అసదుద్దీన్ పై కాల్పులు
మూడు రౌండ్ కాల్పులు జరిపిన దుండగులు
యూపీలో ఘటన.. క్షేమంగా బటయపడిన ఎంపీ అసద్
కాల్పులు జరిపిన వారిని స్థానికంగా పట్టుకున్న ఎమ్ఐఎం పార్టీ నాయకలు
(హైదరాబాద్ –విజయంన్యూస్)
ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. యూపి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ గురువారం ప్రచారంలో పర్యటన చేస్తుండగా కారు పై అకస్మీకంగా మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే కారుకు ఎలాంటి డ్యామెజీ కాలేదు. పైగా అసదుద్దీన్ క్షేమంగా బయటపడ్డారు. కాల్పులు జరిపిన దుండుగల్లో సచిన్ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో యూపీలో కాల్పుల కలకలం సష్టించిందనే చెప్పాలి. ఎన్నికల సమయంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల యావత్తు రాష్ట్రం నివ్వరబోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఎంఐఎం పార్టీకి చెందిన అభ్యర్థులు బరిలో నిలిచారు.
also read :-ముమ్మరంగా సభ్యత్వ నమోదు
కాగా వారి విజయాన్ని కాంక్షిస్తూ ఎంఐఎం అదినేత అసదుద్దీన్ ఓవైసీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నోవిడా జిల్లాలో పర్యటిస్తుండగా అకస్మికంగా అసదుద్దీన్ కారుపై కాల్పులు జరిగాయి. దీంతో మూడు రౌండ్లు కాల్పలు జరిపిన దుండగులు అయుదాలను అక్కడే వదిలేసి పరారైయ్యారు. అందులో సచిన్ అనే దుండగుడ్ని అక్కడే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా ఈ సంఘటనపై అసదుద్దీన్ ఓఐసీ స్పందించి మాట్లాడారు. అల్లా దయవల్ల నాకు ఎలాంటి ప్రమాదం కాలేదు. అయితే పక్కాగా రెక్కి నిర్వహించి నాపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల వెనకాల రాజకీయ కుట్ర దాగి ఉందని స్పష్టమవుతుంది. మమ్మల్ని భయపెట్టేందుకు నాపై కాల్పులు జరిపించారు. నన్ను చంపే దైర్యం ఎవరికి లేదు. యూపీ ఎన్నికల్లో ఎంఐఎం మంచి మెజారిటీ వస్తుందని కొంత మంది భయపడుతున్నట్లున్నారని ఆయన అన్నారు. దీనికి యూపీ ప్రభుత్వం భాద్యత వహించాలి. స్వతంత్ర దర్యాప్తు చేయాలి. ఇప్పటి వరకు నాకు చాలా బెదిరింపులు వచ్చాయని అన్నారు.
please subscribe this chanel smiling chaithu