లోక్ సభ అభ్యర్థిగా ‘షర్మిళ’..ఎక్కడ నుంచంటే..?
== ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా అవకాశం..?
== వైఎస్ఆర్టీపీ విలీనంకు ముహుర్తం ఖారారు
== ఈనెల 5న ఢిల్లీలో విలీనం చేయనున్న షర్మిళ
== ఢిల్లీ పెద్దలతో చర్చలు సఫలం
== మధ్యవర్తిగా వ్యవహరించిన డీకే.శివకుమార్
== ప్రస్తుతం చత్తీస్ గడ్ ప్రచార కర్తగా.. ఆ తరువాత తెలంగాణకు ఎంపీగా
== రేపు అధికారికంగా ప్రకటించనున్న వైఎస్ షర్మిళ
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా నూతన పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిళ.. ఆ పార్టీని విలీనం చేసేందుకు మహుర్తం ఖరారైంది.. సోమవారం ఢిల్లీలోని ఏఐసీసీ అగ్రనేతలతో జరిగిన చర్చలు ఫలించినట్లు తెలుస్తోంది.. పార్లమెంట్ స్థానంతో పాటు, ఆమె కోరిన వ్యక్తికి భవిష్యత్ లో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని మాటిచ్చినట్లు తెలుస్తోంది..
ఇది కూడా చదవండి:- షర్మిళ..విలీనామా..? విహారమా..?
ప్రస్తుతం దీంతో అంగీకరించిన వైఎస్ షర్మిళ ఈనెల 5న వైఎస్ఆర్ టీపీ పార్టీని విలీనం చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిళతో పాటు ఆ పార్టీ కీలక నేతలు సైతం కాంగ్రెస్ లో చేరనున్నారు. ఢిల్లీ పెద్దలతో జరిగిన చర్చల అంశాలను బుధవారం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.. ఢిల్లీలో జరిగిన చర్చ అంశాలపై ‘విజయం’ ప్రతినిధి అందించే ఎక్స్ క్ల్యూజివ్ రాజకీయవిశ్లేషణాత్మక కథనం మీ కోసం..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
సామాజిక తెలంగాణే లక్ష్యంగా, రాజన్న రాజ్య స్థాపనే ద్యేయంగా స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తనయురాలు వైఎస్ షర్మిళ తండ్రి వైఎస్ఆర్ పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. పార్టీ బలోపేతం కోసం శతవిధాల ప్రయత్నాలు చేశారు.. ఖమ్మం జిల్లా కేంద్రంగా బహిరంగ సభను ఏర్పాటు చేసి అద్భుతమైన స్పీచ్ తో అదరగొట్టిన వైఎస్ షర్మిళ, అదే రోజున పార్టీ పేరును ప్రకటించారు. ఆ తరువాత తండ్రి జయంతి రోజున పార్టీ జెండాను విడుదల చేశారు.
ఇది కూడా చదవండి:- పార్టీని నడపలేని దద్దమ్మ రాహుల్ గాంధీ: మంత్రి
పార్టీ స్థాపించిన కొద్ది నెలల వరకు పార్టీ జడ్ స్పీడ్ లో దూసుకపోయిన వైఎస్ఆర్ టీపీ పార్టీ ఆ తరువాత బ్రేక్ లు పడుతూ వచ్చాయి.. కోటి ఆశలతో పార్టీని స్థాపించి అదే ఊపుతో పాదయాత్ర చేపట్టిన వైఎస్ షర్మిళకు తెలంగాణ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు.. పార్టీ అవిష్కరణ సమయంలో చేరిన నేతలు మినహా ఆ తరువాత పెద్దగా చేరికలు కనిపించలేదు.. పైగా పార్టీలోకి వచ్చిన వారు తిరిగి వెనుదిరిగి వెళ్లిపోయారు.. ఫలితంగా పార్టీని నడపడం కష్టమని భావించిన వైఎస్ షర్మిళ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నయ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని భావించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు వైఎస్ షర్మిళ సంసిద్దమైయ్యారు.. అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసిన వైఎస్ షర్మిళ.. తను స్థాపించిన పార్టీని విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పగా, వారు అంగీకరించారు. అయితే టిక్కెట్ల విషయంలో కొంత ఇబ్బందులు రావడం, వైఎస్ షర్మిళ పార్టీలో చేరిక విషయంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కేంద్రమాజీ మంత్రి రేణుక చౌదరి లాంటి వారు వ్యతిరేకించడంతో ఆమె పార్టీ విలీన ప్రక్రీయ ఆలస్యమైంది.
