Telugu News

నాడు..నేడు అదే గోస.. గిరిజనుల అరిగోస

ఐదు పంచాయతీలపై  ‘విజయం పత్రిక,టీవీ’ గ్రౌండ్ రిపోర్ట్

0

అదివాసుల అరిగోస

== గిరిజన బిడ్డలపై ప్రభుత్వాల చవితి ప్రేమ

== జిల్లా కేంద్రానికి పోవుడేంటే 200మైళ్లు వెళ్లాల్సిందే

== కనుచూపు మేర రామయ్య సన్నిది

== కలుసుంటామంటుంటే కష్టముంటున్న సర్కార్లు

== ఏళ్ల తరబడి మగ్గుతున్న గిరిజనం

== గుంతల రోడ్లు.. గుట్టల ప్రాంతాలు.. అంతంతమాత్రానే రవాణాసౌకర్యం

== పలకరించే నాథుడే కరువు..

==  సమస్యల వలయంలో ఆ ఐదు పంచాయతీలు

== తెలంగాణలో కలిపితేనే న్యాయం అంటున్న జనం

== ఐదు పంచాయతీలపై  ‘విజయం పత్రిక,టీవీ’ గ్రౌండ్ రిపోర్ట్

(పెండ్ర అంజయ్య, చీఫ్ ఎడిటర్)

భద్రాద్రికొత్తగూడెం, జులై 28(విజయంన్యూస్)

‘మేడిపండు చూడు మెలిమినై ఉండు..పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అన్న పద్యాన్ని కొంత మార్చి ‘గిరిజనుల పేరు చూడు మెలిమినై ఉండూ..పొట్ట విప్పిచూడు బాధలుండు’ అన్నట్లుగా మారింది అదివాసి గిరిజనుల పరిస్థితి. అన్ని ఉండి అల్లుడు నోట్లో శని అన్నట్లుగా ఉంది ముంపుప్రాంత గ్రామ పంచాయతీల పరిస్థితి.. అన్ని ఉన్నట్లుగానే అనిపిస్తుంది కానీ.. అక్కడ ఏమి లేదనేది వారి గోడు వింటే అర్థమవుతుంది.. కదిలిస్తే కన్నీళ్లే వస్తున్న దుస్థితి ఉంది.. గిరిజనుల పేరు చెప్పుకొని రాజులవుతున్న ప్రజాప్తరినిధులు ఆ గిరిజనుల గోస పట్టించుకునే నాథుడే కరువైయ్యారు.. నాడు అదే గోస.. నేడు అదే గోస.. రాష్ట్రం మారితే కష్టాలు పోతాయని ఆశపడిన గిరిజనులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.. రాష్ట్రం మారిన కష్టాలు పోలేదు.. కాదుకదా..? ఉన్నది పోయింది..దాసుకున్నది పోయింది అన్నట్లుగా తయారైంది వారి పరిస్థితి.. చెప్పకుందామంటే వినేవారు లేరు.. పక్కనూరోళ్లకు చెబుదామంటే మా రాష్ట్రం వేరు మీ రాష్ట్రం వేరు అని అంటున్నరు.. స్వంత రాష్ట్రమోళ్లు రావాలంటే 250కిలోమీటర్ల దూరమాయే.. బాధలేవ్వరికి చెప్పేది అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే తెలంగాణ, ఏపీల నడుమ కొనసాగుతున్న ఐదు పంచాయతీల గొడవ పై విజయం పత్రిక, టీవీ బృందం స్పందించింది. ఐదు గ్రామ పంచాయతీల పరిస్థితిపై నేరుగా గిరిజన బిడ్డలను కలిసి పరిస్థితులను తెలుసుకునేందుకు, వాళ్లతో మాట్లాడిన బృంధం వారి కష్టాలను, నష్టాలను సమాజానికి తెలిసేందుకు గ్రౌండ్ రిపోర్ట్ అందించేందుకు ఆగ్రామాల్లో పర్యటించారు. అందులో భాగంగానే ఐదు పంచాయతీల పై ‘విజయం’ గ్రౌండ్ రిపోర్టు..

allso read- రాజగోపాలడు.. రాజీ‘నామమే’నా..?

