Telugu News

వనమా రాఘవను అరెస్ట్ చేయాలి : భట్టి

ఆయన బెదిరింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య

0

వనమా రాఘవను అరెస్ట్ చేయాలి : భట్టి

ఆయన బెదిరింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య

పాల్వంచలో పర్యటించి రామకృష్ణ కూతుర్ని పరామర్శించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

(భద్రాచలం ప్రతినిధి-విజయం న్యూస్);-

ఎమ్మెల్యే కుమారుడు బెదిరింపులు‌ వేదింపుల కారణంగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని, రాఘవను తక్షణమే అరెస్ట్ చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. సోమవారం పాత పాల్వంచలో సజీవదహన ఘటనలో తీవ్ర గాయాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాహితి ని పరామర్శించి ఆమె ఆరోగ్య పరిస్థితి ని వైద్యులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు, ఆయన వెంట జిల్లా పార్టీ అధ్యక్షుడు భద్రాచలం శాసనసభ్యులు పొడెం వీరయ్య, EX MLC పోట్ల నాగేశ్వరరావు పరిశీలించారు.

also read;-వారం రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు సంబరాలు : మంత్రి కేటీఆర్

కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ కూతురు సాహితిని పరామర్శించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రరావు బెదిరింపులు తట్టుకోలేక రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది

ఈ ఘటనను కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ శాసనసభపక్షాన ఖండిస్తున్న

90 శాతం కాలిన గాయాలతో మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది

బాలిక కు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నాం

also read;-కారేపల్లి మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు కూల్చివేత

ఈ ఘటన చూసి మనసున్న ప్రతీ ఒక్కరు చలించిపోతున్నారు

వనమా రాఘవ దౌర్జనాలపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన చోటుచేసుకుంది.

అధికార పార్టీకి ప్రభుత్వ యంత్రాంగం వత్తాసు పలకడం వల్లనే ఇలాంటి ఘటనలు

వనమా రాఘవపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు

వనమా రాఘవపై గతంలో ఉన్న కేసుల అన్నింటిపై చర్యలు తీసుకోవాలి.