ఇది కూడా చదవండి:- అదైర్యపడకండి..నేనున్నా: పొంగులేటి
== తెలంగాణలో ప్రభుత్వమే లక్ష్యంగా
వైఎస్ షర్మిళ తెలంగాణలో పార్టీని స్థాపించి అధికారంలోకి రావాలని సంకల్పించారు. అందులో భాగంగానే 2021 సంవత్సరంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించారు. ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ వేదికగా పార్టీని స్థాపించారు. భారీ బహిరంగ సభను నిర్వహించిన ఆమె పార్టీ జెండా, ఏజెండాను ప్రకటించి, ఆ తరువాత సెప్టెంబర్ 2న పార్టీ జెండాను అవిష్కరించారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం, కేంద్రప్రభుత్వంపై మండిపడుతూనే ఉన్నారు. నిరుద్యోగ సమస్యపై, యువత సమస్యలపై, రైతుల కోసం అనేక పోరాట కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులు వైఎస్ షర్మిళను అనేక ధఫాలుగా అరెస్ట్ లు చేయడం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలపై వైఎస్ షర్మిళ తీవ్ర పదజాలంతో విమ్మర్శలు చేయడంతో జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఎప్పుడైతే షర్మిళ జైలుకు వెళ్లిందో..? పార్టీ పరిస్థితి తెలంగాణలో దయనీయంగా మారింది.. పార్టీని నడిపించే అవకాశాలపై నీళ్లు జల్లినట్లైంది..
ఇది కూడా చదవండి:- తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊసరవెల్లి లా మారాడు : షర్మిళ
దీంతో కాలక్రమేనా వైఎస్ షర్మిళ పార్టీలోకి వలసలు తగ్గాయి. సీనియర్ నాయకులు, ముఖ్యనాయకత్వం పార్టీ వైపు చూడటం లేదు. మీటింగ్ లకు హాజరువుతున్న జనం పార్టీలో చేరే విషయంలో వెనకడుగు వేస్తున్నారు.
== పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రమాణం
వైఎస్ షర్మిళ రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ కరుణగిరి సమీపంలో పార్టీ కార్యాలయం, ఇళ్లు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అందుకు స్థలాన్ని నిర్ణయించి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆమె పాలేరు ప్రజల సాక్షిగా, పాలేరు మట్టి సాక్షిగా పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని మాటిచ్చారు. పాలేరు బిడ్డగా అడుగుతున్న ఆశీర్వదించాలని కోరారు. ఆ తరువాత ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అందుకు గాను పాలేరు నియోజకవర్గంలో సర్వే చేయించగా, కొంత పర్శంటేజీ మాత్రమే గెలుపుకు అవకాశాలు రావడంతో ఆమె డైనమాలో పడినట్లు తెలుస్తోంది.
== కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిళ
వైఎస్ షర్మిళ కాంగ్రెస్ గూటిలో చేరేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు ఆమె గత కొద్ది రోజులక్రితం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలను ఢిల్లీలోని వారి స్వగ్రామంలో కలిసి పార్టీలో చేరే విషయంపై చర్చించారు. దీంతో సోనియా, రాహుల్ గాంధీలతో జరిగిన చర్చలు సఫలమైయ్యాయి.
