Telugu News

ఏన్కూరులో ఆశా వర్కర్ల వంటావార్పు

0

ఏన్కూరులో ఆశా వర్కర్ల వంటావార్పు

 

ఏన్కూరు. అక్టోబర్ 8 ( విజయం న్యూస్ )

 

ఆశా వర్కర్ల రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా ఆదివారం ఏన్కూరు లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మెరుగు సత్యనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఆశా వర్కర్లు 14 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. కరోనాకాలంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సేవ చేసిన ఆశా వర్కర్లకు వేతనాలు పెంచకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హడావుడి తప్ప ప్రజా సమస్యలు గాలికి వదిలేసారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి ఆశ వర్కర్లు తాగిన బుద్ధి చెప్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు బానోత్ బాలాజీ సిపిఐ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు సిఐటియు మండల కార్యదర్శి ఏర్పుల రాములు, ఆశా వర్కర్ల సంఘం జిల్లా నాయకురాలు బానోత్ అమల,అనురాధ రజిని తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: నేడు తెలంగాణ ఎన్నికల షెడ్యూల్  విడుదల