 

ఒక్క అడుగు.. ఆ ఒక్క అడుగు మాకిచ్చేయండి.. మా బతుకులు మారతయ్.. మా కష్టాలు తీరతయ్.. మా బానిస బతుకులు పోతయ్.. మా జీవితాల్లో వెలుగులు వస్తయ్.. అంటూ చత్రపతి సినిమాలో నిరుపేద ప్రజల కోసం ఉపయోగించిన ఆవేదన పూరిత డైలాగ్ ఇది. నిజంగా అదే పరిస్థితి కనిపిస్తోంది పోలవరం ముంపు శివారు గ్రామాల పరిస్థితి.. గతంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామాలు పోలవరం కోసం ముంపుగ్రామాలుగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేశారు. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్లుగా ఆ అదివాసి ప్రజల జీవితాల్లో మార్పులోచ్చాయి.. అనుకుంటే పొరపాటే రాష్ట్రం మారిన తరువాత వారి జీవితాలు దుర్భరంగా తయారైయ్యాయి.. చాలా చివరి గ్రామాలు కావడంతో వాళ్లను పట్టించుకునే నాథుడే కరువైయ్యారు. అభివద్ది లేదు.. పల్లెల్లో సమస్యలు తాండవిస్తున్నాయి.. డ్రైనేజీ సమస్య తీవ్రతరంగా ఉంది. సరైన రోడ్లు లేవు, గుంతల పడిన రహదారులు. సరైన రవాణా సౌకర్యం ఉండదు.. కొన్ని ప్రాంతాలకు వెలుగులే ఉండవు. ఇలా గిరిజన బతుకులు చాలా దారుణంగా ఉన్నాయంటే నిజంగా నమ్మాల్సిందే.

== నాడు అదే గోస

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని కుక్కనూరు, వేలూరుపాడు, చింతూరు, కూనవరం, వీఆర్ పురం 5మండలాలు ఉండేవి. అవి కాస్త పోలవరం ప్రాజెక్టులో కలిసిపోయాయి. అందులో ఎటపాక, పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్నం గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ పంచాయతీలకు పోలవరం చాలా దూరం. సుమారు 350 కిలోమీటర్లు ఉంటుందని అక్కడ గిరిజనులు చెప్పారు. అయితే ఈ పంచాయతీలన్ని భద్రాచలం పట్టణానికి కూసింత దూరంలోనే ఉన్నాయి.. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటపాక దాదాపుగా భద్రాచలం పట్టణంలోనే కలిసిపోయింది. పిచ్చుకలపాడు, కన్నాయిగూడెం, గుండాల, పురుషోత్తపట్టం కొంత దూరంగా ఉన్నప్పటికి సుమారు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామ పంచాయతీలు మాత్రమే. అయితే ఈ పంచాయతీలు ప్రజలు నాడు అదే గోస పడ్డారు.. నేడు అదే గోస పడుతున్నారు..

allso read- భద్రాచలం భవిష్యత్తేమిటి?

వందేళ్లైనప్పటికి వారి జీవితాల్లో మార్పులు రావడం లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికి వారందరికి ఖమ్మం జిల్లా కేంద్రంగా ఉండేది. భద్రాచలంలో ఐటీడీఏ ఉన్నప్పటికి వారు ఖమ్మం జిల్లాగా జీవనం సాగించేవారు. అప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 200 కిలోమీటర్లకు పైగా వారు ప్రయాణించాల్సి వచ్చేంది. 50ఏళ్ల క్రితం కరకట్టలు లేకపోవడం, వంతెనలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడిన పరిస్థితి ఉండేది. ఇక వంతెనలు నిర్మాణం చేసినప్పటికి వారు జిల్లా కేంద్రానికి రావాలంటే సుమారు 5గంటల ప్రయాణం ఉండేది. వారికి ట్రౌన్ సౌకర్యం లేకుండా ఉంది. ఇక రాజదానికి రావాలంటే సుమారు 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడేవారు. రాజదానికి పోవాలంటే రెండు రోజుల ముందుగానే హైదరాబాద్ కు బయలుదేరేవారు. ఇక చదువుల విషయంలో వందల కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో యువకులందరు ఇండ్లను, బందువులను, కుటుంబ సభ్యులను వీడి హాస్టల్స్ లో ఉండి చదువుకునే వారు. వందలాధి యువకులు తల్లిదండ్రులకు వ్యవసాయ పనులకు అసరగా ఉండేందుకు చదువులు మానేసి పరిస్థితి ఉండేది. ఇక చదువులు చెప్పేందుకు పంతుళ్లు ఆ గ్రామాలకు వచ్చేవారే కాదు.. తప్పన పరిస్థితుల్లో ఆ పాఠశాలలకు పంతుళ్లు వచ్చి చదువులు చెప్పేవారు. నక్సల్ భయంతో వణికిపోతూ ఉద్యోగాలు చేసేవారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా అలాగే ఉండేది. సరైన వైద్యం కావాలంటే ఖమ్మం కేంద్రానికి రావాల్సి ఉంటుంది. సాధాహరణ వైద్యం అయితే భద్రాచలం పర్వాలేదు కానీ, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం రావాలంటే అంబులెన్స్ ఖర్చులే తడిసి మోపడేవుతుండేవి. డబ్బులు లేక నాటు మందులు వాడిన పరిస్థితి ఉందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సరైన వైద్యమందక వందలాధి మంది గిరిజనులు, అదివాసి బిడ్డలు చనిపోయినట్లు గిరిజనులు తమ గోడు చెప్పుకుంటున్నారు.

