Telugu News

అపోలో ఆస్పత్రిలోచేరిన భట్టి విక్రమార్క

ఆరోగ్యం నిలకడగాఉంది ఆందోళన పడొద్దు: భట్టి విక్రమార్క

0

అపోలో ఆస్పత్రిలోచేరిన భట్టి విక్రమార్క**

ఆరోగ్యం నిలకడగాఉంది ఆందోళన పడొద్దు: భట్టి విక్రమార్క

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-

తెలంగాణకాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్కకి కరోనా వైరస్ సోకడంతో స్వల్పఅస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేరారు. అపోలోఆసుపత్రి వైద్యులు కోవిడ్ కు సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు.ప్రస్తుతం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

also read :-కిష్టాపురంలో సీసీ కెమోరాలను పునరుద్ధరణ చేయించిన సీఐ సతీష్

భట్టి విక్రమార్క ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని భట్టి విక్రమార్కసూచించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని ఆయన కోరారు. కరోనా విజృంభన నేపథ్యంలోప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యకర్తలు, నాయకులు తనను కలవడానికి హైదరాబాద్ రావద్దని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ నుంచికోలుకున్న తర్వాత తాను అందర్ని కలుస్తాను అని వెల్లడించారు.