Telugu News

ఈ బడిలో పంతులు లేరా..?

ఆరు బయట ఆటలాడుతున్న పిల్లలు

0

ఈ బడిలో పంతులు లేరా..?

* ఆరు బయట ఆటలాడుతున్న పిల్లలు

** నిద్రావస్థలో విద్యాశాఖ

(కరకగూడెం – విజయం న్యూస్

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దాలన్న దృఢ నిశ్చయం తో చూస్తుంటే ఇక్కడ మాత్రం ప్రభుత్వ వ్యవస్థ మీరు ఏ విధంగా బడిపంతులు వ్యవహరిస్తున్నారు వివరాల్లోకి వెళితే మండల కేంద్రంలోని చొప్పల గ్రామపంచాయతీ విపుల గుంపు పాఠశాల ఉపాధ్యాయులు స్కూల్ కి రాక పోవడంతో విద్యార్థులు కరోనా భయం లేకుండా తెలిసి తెలియక ఆరుబయట ఆటలు ఆడుకుంటున్నారు ఇది గమనించిన “విజయం” పాఠశాలకు వెళ్లగా విద్యార్థులు మా సార్ రెండు రోజుల నుంచి రావడం లేదని సమాధానమిచ్చారు, పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వ పాఠశాలకు పంపితే ఉపాధ్యాయుల తీరు ఇలా ఉండటం, స్థానిక విద్యాశాఖ అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా ఉపాధ్యాయులు సెలవు తీసుకోవలసి వస్తే సంబంధిత క్లస్టర్ హెడ్ మాస్టర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అప్పుడు అ క్లస్టర్ ఉపాధ్యాయులు ఆ పాఠశాలకు దగ్గర్లో ఉన్న వేరొక ఉపాధ్యాయుడిని పంపించాల్సి ఉంటుంది ఇది ఏజెన్సీ ప్రాంతం మైన కరకగూడెం మండలం కావడంతో వారు ఆడిందే ఆట గా పాడిందే పాట గా కొనసాగుతుంది ఇప్పటికైనా సంబంధిత మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు మేల్కొని పిల్లల భవిష్యత్తు పై దృష్టి సారించి ఇష్టానుసారంగా వివరిస్తున్న ఉపాధ్యాయులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.