== నేడు ఇదే గోస

రాష్ట్రం మారితే మా బతుకులు మా మారతాయని ఆ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఆశపడ్డారంటా..? ఉమ్మడి రాష్ట్రంలో ఉండి వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇబ్బందులు పడిన మేము, రాష్ట్రం మారితే జిల్లా కేంద్రమైన దగ్గరగా వస్తుంది, అధికారులు అందుబాటులో ఉంటారని భావించారంటా..? కానీ అనుకున్నది ఒక్కటి..అయినది మరోక్కటి అన్నట్లుగా వారి జీవితాలు మారాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఉన్నప్పటికి జిల్లా కేంద్రానికి సుమారు 350 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. గతంలో రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు పాడేరు జిల్లా కేంద్రంగా ఉందని చెబుతున్నారు. చాలా మందికి జిల్లా కేంద్రం ఎక్కడంటే కూడా చెప్పలేని పరిస్థితిల్లో గిరిజనులు ఉన్నారంటే వారి పరిస్థితి ఏలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే మెరుగైన వైద్యం, మెరుగైన చదువులు కావాలంటే సుమారు 250 నుంచి 300కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ కానీ, రాజమండ్రి కానీ వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. చిన్న పిట్టి కేసు అయితే  కోర్టుకు 250 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు కేసులంటే భయపడాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు కాకుండా కాళ్లు పట్టుకొనైన రాజీ పడాల్సిన పరిస్థితి వస్తుందని చెబుతున్నారు.

allso read- భద్రాద్రికి ముప్పు తప్పదా..?

== కూసింత దూరంలో భద్రాద్రి

ఏపీలో కలిసిన ఆ ఐదు పంచాయతీలకు చాలా తక్కువ దూరంలో భద్రాచలం పట్టణం ఉంది. ఎటపాకకు మూడు కిలోమీటర్లు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, పిచుకలపాడు గ్రామ పంచాయతీలకు 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం, గుండాల మరో రెండు కిలోమీటర్ల దూరం పాటు ఉన్నాయి. అక్కడ ప్రజలందరు భధ్రాచలంకు వెళ్తుంటారు. ఎదైన అవసరం అయ్యిందంటే  ఆ గ్రామాలకు చెందిన గిరిజన ప్రజలు భద్రాచలం వెళ్లి తెచ్చుకుంటారు. వైద్యం కావాలన్న, సరుకులు కావాలన్న ఏ అవసరం ఉన్న వారంత భద్రాచలం వెళ్లడమే అవుతుంది. నిత్యం భద్రాచలం వెళ్లడమే వారికి అనువాయితీగా మారాంది. కానీ ఆ భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ధరల ప్రకారం వాళ్లు కొనుగోలు చేయాల్సి వస్తుంది.

== సమస్యల వలయంలో గ్రామాలు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి గ్రామపంచాయతీలు, గ్రామాలు కావడంతో పాటు జిల్లా కేంద్రానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఆ పంచాయతీలు ఉండటంతో అక్కడ ప్రజలను పట్టించుకునే నాథుడే కరువైయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు తప్ప గ్రామాల్లో పర్యటించే అధికారులే లేరని, ఎవరైన మంత్రులు, ముఖ్యమంత్రులు వస్తున్నారంటే హాడాహుడి చేసి వెళ్లిపోతారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లు బాలేవని, డబుల్ రోడ్డు సౌకర్యం లేకపోవడం బాధాకరమన్నారు. గుంతల రోడ్లతో, ఆటోల్లో ప్రయాణిస్తున్నామని చెబుతున్నారు. చికటి పడందంటే మా గ్రామాలకు రవాణా సౌకర్యం ఉండదని రాత్రి వేళ్లలో ప్రమాదాలు జరిగినప్పుడు మా పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుందని అంటున్నారు. ఇక పంచాయతీల్లో పారిశుధ్యం ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా ఉంటాయని చెబుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే వరదల దాటికి దోమలు, విషపురుగులతో తీవ్ర ఇబ్బందులు పడతామని, కనీసం బ్లీచింగ్ చల్లించే నాథుడే కరువైయ్యారని చెబుతున్నారు. వరదలతో బోర్లు పని చేయడం లేదని, మంచినీళ్లు ఉన్నాయా..? అని అడిగే నాథుడే కరువైయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: అశ్వాపురంలో టీఆర్ఎస్ నేతల ఢిష్యూండిష్యూం

