Telugu News

24గంటల కరెంట్ పై  చర్చకు సిద్ధమా:తాతా మదు

పొంగులేటికి సవాల్ విసిరిన తాతా మదు

0

24గంటల కరెంట్ పై  చర్చకు సిద్ధమా

** పొంగులేటికి సవాల్ విసిరిన తాతా మదు

పొంగులేటి వాపును చూసి బలుపు అనుకోవద్దు: తాతామదు

** జనంలో నీకు గుర్తింపు లేదు

** తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినవ్

** సీఎం కేసీఆర్ ను విమ్మర్శిస్తే సహించేది లేదు

విలేకర్ల సమావేశంలో పొంగులేటి పై ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ తాతా మధు

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)

రాష్ట్రంలో 24 గంటల కరెంటు రావడం లేదని ఆరోపణలు చేస్తున్న పొంగిలేటికి ఎమ్మెల్సీ బీర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాత మధు బహిరంగ సవాల్ విసిరారు 24 గంటల కరెంటు వస్తుందో రావడం లేదు ఆ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్సీ, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్ మాట్లాడుతూ

దేశానికి దిక్చూచి.. సీఎం కేసీఆర్ అని కొనియాడారు.తె లంగాణ అభివృద్ధిలో నెంబర్ వన్  గా యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. భవిష్యత్తు బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని  తాతా మదు గుర్తు చేశారు.ఎంతో మంది మేలు కోరి పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రితో కలిసి నడిచేందుకు వేలాది మంది టీఆర్ఎస్ లో చేరారని, అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చేరారని తాతా మధు స్పష్టం చేశారు.

 

మేమే లేక పోతే పార్టీ లేదని అనుకుని ఊహించుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ పరక్తత లేకుండా పని చేస్తున్నారని ఆరోపించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి, సీఎం కు వ్యతిరేకంగా మాట్లాడటం సరైంది కాదని, పొంగులేటి గెలవడం ఒక యాక్సిడెంట్ లాంటిదన్నారు.ఆయన స్వంత బలంతో గెలవలేదని, సీపీఐ గుర్తు రావడం, కాంగ్రెస్ గుర్తు లేకపోవడం వల్లనే ఆయన గెలిచాడని :తాతా మదు ఆరోపించారు. పొంగులేటి వ్యక్తిగత లబ్ది కోసమే టీఆర్ఎస్ లో చేరాడని,  ఆయన స్వార్థం కోసం పార్టీలు మారతాడని, ఆయన్ను నమ్ముకున్న వారికి పంగనామాలు ఖాయమన్నారు.

ఇది కూడా చదవండి: పార్కులకు గుమ్మం ‘ఖమ్మం’: మంత్రి పువ్వాడ
రాష్ట్రంలో 24గంటల కరెంట్ లేదని చెప్పావు, నాడు నువ్వే కదా కేసీఆర్ రైతు పక్షపాత కరెంట్ 24గంటల కరెంట్ ఇస్తున్నారని చెప్పావా లేదా..? ప్రశ్నించిన తాతా మదు కల్లూరు మండలంలోని నారాయణపురం లో నీకున్న 40ఎకరాలకు మామిడి తోటకు 24గంటల కరెంట్ వస్తుందా..?రావడం లేదా,..? అని ప్రశ్నించారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్దమా..?నేనే వస్తా నారాయణపురం చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.

వీసా తీసుకుని నియోజకవర్గాల్లో తిరగాలని చెబుతున్నా పొంగులేటి, ఏ రోజైనా పాస్ పోర్ట్ చూపించే ఖమ్మం జిల్లాలో పర్యటించావా అని ప్రశ్నించారు. బీ.ఆర్.ఎస్ పార్టీలో క్రమశిక్షణ ఉంటుందని అన్నారు.

ఇది కూడా చదవండి:- పల్లెకు ప్రతినిధులు..ప్రజల్లోకి నేతలు

8ఏళ్ళుగా క్రమశిక్షణ లోనే పార్టీ ఉందని,  నాలుగేళ్లుగా నువ్వు క్రమశిక్షణ పాటిస్తున్నావా..? పొంగులేటి అంటూ ప్రశ్నించారు.పార్టీలో శ్వేచ్ఛ లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో తిరిగావా..?లేదా..,? సీఎం కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను ఎక్కువ సార్లు కలిసింది నువ్వేకదా అని ప్రశ్నించారు.గత ఎన్నికల్లో నీతో తిరిగిన, నిన్ను నమ్ముకూన్న కమల్ రాజు, మదన్ లాల్, తెల్లం వెంకట్రావు,పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లులకు సీఎం కేసీఆర్ సీటు ఇవ్వలేదా..?ఎక్కడ అన్యాయం చేసింది పార్టీ..?నీకు అంటూ గుర్తు చేశారు. వాళ్ళను ఎందుకు గెలిపించలేకపోయావో అర్థం కావడం లేదు,

నువ్వు ఊహించినంతగా జనంలో నీకు గుర్తింపు లేదని ఆరోపించారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రారంబానికి వచ్చింది నువ్వు కాదా..?పచ్చి అబద్ధాలు మాట్లాడోద్దని  తాతామదు దుయ్యబట్టారు. జనబలంతోకాదు..ధనబలంతో జిల్లా రాజకీయాలను కలుషితం చేసింది పొంగులేటి అంటూ తాతా మదు విమ్మర్శలు చేశారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ.

పార్లమెంట్ తో పాటు అనేక ఎన్నికల్లో నీతోపాటు తిరిగే వారు నేరుగా పార్టీకి వ్యతిరేకంగా పనిచేశావు

2014 కంటే నీ పరిస్థితి ఏంటీ..?ఆ తరువాత పరిస్థితి ఏంటీ..?

క్యాబినెట్ కంటే ఎక్కువ కాన్వాయ్ పెట్టుకున్నావు

సీఎం ఆర్ఎఫ్ మాజీ లకు ఉండదు.. కానీ సీఎం కేసీఆర్ మీకు అవకాశం ఇచ్చారూ.

టీఆర్ఎస్ హాయంలో ఎంత కాంట్రాక్ట్ తీసుకున్నావు.. నీ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎంతమంది నష్టపోయారు.. మొత్తం ఆధారాలతో చూపిస్తాం:తాతా మదు

పార్టీ విజయాల్లో నీ పాత్ర అసలే లేదు..నీ కుట్రను బీఆర్ఎస్ ఎప్పుడో గుర్తించి అలార్ట్ అయ్యింది: తాతా మదు

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే పని చేస్తున్నావు.. నీ పప్పులు ఉడకవు:తాతా మదు