పొంగులేటికి ఆ సీట్లు ఓకే..?
== రాహుల్ గాంధీతో చర్చించిన పొంగులేటి..?
== ఆ స్థానాలకు అంగీకరించిన అధిష్టానం..?
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపు ఖారారైంది.. గత కొద్ది నెలలుగా బీఆర్ఎస్ పార్టీపై యుద్దం చేస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారంలోకి వచ్చే పార్టీలో చేరతానని చెబుతుండగా, ఏ పార్టీలోకి వెళ్తారనే విషయంపై సర్వత్ర చర్చ జరిగింది. ఈ క్రమంలో నెలల తరబడి నాన్చుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం ఆ దూర ప్రయత్నాన్ని పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గాను ఆయన రాహుల్ గాంధీతో మీట్ అవ్వనున్నారు.
allso read- రాహుల్ గాంధీతో ‘పొంగులేటి’ చర్చలు సఫలం..?
శనివారం జూమ్ మీటింగ్ లో హాజరైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీమ్ రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలు, జిల్లా రాజకీయాలను రాహుల్ గాంధీ ద్రుష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. కచ్చితంగా గెలుపుగుర్రాలకు సీటు అవకాశం ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యేకంగా పొంగులేటికి కొన్ని స్థానాలను అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
== ఆ సీట్లకు పొంగులేటి ఓకే
రాహుల్ గాంధీతో జరిగిన చర్చల్లో సీట్ల పంపకాలపై కొద్దిపాటి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలను ఇవ్వాలని ఢిల్లీ పెద్దలకు చెప్పగా, ఆ విషయంలో రాహుల్ గాంధీ కచ్చితంగా పొంగులేటి వర్గానికి 8 స్థానాలు ఇవ్వనున్నట్లు హామినిచ్చినట్లుగా తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు స్థానాలతో పాటు హైదరాబాద్ సిటిలో ఒక్కటి, వరంగల్, నల్గొండ, నల్గొండ జిల్లాలో ఒక స్థానాన్ని కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థలను ప్రకటిచారు. మధిరకు డాక్టర్ రాంబాబు, పినపాకకు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందుకు కోరం కనకయ్య, సత్తుపల్లికి గతంలో మట్టా దయానంద్ ఉండే, ఇప్పుడు విద్యావేత్త, ఉద్యోగి సుధాకర్, అలాగే పిడమర్తి రవి, అశ్వరరావుపేట కు అదినారాయణ, వైరాకు విజయబాయి, భద్రాచలం తెల్లం వెంక్రటావ్ లను అభ్యర్థులుగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: సమయం ఆసన్నమైంది..ఇక కురుక్షేత్రమే: పొంగులేటి
కానీ రాహుల్ గాంధీ నాలుగు స్థానాలకే పరిమితం చేసే అవకాశం ఉండటంతో ఎవరేవరికి టిక్కెట్లు వస్తాయో..? అనే విషయంపై స్పష్టత లేకుండ పోయింది. ఇల్లెందు, పినపాక, వైరా, అశ్వారావుపేటతో పాటు ఖమ్మం లేదా కొత్తగూడెం పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మధిరలో భట్టి విక్రమార్క, భద్రాచలం లో పొడెం వీరయ్య లు ఇప్పటికే సిట్టింగ్ లు కాగా పాలేరు, వైరా మాత్రం భట్టి వదిలేలా కనిపించడం లేదు. ఇక పినపాక కు సీతక్క ప్రయత్నాలు చేస్తున్నారు. సత్తుపల్లి లో మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, మానవతరాయ్ ఇప్పటికే టిక్కెట్ ను ఆశిస్తున్నారు. మట్టి దయానంద్ కు రేణుకా చౌదరి ఆశీస్సులు ఉన్నాయి.. కాగా ఇంతటి పోటీలో పొంగులేటి సీట్లు సర్దుబాటు కాంగ్రెస్ కు తలనొప్పి తెప్పించే అవకాశం ఉంది. దీంతో పొంగులేటి శిబిరంలో కూడా కొంత నైరాస కనిపస్తోంది. అలాగే జూపల్లి క్రిష్ణారావుకు రెండు స్థానాలు, ఎమ్మెల్యే కూచుకుళ్ల దామోదర్ రెడ్డికి ఒక స్థానం హామినిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం దాదాపుగా ఖారారైనట్లే..?
(ఆ నలుగురిలో నాల్గొవ లీడర్ ఎవరు..? రేపటి ఉదయం సంచికలో..)