Telugu News

బీఆర్ఎస్ నేతలంతా బంధి పొట్లేనా..? : కాంగ్రెస్ 

0

బీఆర్ఎస్ నేతలంతా బంధి పొట్లేనా..? : కాంగ్రెస్
👉🏻పార్టీ మార్పులపై పువ్వాడ కు మాట్లాడే అర్హత లేదు
👉🏻మీ పరిపాలన నచ్చకే ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు
👉🏻జిల్లాలో నీ ఓటమి ఖాయం
👉🏻జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దుర్గా ప్రసాద్ ఫైర్
👉🏻ఆరు గ్యారెంటీ లతో కకావికలం
👉🏻బిఆర్ఎస్ ఓటు అడగటానికి భయపడుతోంది
👉🏻నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
బందీ పోటు దొంగలు కాంగ్రెస్ లో లేరని అసలైన బంధి పోటు దొంగలు బిఆర్ఎస్ పార్టీ నాయకులే అని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్  కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత రెండు మూడు రోజుల నుండి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బంది పోటు దొంగల్లా వచ్చి పార్టీ మార్పులు చేపిస్తున్నారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక అర్హత బిఆర్ఎస్ పార్టీకి పువ్వాడ అజయ్ కుమార్ కు లేదని హితవు పలికారు. అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారంటే రాష్ట్రంలో ఉన్న రాచరిక పాలన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుందని తెలిపారు. పార్టీ మార్పులపై మీరు చేస్తే సంసారం మేము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. పార్టీ మారేవాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏ ఆశ చూపడం లేదని కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకుని పార్టీలోకి వస్తున్నారని అన్నారు. పువ్వాడ అజయ్ కుమార్ మమతా రోడ్డులో రెండు డివైడర్లు నాలుగు బల్బులు పెట్టి అభివృద్ధి చేశామని జబ్బలు చరుచుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. ఖమ్మం అభివృద్ధి వాన వస్తే వల వల గాలి వస్తే గలగల అన్నట్టు ఉందని హితవు పలికారు.
పువ్వాడ అజయ్ కుమార్ ఇకనైనా కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు మాని జిల్లాకు నువ్వేం చేసావో చెప్పాలని హెచ్చరించారు.కాంగ్రెస్ ఆరుగారెంటీ లపై బీఆర్ఎస్ అధిష్టానం అవాకులు చవాకులు పేలుతుందని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టి ప్రచారం చేయడం బీఆర్ఎస్ కు ఆనవాయితీ అయింది అని అన్నారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు కేటీఆర్, కవిత, హరీష్ రావు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలిపారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ… టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు భారీగా పెరిగాయని రానున్న 20 రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కార్పొరేటర్లతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రమాణాలు చేపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని అయినా కూడా కాంగ్రెస్ లో  చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరుగారెంటీలతో టిఆర్ఎస్ కాకావికలం అవుతుందని తెలిపారు.రైతు భరోసా, మహాలక్ష్మి, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు,ప్రతి పంటకు మద్దతు ధర, యువత కోసం విద్యా భరోసా, 2లక్షల ఉద్యోగాల భర్తీ, చేయూత పతకం, మహిళలకు ఉచిత ప్రయాణం  హామీలతో కాంగ్రెస్ పై ప్రజలకు ఆదరణ పెరిగిందని ఖచ్చితంగా తెలంగాణలో ఎర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో మంత్రి దీన్ని చూసి తట్టుకోలేక ఆగమాగం అవుతున్నాడని ఎద్దేవా చేశారు. టిఆర్ఎస్ నాయకులు ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లు అడగటానికి భయపడుతున్నారని, కులానికి ఒక బంధు పేరుతో ప్రజలను మోసం చేశారని అన్నారు.జిల్లాలో ఎంతమంది బిసి జనాభా వుంది, ఎంతమందికి బిసి రుణాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇక నైనా పిచ్చి ప్రేలాపనులు మాని తాను చేసింది ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. నగర కార్పొరేటర్ కామర్తపు మురళి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని ఎంతోమంది ప్రజా నాయకులను తయారుచేసిన పార్టీ కాంగ్రెస్ దేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాచరిక వ్యవస్థ కొనసాగుతుందని ఒక కుటుంబం చేతులో తెలంగాణ బందీగా ఉందని  స్పష్టం చేశారు. ఈ రాచరిక వ్యవస్థను అంతమొందించాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని తెలిపారు. పువ్వాడ అజయ్ పువ్వాడ బ్రాండ్ మీద గెలవలేదని చేతి గుర్తు బ్రాండ్ మీద గెలిచి విర్రవీగుతున్నాడని విమర్శించారు. కార్పొరేటర్ మిక్కిలినేని మంజుల మాట్లాడుతూ… జిల్లాలో పువ్వాడ అజయ్ కు మించిన గజదొంగ ఇంక ఎవరూ లేరని, ప్రభుత్వ యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని ఆయన చేయని అక్రమాలు లేవని ఆరోపించారు. జిల్లా నుండి పువ్వాడ అజయ్ ను, తెలంగాణ రాష్ట్రం నుండి బీఆర్ఎస్ ను తరిమికొడతామని ప్రతిజ్ఞ చేస్తున్నట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఖమ్మం నియోజకవర్గ పి సి సి సభ్యులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా SC సెల్ అద్యక్షులు బొడ్డు బొందయ్య , జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,కార్పొరేటర్లు లకావత్ సైదులు నాయక్, దుద్ధుకూరి వెంకటేశ్వర్లు, రఫేదా బేగం తదితర నాయకులు పాల్గొన్నారు.