Telugu News

కవచ్ రైల్వే రక్షణ వ్యవస్థ ప్రయోగం విజయవంతం

అశ్వారావుపేట విజయం న్యూస్

0

కవచ్ రైల్వే రక్షణ వ్యవస్థ ప్రయోగం విజయవంతం

(అశ్వారావుపేట విజయం న్యూస్):-

భారత దేశం స్వయంగా చవగ్గా తయారు చేసిన “కవచ్” అనే  “రైళ్లు ఢీ కొట్టకుండా ఆపే ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థని” పరిశీలించడంకోసం. సికింద్రాబాద్ డివిజన్ లో సనత్ నగర్ -శంకరపల్లి రైల్ సెక్షన్ లో  ఈ రోజు ఒక విచిత్రం జరగింది. అది ఏమిటంటే ఫుల్ స్పీడ్ లో ఎదురు ఎదురుగా వెళ్తున్న రెండు ట్రైన్స్ గుద్దుకోడానికి ప్రయత్నిస్తాయి. ఒక దాని ఇంజిన్ లో సాక్షాత్తు కేంద్ర రైల్వే మంత్రి ఉండగా రెండో దానిలో రైల్వే బోర్డ్ చైర్మన్ ఉన్నారు.కొద్ది గంటల క్రితం జరిగిన ఈ ప్రయోగం విజయవంతం అయింది.దీని వివరాలు ఇలా ఉన్నాయి.

also read;-పెవిలియల్ గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ విస్తరణకు ఎంపి నిధుల నుండి రూ.3 లక్షలు మంజూరు

ఈ రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే చవకైన ఈ తరహా రక్షణ వ్యవస్థగా రైల్వే శాఖ చెపుతోంది.
ఎదురెదురుగా రైళ్లు వస్తున్నాయి అని ఈ ఆటోమేటిక్ వ్యవస్థ ముందుగానే పసికట్టి ఆ రెండు రైళ్లకు ఆటోమాటిక్ గా బ్రేక్స్ వేసి దూరం ఉండగానే ఆపుతుంది. అలాగే పొరపాటున రెడ్ సిగ్నల్ జంప్ అవ్వడం, రైల్వే గేట్స్ పొజిషన్, ఏదైనా మెకానికల్ లోపాలు తలయెత్తినా ఈ డిజిటల్ సిస్టమ్ వెంటనే పసిగట్టి రైలును ఆపుతుంది. అలాగే ఒక ట్రాక్ మీద ప్రమాద పరిస్థితి ని పక్క ట్రాక్స్ మీద వచ్చే ట్రైన్స్ కూడా సమాచారం ఇచ్చి ఆపుతుందిఈ రోజు ప్రయోగంలో ఎదురెదురుగా నే కాకుండా వెనుకనుంచి వచ్చే రైళ్లను కూడా ఈ సిస్టం ఎలా గుర్తించి ట్రైన్స్ ని ఆపగలదో పరీక్షించి విజయం సాదించారు.

also read;-జైనూర్ దవాఖానా సందర్శించిన మంత్రి హరీష్ రావు.

సిగ్నల్స్ సులభంగా గుర్తించవచ్చు

అధిక ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్ సాంకేతిక ఆధారంగా ఈ సిస్టం పనిచేస్తుంది.
అర్.ఎఫ్.ఐ.డి . టాగ్ లు ట్రాక్స్ వద్ద, సిగ్నల్స్ వద్ద ఉండి స్టేషన్ మాస్టర్ కి, డ్రైవర్స్ కి, రూట్ రిలే క్యాబిన్ సిబ్బందికి తమ కన్సోల్ లో అప్పుడు ఉన్న సిగ్నల్ పొజిషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం డ్రైవర్స్ ఇంజిన్ కిటికీలోంచి తల బయటపెట్టి సిగ్నల్ స్టేటస్, ట్రాక్ పొజిషన్తెలుసుకుంటున్నారు. ��