయని మంత్రి అన్నారు.