Telugu News

బిజెపి ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై రేపు తీర్పు

హైకోర్టులో పిటిషన్‌పై వాదనలు పూర్తి

0

బిజెపి ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై రేపు తీర్పు
హైకోర్టులో పిటిషన్‌పై వాదనలు పూర్తి
(హైదరాబాద్‌-విజయంన్యూస్): –

శాసనసభలో భాజపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెల్లడిరచనుంది. బుధవారం హైకోర్టు జారీ చేసిన నోటీసులు అసెంబ్లీ కార్యదర్శికి అందలేదు. భాజపా ఎమ్మెల్యేలు, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు విన్న న్యాయస్థానం ఉత్తర్వులు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు జారీ చేస్తామని తెలిపింది. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్‌ రావు, ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ షవిూమ్‌ అఖ్తర్‌ వాదనలు విన్నారు. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ.. విఫలమయ్యాయని పిటిషనర్లు, హైకోర్టు కార్యాలయ సిబ్బంది తెలిపారు.

also read :-ఉద్యోగ ప్రదాత సీఎం కేసీఆర్

ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా..రాజ్యాంగ విరుద్ధంగా, శాసనసభ నియమావళిని ఉల్లంఘించి సస్పెండ్‌ చేశారని భాజపా ఎమ్మెల్యేల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రకాశ్‌ రెడ్డి వాదించారు. సభ నిర్వహణకు ఆటంకం కలగకపోయినా… స్పీకర్‌ ఎవరి పేరునూ ప్రస్తావించకపోయినా… సస్పెన్షన్‌ తీర్మానం ప్రవేశ పెట్టడం నిబంధనలకు విరుద్ధమన్నారు. సస్పెన్షన్‌ ఉత్తర్వులు కూడా ఇవ్వడం లేదన్నారు. అసెంబ్లీ నిర్వహణలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు.

also read :-టేల్స్‌ ఆఫ్‌ డిఫరెంట్‌ టెయిల్స్‌ ’బుక్‌ సిరీస్‌ను విడుదల చేసిన సోనాలికా పబ్లికేషన్స్‌

ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. తీర్పు నేటికి వాయిదా వేసింది. హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలు..తమ సస్పెన్షన్‌ రాజ్యాంగానికి, సభ నియామవళికి విరుద్ధంగా ఉందంటూ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సస్పెన్షన్‌ కొట్టివేసి సమావేశాలకు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని భాజపా ఎమ్మెల్యేలు కోరారు. సస్పెన్షన్‌ తీర్మానంతో పాటు నిన్నటి సమావేశాల వీడియో రికార్డింగులను తెప్పిచడంతో పాటు తమకూ ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించాలని కోరారు.