Telugu News

నువ్వా..నేనా..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

అసెంబ్లీకి పోయేదేవ్వరు..? చర్చకు హాజరైయ్యేదేవ్వరు..? 

0

నువ్వా..నేనా..? కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..?

== అసెంబ్లీకి పోయేదేవ్వరు..? చర్చకు హాజరైయ్యేదేవ్వరు..? 

== కోర్టుల్లో వనమాకు చుక్కెదురు.. జలగంకు అనుకూల తీర్పు

== హైకోర్టు తీర్పు పత్రంతో అసెంబ్లీకి జలగం..?

== అపాయింట్ మెంట్ దొరకడం కష్టమేనా..?

== రేపటి నుంచి అసెంబ్లీ ప్రారంభం

== ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కొత్తగూడెం జనం

(ఖమ్మంప్రతినిధి/కొత్తగూడెం-విజయంన్యూస్)

 

రేపు పొద్దుగలే అసెంబ్లీ సమావేశాలు.. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరు అసెంబ్లీకి వెళ్తారు.. కానీ ఆ ఒక్క ఎమ్మెల్యే తప్పా.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు రేపు అసెంబ్లీకి వెళ్తారా..? లేదంటే జలగం వెంకట్రావ్ అసెంబ్లీకి వెళ్తారా..? ఇప్పటి వరకు అసెంబ్లీకి వెళ్లిన వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్ ఇచ్చింది.. నువ్వు కాదు ఎమ్మెల్యే నీ ప్రత్యర్థి.. ఇక సెలవు వనమా అంటూ హైకోర్టు సంచలన ప్రకటన చేయగా, ఆ తరువాత హైకోర్టు మెట్లు ఎక్కినప్పటికి వనమాకు చుక్కెదేరైంది..  దీంతో జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యే..ఇక ఆయనకే పగ్గాలు వస్తున్నాయని అందరు ఊహించారు.. కానీ దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వడం లేదన్నట్లుగా జలగం వెంకట్రావ్ హైకోర్టు అర్డర్ కాఫీతో అసెంబ్లీ సెక్రేటరీని కలిసిన ప్రయోజనం లేకుండా పోయింది.. అసెంబ్లీ స్పీకర్ అపాయింట్ మెంట్ అడిగిన ఫలితం దక్కలేదు.. దీంతో జలగం రేపు అసెంబ్లీకి వెళ్తారనే నమ్మకం లేదు..? అసెంబ్లీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు..? దీంతో అసలు కొత్తగూడెం ఎమ్మెల్యే ఎవరు..? అసెంబ్లీకి వెళ్లేదేవ్వరు..? చర్చలో పాల్గొనేదేవ్వరు..? కొత్తగూడెం నియోజకవర్గం తాజా పరిస్థితులపై ‘విజయం’ పత్రిక అందించే ఇంట్రస్టింగ్ కథనం మీకోసం..

ఇది కూడా చదవండి: మున్నేరుకు కరకట్ట కాంగ్రెస్ తో నే సాధ్యం: పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం..పారిశ్రామిక కేంద్రానికి నిలువుటద్దం.. సింగరేణి కార్మిక శక్తికి అడ్డా.. అన్ని వనరులకు కేంద్రం.. అత్యధిక జనాభ కల్గిన జిల్లా..ఏజెన్సీ ప్రాంతానికి ప్రాంతీయరేఖ.. అలాంటి కొత్తగూడెం జిల్లా కేంద్రం నేడు రాజకీయంగా హాట్ టాఫిక్ గా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు జనరల్ స్థానాలు ఉండగా, భద్రాద్రికొత్తగూడెంజిల్లాలో ఒక్కే ఒక్క జనరల్ సీటు కొత్తగూడెం నియోజకవర్గం.  ఈ నియోజకవర్గం రాజకీయంగా నేడు రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది..  రాజకీయ ఆధిపత్యానికి ప్రస్తుతం కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఒక వైపు ఎన్నికలు సమయం దూసుకోస్తుండగా, మరో వైపు ఎమ్మెల్యే ఎవరనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుండి కాంగ్రెస్ తరుపున వనమా వెంకటేశ్వరరావు పోటీ చేయగా, టీఆర్ఎస్ అభ్యర్థిగాఅప్పటికే ఎమ్మెల్యేగా ఉన్న జలగం వెంకట్రావ్ పోటీ చేశారు.  దీంతో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావుకు  81,118 ఓట్లు రాగా  అధికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకటరావుకు 76,979 ఓట్లు వచ్చాయి. దీంతో 4,139 ఓట్ల మెజార్టీతో వనమా వెంకటేశ్వరరావు గెలుపొందినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో జలగం వెంకటరావు 2019 జనవరిలో  హైకోర్టును ఆశ్రయించారు.  ఎన్నికల అఫిడవిట్లో ఎమ్మెల్యే వనమా తన పూర్తి వివరాలు వెల్లడించలేదని తన ఎకరం 33 కుంటలకు గత ఎనిమిది సంవత్సరాలుగా 69,350రూపాయల రైతుబంధు నిధులు తీసుకున్నట్లు సంబంధించి వివరాలు, ఆయన భార్య పద్మావతి పేరు మీద పాల్వంచలో 8ఎకరాలు ఉన్న వివరాలు, వనమా కుమారులు చీరాల, ఏలూరులో రెండు ఇంజనీరింగ్ కాలేజీలు క్రిస్టియన్ మైనారిటీ సొసైటీ కింద  రిజిస్టరై ఉండగా వాటన్నింటినీ దాచి పెట్టి హిందూ అవిభాజ కుటుంబంలో చూపించారు. ఈ విషయం మీద మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు హైకోర్టులో 2019 జనవరి వేసిన పిటిషన్ ను హైకోర్టు తీసుకుంది.. విచారణ చేపట్టింది. ఆ తరువాత

== వనమాకు షాక్ ఇచ్చిన హైకోర్టు

ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరరావుపై జలగం వెంకట్రావ్ వేసిన ఫిటిషన్ ను నాలుగున్నరేళ్ల తరువాత తీర్పు చెప్పింది హైకోర్టు. నాలుగున్నరేళ్ల పాటు అన్ని రకాలుగా విచారణ చేసిన హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.. వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా అనర్హుడని, అతన్ని తొలగిస్తూ ఆయన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యేగా నిర్థారిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. అంతే కాకుండా రూ5లక్షల జరిమాన విధిస్తూ, ఐదేళ్లుగా జలగం వెంకట్రావ్ ఎమ్మెల్యే అంటూ ప్రకటన చేసి వనమాకు దిమ్మతిరిగే షాక్ నిచ్చింది.. ఆయనకే కాదు ఈ తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులతో పాటు రాజకీయ నాయకులందరికి దిమ్మతిరిగే షాక్ అని చెప్పాలి.. అలాంటి తీర్పుతో బీఆర్ఎస్ ఒక్కసారిగా కంగుతిన్నది. దీంతో వనమా వెంకటేశ్వరరావు తిరిగి మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు. పై కోర్టుకు కేసును వేసేందుకు సమయం ఇవ్వాలని అఫిల్ చేయగా, దానిని కూడా హైకోర్టు తిరస్కరించింది. దీంతో వనమా వెంకటేశ్వరరావు చేసేది లేక సుఫ్రీం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

== అసెంబ్లీ చుట్టు జలగం ప్రదక్షణలు

హైకోర్టు తీర్పు అనంతరం జలగం వెంకట్రావ్ హైకోర్టు తీర్పు కాఫీతో అసెంబ్లీ స్పీకర్ ను, అసెంబ్లీ సెక్రటరీని కలిసేందుకు ప్రయత్నం చేశారు. అసెంబ్లీ స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో పాటు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. దీంతో అసెంబ్లీ సెక్రటరీని కలిసి జలగం వెంకట్రావ్ తనకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పు కాఫీని సెక్రెటరీకి ఇచ్చారు. తనను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. అనంతరం సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ అడిగిన ఇవ్వలేదని తెలిసింది. దీంతో జలగం వెంకట్రావ్ తీర్పు వచ్చిన నాటి నుంచి అసెంబ్లీ చుట్టు ప్రదక్షణలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికి ఫలితం లేకుండాపోయింది..

== అసెంబ్లీకి పోయేదేవ్వరు..?

ఈనెల 3 నుంచి అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు అసెంబ్లీకి హాజరైయ్యారు. అయితే  హైకోర్టు వనమా వెంకటేశ్వరరావుపై అనర్హత వేటు వేయడంతో ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్తారా..? లేదా..? అనేది అర్థం కావడం లేదు. ఇప్పటి వరకు అసెంబ్లీ నుంచి కూడా ఎలాంటి ఆదేశా రాలేదు. ఇక పోతే జలగం వెంకట్రావ్  రేపు జరగబోయే అసెంబ్లీకి కొత్తగూడెం ఎమ్మెల్యేగా వెళ్తారా..? అని అనుకుంటే ఆయనకు ఇప్పటి వరకు అసెంబ్లీ స్పీకర్ నుంచి, సెక్రెటరీ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు..దీంతో రేపటి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కొత్తగూడెం ఎమ్మెల్యేగా హాజరైయ్యేదేవ్వరనే విషయంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై సర్వత్ర చర్చ జరుగుతోంది..
కోర్టు తీర్పుతో మాజీగా మారిన వనమా వెంకటేశ్వర రావు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో సమావేశాలకు హాజరవ్వాలంటే జలగం వెంకట్రావు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంటుందని వివరించారు. జలగంతో ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యేగా ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావొచ్చు. ఈ విషయంపై తన నిర్ణయాన్ని స్పీకర్ పెండింగ్ లో పెడితే మాత్రం ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఇద్దరిలో ఎవరికీ ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కోర్ట్ తీర్పును స్పీకర్ హోల్డింగ్ లో పెట్ట అవకాశం ఉందా.?? అంటే లేదనే అంటున్నారు న్యాయనిపుణులు. ఒక వేళ స్పీకర్ కావాలని కోర్ట్ తీర్పు ప్రకారం జలగం ను ప్రమాణ స్వీకారం చేయించకుండా ఉంటె అది కోర్ట్ ధిక్కరణ కిందకు వస్తుంది….అందువల్ల ఈ కేసులో ఏమి జరుగుతుందో అనే ఆసక్తి నెలకొన్నది … మొత్తానికి కొత్తగూడెం అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఎవరవుతారు..? అసెంబ్లీలోకి అడుగుపెట్టేదేవ్వరో వేచి చూడాల్సిందే..?