Telugu News

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ములుగు జిల్లా, తాడ్వాయి మండలములో పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్ సూచించారు.

0

పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

( తాడ్వాయి – విజయం న్యూస్):-
ములుగు జిల్లా, తాడ్వాయి మండలములో
పదవ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తహశీల్దార్ ముల్కనూర్ శ్రీనివాస్ సూచించారు. రెండు పరీక్షా కేంద్రాల చీఫ్ సుపెరండెంట్ ఎం ఈ వో సాంబయ్య, ఎస్సై వెంకటేశ్వరరావు , వైద్య విద్య శాఖ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి జూన్ 1వరకు జరి గే పదవ తరగతి పరీక్షలకు అన్నీ ఏర్పాట్లు చేయాలని పిలుపునిచ్చారు.

also read :-కాల్షియం కార్బైడ్ పండ్లు ప్రాణాంతకాలు

also read :-ముత్తారం సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న మహిళ సర్పంచ్ భర్త.

మండలం లో నీ నార్లాపూర్ , తాడ్వాయి పరీక్ష కేంద్రాల్లో శానిటేషన్ సరిగా చేయాలని విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎస్సీ కి సూచించారు.పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మెడికల్ సిబ్బంది మజ్జిగ ప్యాకెట్లు, ఓ ఆర్ ఎస్ పాకెట్స్, పస్ట్ ఎయిడ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని వెద్య సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటి తహశీల్దార్ ఎల్లోల.కిషోర్, ఎం ఈ ఓ సాంబయ్య, సునీల్, ఎస్సై వెంకటేశ్వరరావు, వి ఆర్ ఓ తాడెం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.