ఇది కూడా చదవండి:- కేటీఆర్ నోరు జాగ్రత్త: సీఎల్పీ నేత భట్టి
కాగా పార్టీని సీట్ల విషయంలో షర్మిళను అడిగగా, ఆమె కొన్ని షరతులు పెట్టారు. పాలేరు టిక్కెట్ కావాలని, తనతో పాటు మరో ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని కోరింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పాలేరు టిక్కెట్ విషయంలో ఏమాత్రం సందు ఇవ్వలేదు. పాలేరు టిక్కెట్ ఇవ్వలేమని తెల్చి చెప్పేశారు. రాజ్యసభకు అవకాశం కల్పించి ఏపీ రాజకీయాల్లో కీలక పదవి ఇస్తామని ఢిల్లీ పెద్దలు చెప్పగా, షర్మిళ నిరాకరించింది. కొద్ది రోజుల వరకు సమయం ఇచ్చింది. కానీ ఢిల్లీ పెద్దల నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో మళ్లీ వైఎస్ షర్మిళ బెంగుళూరు పయనమైయ్యారు. అక్కడ డీకే శివకుమార్ ను కలిసి మాట్లాడగా, సీట్ల విషయంపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడి చెబుతానని అన్నారు. అప్పటికి పూర్తి స్థాయిలో సమాచారం రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల సలహదారుడైన సురేష్ ను కలిసి చర్చలు జరిపారు. ఆయన దూతగా ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించగా సోనియా, రాహుల్ గాంధీ అంగీకరించి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. దీంతో సోమవారం ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిళ, రాత్రి 8గంటలకు రాహుల్ గాంధీతో బేటి అయ్యారు. సుమారు గంట పాటు చర్చించుకున్న ఇద్దరు నేతలు పలు డిమాండ్ల విషయంలో సర్ధుబాటు కావడంతో చర్చలు సఫలమైయ్యాయి.
== ఖమ్మం ఎంపీగా షర్మిళా
పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానని మట్టి సాక్షిగా చెప్పిన వైఎస్ షర్మిళ.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని తెలంగాణ వచ్చిన అనంతరం కొంత మంది సీనియర్ రాజకీయ నేతల సలహా మేరకు ఎంపీగా పోటీచేయాలని చెప్పడంతో ఆమె నిర్ణయించారు. అయితే ఏపీ నుంచి పోటీ చేయాలని ఢిల్లీ పెద్దలు చెప్పగా వైఎస్ షర్మిళ అంగీకరించలేదు.. తెలంగాణలోనే ఉంటానని, తెలంగాణలోనే ప్రచారం చేస్తానని, తెలంగాణలో సీఎం కేసీఆర్ ను దింపేచే వరకు పోరాటం చేస్తానని తెల్చి చెప్పినట్లు తెలిసింది.
ఇది కూడా చదవండి:+ గెలుపుమంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం
దీంతో వైఎస్ షర్మిళ కు ఖమ్మం లోక్ సభ టిక్కెట్ ఇస్తే బాగుంటుందని, సర్వేలు కూడా అదే చెబుతున్నాయని డీకే.శివకుమార్ ఏఐసీసీ అగ్రనేతలకు చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంగీకరించినట్లు తెలుస్తోంది.. ఇదే విషయంపై ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరించిన వైఎస్ షర్మిళ, ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని అడిగినట్లు సమాచారం. కాగా రాహుల్ గాంధీ అంగీకరించినట్లు తెలుస్తోంది.దీంతో ఇరువురి చర్చలు సఫలం కావడంతో పార్టీలో చేరిక గురించి చర్చించగా, ఈనెల 5న పార్టీలో చేరాలని రాహుల్ గాంధీ సూచించినట్లు విస్వసనీయ సమాచారం. అదే జరిగితే ఈనెల 5న వైఎస్ఆర్ టీపీ పార్టీకి పుల్ స్టాఫ్ పడే అవకాశం ఉంది. అయితే ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా వైఎస్ షర్మిళాను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాల్సిందే.?