Telugu News

అభ్యర్థులు ఎవరైనా పార్టీ గెలుపే లక్ష్యం: పువ్వాళ 

నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీల పోస్టర్ ఆవిష్కరణ

0

అభ్యర్థులు ఎవరైనా పార్టీ గెలుపే లక్ష్యం: పువ్వాళ 

== జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్

== నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీల పోస్టర్ ఆవిష్కరణ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

కాంగ్రెస్ లో అభ్యర్తులు ఎవరైనా పార్టీ గెలుపే ప్రధాన లక్ష్యమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ స్పష్టం చేశారు.మంగళ వారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఇది కూడా చదవండి:- సీఎం కేసీఆర్ కు విక్రమార్కుడే టార్గెటా..?

ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే వాటిని అమలు చేస్తామాని తెలిపారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున అధికారులు బిఆర్ఎస్ మత్తు వీడి నిస్పాక్ష పాతంగా వ్యవహరిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను పాటించాలని సూచించారు. నగరంలో ఫ్లెక్సీ ల తొలగింపులో కొంత మంది అధికారులు తీరు ఎన్నికల కమిషన్ నియమావళి కి విరుద్ధంగా ఉందని బీ ఆర్ ఎస్ పార్టీ నేతల ఫ్లెక్సీ లను తొలగించకుండా ముసుగు కప్పి ఉంచుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ మాత్రం తొలగిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు అన్ని విధాల సహకరిస్తుందని అధికారులు ఇప్పటికైన బి ఆర్ ఎస్ మత్తు వీడి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ…ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి 24 గంటలు గడుస్తున్నప్పటికీ అధికారులు ఇంకా బీ ఆర్ ఎస్ మాయలో నే ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:-;కామ్రెడ్లతో కాంగ్రెస్ దోస్తి..బీఆర్ఎస్ తో కుస్తి

నగరంలో  పువ్వాడ అజయ్ బోర్డులు విపరీతంగా కనిపిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ కి సంబంధించిన బోర్డులను మాత్రమే తొలగించారని తెలిపారు. అధికారులు ఇప్పటికైనా టిఆర్ఎస్ మత్తు వదిలి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను బేఖాతారు చేయకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పువ్వాడ అజయ్ పేరుతో ఉన్న బోర్డులను తొలగించకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు వాటిని తొలగిస్తారని హెచ్చరించారు. వాల్ పెయింట్స్ కి సంబంధించి నగరంలో  బీఆర్ఎస్వి  కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయని కాంగ్రెస్ వి మాత్రం ఎక్కడో ఒకటి మాత్రమే ఉన్నాయని వాటికి మున్సిపల్ కమిషన్ 4 లక్షల 14 వేల రూపాయలు ఫైన్ వేసిందని ఈ లెక్క ప్రకారం చూస్తే పువ్వా డ అజయ్ కుమార్ పేరుతో  ఉన్న పోస్టర్ లకు సుమారు 4 కోట్ల రూపాయలు చెల్లంచాల్సి ఉంటది అన్నారు.ప్రభుత్వ అధికారుల తీరు ఇప్పటికైన మార్చుకావాలని హెచ్చరించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు

ఇది కూడా చదవండి:- తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలను బూత్డివిజన్ అధ్యక్షులతో కలిసి  ప్రతి గడపకు చేరవేయడం జరుగుతుందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరిగిందని ఈ సారి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే కాంగ్రెస్ హామీలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో ప్రచారాలు ముమ్మరం చేయాలని కాంగ్రెస్ కార్యాచరణ ప్రణాళిక ప్రజల్లోకి తీసుకెల్లాలని సూచించారు.                        

ఇది కూడా చదవండి:- పేదలు ప్రశ్నిస్తే దాడి చేస్తారా..?: జావిద్

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మలిదువెంకటేశ్వర్లులాకవత్ సైదులుదుద్దుకురి వెంకటేశ్వర్లుకొప్పెర సరిత ఉపేందర్జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బాల సౌజన్యసీనియర్ కాంగ్రెస్ నాయకులు చోటే బాబామాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరరావుజిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపా అధ్యక్షుడు కొంటేముక్కుల నాగేశ్వరరావు,రఘునాథ పాలెం మండల అధ్యక్షుడు భూక్యా బాలాజీసేవా దల్ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్డివిజన్ అధ్యక్షులు సయ్యద్ మహమూద్బోజెడ్ల సత్యనారాయణషేక్ రజికొలికపొంగు రమేష్పర్వత శ్రీనువీరయ్య గౌడ్,భిమరెడి రమేష్సక్రుఖదీర్జాని పాషాతది తరులు పాల్గొన్నారు