Telugu News

ఊళ్ళోకి వస్తున్న కేంద్ర కమిటీ .. పరుగులు పెట్టిన అధికారులు..

బాబాసాగర్ పంచాయతీ ని పరిశీలించి హాడాహుడి 

0

ఊళ్ళోకి వస్తున్న కేంద్ర కమిటీ .. పరుగులు పెట్టిన అధికారులు..

** బాబాసాగర్ పంచాయతీ ని పరిశీలించి హాడాహుడి 

చింతలమానెపల్లి// విజయం న్యూస్

మండలంలోని బాబాసాగర్ గ్రామ పంచాయతీ పనీ తీరు, పారిశుధ్యం ఇతర వాటిపై కేంద్ర కమిటీ తనీఖీలు చేయనుందని ముందస్తు సమాచారంతో డీఆర్డీవో సురేందర్, ఏపీడీ, మండల ప్రత్యేక అధికారి కుటుంబరావు గురువారం గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలోని పలు ఇళ్లతో పాటు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. గ్రామంలో స్వచ్ఛతంగా ఉన్న ఇళ్లను, అంగన్వాడీ కేంద్రాన్ని తనీఖీకి వచ్చే అధికారులకు చూపించాలని పంచాయతీ కార్యదర్శికి దిశా నిర్దేశం చేశారు. పాఠశాలతో పాటు కాలనీలలో చెత్త ఉండటంతో . చింతలమానేపల్లి మండల కేంద్రంతో పాటు, రుదప్రూర్, గూడెం ఇతర గ్రామాల పంచాయతీ ట్రాక్టర్లతో పాటు పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి గురువారం రాత్రివరకు శుభ్రం చేయించారు. మండలంలోని ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు గ్రామంలోని ఆయా కాలనీలను గ్రూపులుగా విభజించుకోని పనులు చేయించారు. డీఆర్డీవో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న కూడా సర్పంచి రాలేదు. రేపటి కార్యాచరణపై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కార్యదర్శికి, ఎంపీడీవో కుటుంబరావును ఆదేశిం చారు. ముందస్తు సమాచారం తెలుసుకొని పనులు పూర్తి చేయించడానికి వచ్చిన అధికారులను గ్రామస్తులు చూసి ఊ..అన్నది కేంద్ర కమిటీ ఊ ఊ..అంటున్న అధికారులు , హడావుడి చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ఆయన తో పాటు ఎపీవో రాజన్న, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

allso read:- మేడారంకు 3,845 బస్సులు.. 50 ఎకరాల్లో భారీ బస్టాండ్