== విద్యతోనే అసలు సమస్య

ముంపు ప్రాంతాల్లో ఉన్న ఐదు పంచాయతీ ప్రజలకు అసలు సమస్య, ప్రధాన సమస్య విద్య. ప్రాథమిక విద్యవరకు ఏపీలోని వారి పంచాయతీల్లో ఉన్న పాఠశాలల్లో చదువుకున్నప్పటికి మెరుగైన, నాణ్యమైన విద్య కావాలంటే మాత్రం కచ్చితంగా రాజమండ్రి, విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఉందని అక్కడ గిరిజనులు చెబుతున్నారు. అయితే పక్కనే ఉన్న భద్రాచలంలో చదువుకోవాలంటే మాత్రం వారికి రాష్ట్ర మార్పిడి సమస్య రావడం, ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు వస్తున్నాయని యువకులు వాపోతున్నారు. అందుకే వందలాధి మంది పదోతరగతితోనే చదువులు అపిన పరిస్థితి ఉందని, నాణ్యమైన విద్య లేకపోవడంతో ఎంత చదువుకున్న ఉద్యోగాలు రాక వ్యవసాయ కూలీలుగా మారిపోతున్నారని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కష్టపడి చదవాలని, ఉద్యోగమే లక్ష్యంగా చదువుకునే విద్యార్థులు, రాజమండ్రి, విజయవాడ వెళ్లి అక్కడే హాస్టల్స్ లో ఉంటూ చదువుకుంటున్నట్లు చెబుతున్నారు. మా గోస ఎవరికి అర్థం కావడం లేదని, ఉద్యోగాలురాక, చదువులు లేక యువకులందరు పారపట్టి వ్యవసాయ పనులు చేయాల్సి వస్తుందని, వ్యవసాయం చేసుకుందాంటే పోడు సమస్య అంటూ అధికారులు వెంటపడుతున్నారని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సమస్య పోవాలంటే మాకు తెలంగాణ రాష్ట్రంలోనే కలపాలని, అప్పుడైతేనే దగ్గర్లో ఉన్న భద్రాచలంలో లేదంటే హైదరాబాద్ లో మెరుగైన, ఉన్నతమైన విద్యను అభ్యసిస్తామని, ఉద్యోగాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు.

== తెలంగాణలో కలిపితేనే న్యాయం

భద్రాచలం పరిసర ప్రాంతాల్లో, అత్యంత దగ్గర్లో ఉన్న ఆ ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలనే నినాదం రోజురోజుకు బలపడుతోంది. ఐదు పంచాయతీల్లో ప్రజలు సైతం మేము తెలంగాణలోనే కలుస్తాం, అప్పుడైతేనే మా బతుకులు మారతాయని చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వం పథకాలను అందిస్తున్నప్పటికి విద్య, వైద్యం సమస్య తీవ్రంగా ఉందని, మా ఊళ్లు కూడా అభివద్దికి అమడదూరంలో ఉన్నాయని, తెలంగాణలోనే కలపాలని కోరుతున్నారు. మా పరిస్థితిని గమనించి మమ్మల్ని తెలంగాణలోనే కలపాలని కోరుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయం పత్రిక, టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కోసం వెళ్లిన ప్రతినిధి బ్రుందం గిరిజనుల బాధలను చూసి చలించిపోయారు. విజయం పత్రిక, టీవీ నుంచి కూడా కోరేదేమిటంటే పంతాలు, పట్టింపులు కాకుండా ప్రజలకు మేలు చేసే ఉద్దేశ్యంతో భద్రాచలం పట్టణానికి అత్యంత దగ్గరలో ఉన్న ఆ గ్రామాలను తెలంగాణ కలిపితే బాగుంటుందని కోరుతున్నాము. మరీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాల్సిందే..?