Telugu News

కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య : శ్రీధర్ రెడ్డి

నేలకొండపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా ..దిష్టిబొమ్మ దగ్ధం

0

కిషన్ రెడ్డిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య : శ్రీధర్ రెడ్డి

== నేలకొండపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా ..దిష్టిబొమ్మ దగ్ధం

(నేలకొండపల్లి/కూసుమంచి-విజయంన్యూస్)

కెసిఆర్ చేతిలో మోసపోయిన తెలంగాణ నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి వారి న్యాయమైన హక్కుల కోసం ఉపవాస దీక్ష చేపట్టిన బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం హేయమైన చర్య అని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ బిజెపి నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ

ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ కవితా కు ఈడీ నోటీసులు

నిధులు నీళ్లు నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిరుద్యోగ యువకులను నిలువునా ముంచారని ఆరోపించారు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా యువతను మోసం చేశారని నిరుద్యోగ భృతి ఇస్తానని నమ్మబలికి రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ మాటే మరిచారని ఈ నేపథ్యంలోనే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి యువకులకు భరోసా కల్పించాలని అండగా నిలవాలని ఉద్దేశంతో ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపడితే ఉలిక్కిపడిన కేసీఆర్ కిషన్ రెడ్డిని అరెస్టు చేయించారని ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని ఆయన అన్నారు.నిరుద్యోగ యువకులకు న్యాయం జరిగే దాకా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ను ఎప్పుడు ఎన్నికలు జరిగినా నిరుద్యోగ యువత బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు. మండల బిజెపి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నున్న రవికుమార్ బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్ బిజెపి మండల అధ్యక్షుడు మన్నే కృష్ణారావు మైనారిటీ నాయకులు షరీఫుద్దీన్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి పాగర్తి సుధాకర్ జ్ఞాన రత్నం మండల సీనియర్ నాయకులు కోటి హనుమంతరావు కాలింగ్ వెంకటేశ్వర్లు భవనాసి దుర్గారావు మన్నే రాధాకృష్ణ మొయినుద్దీన్ బీజేవైఎం మండల అధ్యక్షుడు నాగాచారి చల్ల మల్లేష్ కాసాని ఉదయ్ పోలంపల్లి వీరబాబు గోపి బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నలమాస శ్రీనివాసరావు వెంకన్న తదితరులు పాల్గొన్నారు

ఇది కూడా చదవండి: అభివృద్ధి పై కందాళ చర్చకు సిద్దమా..? : కొండపల్లి శ్రీధర్ రెడ్డి