తెలంగాణ వ్యతిరేకి ప్రధాని నరేంద్ర మోడీ…..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై ప్రధాని మోడీ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం....
తెలంగాణ వ్యతిరేకి ప్రధాని నరేంద్ర మోడీ…..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై ప్రధాని మోడీ వాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం….
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతో మాట్లాడుతున్నారు…..
ప్రధాని మోడీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించారు….
తెలంగాణ ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలి…..
తెరాస ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు, చిoతనిప్పు కృష్ణ చైతన్య …..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీద పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మoత్రి అజయ్ కుమార్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెరాస ఖమ్మం జిల్లా యువజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు.ఖమ్మం నియోజకవర్గ పరిధిలో బీజేపీ పార్టీకి, ప్రధాని మోడీ కి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జిలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీజేపీకి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.
also read :-అనుకున్నదొక్కటి… అయినది మరొక్కటి.
ఈ సందర్బంగా మాట్లాడుతూ భారత పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రధాని తెలంగాణ పై అక్కసును బయటపెట్టారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై మోడీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, ఉద్యమకారులను అవమానించేలా ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజల 60ఏళ్ల పోరాటంలో ఎంతో మంది ఉద్యమకారులు ప్రాణ త్యాగాలు చేసి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావు అంచుల వరకు వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే స్వయంగా దేశ ప్రధానే ఈవిధంగా మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు.
also read :-శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
గడిచిన 7ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సహకారం అందించకున్న ఆకుపచ్చ తెలంగాణగా, ఆరోగ్య తెలంగాణగా బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు తీసుకెళ్తుంటే బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పై మొదటి నుండి కక్ష్యపూరిత దొరనితోనే వ్యవహారిస్తోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.