అభివృద్ధి పై కందాళ చర్చకు సిద్దమా..? : కొండపల్లి శ్రీధర్ రెడ్డి
తమ్మినేని పార్టీ ఎప్పుడో వీఆర్ఎస్ తీసుకుంది
అభివృద్ధి పై కందాళ చర్చకు సిద్దమా..? : కొండపల్లి శ్రీధర్ రెడ్డి
== తమ్మినేని పార్టీ ఎప్పుడో వీఆర్ఎస్ తీసుకుంది
== బూత్ కమిటీల సమ్మేళనంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి
(కూసుమంచి-విజయంన్యూస్)
పాలేరు నియోజకవర్గం అభివృద్ధి పై ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్దమా…? అని బీజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి సవాల్ చేశారు. శనివారం పాలేరు అసెంబ్లీ లో బీజేపీ ఎక్కడఉన్నది అని విమర్శించే వారికి పోలింగ్ బూత్ కమిటీ ల సమ్మేళనం సమాధానమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో వర్చువల్ పద్ధతి లో ఆ పార్టీ నిర్వహించిన పోలింగ్ బూత్ కమిటీ ల సమ్మేళనం లో పెద్ద సంఖ్యలో హాజరై న బీజేపీ ప్రతినిధుల ను ఉద్దేశించి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మతతత్వ బీజేపీ ని అడ్డుకుంటామంటూ మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి స్వంత గ్రామం తెల్దారుపల్లి నుండి బీజేపీ సభ్యులు ఈ సమ్మేళనం లో పాల్గొన్నారనే విషయం గుర్తించాలన్నారు.
ఇది కూడా చదవండి: జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం
బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్న తెరాస తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మరచి కుటుంబ అవినీతి పాలన చేస్తున్నదని ఆయన ఆరోపించారు. పాలేరు లో కాంగ్రెస్ నుండి పార్టీ పిరాయించి తెరాస లో చేరిన కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు లో ఆయన చేసిన అభివృద్ధి ప్రజల సమక్షంలో చర్చకు రావాలన్నారు. నరేంద్ర మోదీ డబల్ ఇంజెన్ సర్కారు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని. మనం కష్ట పడి పని చేయాలన్నారు. కార్యక్రమం కు వివిధ పోలింగ్ బూత్ ల నుండి హాజరై న ప్రతినిధుల తో పార్టీ ఆన్ లైన్ నెంబర్ కు మిస్డ్ కాల్ చేయించి. వారి వివరాలు నమోదు చేయించారు. కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వర్చువల్ పద్దతి లో మాట్లాడారు. అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. పాలేరు ఎప్పుడు లేని విదంగా పోలింగ్ బూత్ కమిటీల సమావేశంలో పెద్ద సంఖ్యలో హాజరైన ప్రతినిధుల తో విజయవంతం కావడం తో పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేసారు.
ఇది కూడా చదవండి: ‘పాలేరు’ రేసులో ‘ఆ ఇద్దరు’
ఈ సమ్మేళనం లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేంద్ర రావు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నున్నా రవి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి , బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నూకల రామ్మోహన్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, బీజేపీ జిల్లా కార్యదర్శులు హతీయ నాయక్, వీరభద్రం,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఆనంతు ఉపేందర్ గౌడ్, sc మోర్చా జిల్లా అధ్యక్షులు సుదర్శన్, బీజేపీ మండలాల అధ్యక్షులు బట్టు నాగ రాజు, బొడ్డుపల్లి ప్రసాద్, మల్లా రెడ్డి, మన్నే కృష్ణా రావు, షరీఫ్ ఉద్దీన్, సత్తి నాగరాజు, గోపి, సందీప్ రెడ్డి, నల్లమస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు