Telugu News

ఫారేస్టు చెక్ పోస్టు తాడు మెడకు చుట్టుకుని యువకుడి మృతి.

0

ఫారేస్టు చెక్ పోస్టు తాడు మెడకు చుట్టుకుని యువకుడి మృతి.

(జైనూర్ విజయం న్యూస్) :

మండలంలోని జంగాం గ్రామానికి చెందిన శ్రీకాంత్ ( 20 ) అను యువకుడు ఫారెస్టు చెకోపోస్టు తాడు మెడకు తగలడంతో మృతి చెందాడు . స్థానికులు , కుటుంబికులు తెలిపిన వివరాల ప్రకారం .జంగాం గ్రామానికి చెందిన జైనూర్ మండల పరిషత్ ఉపాధ్యాక్షుడి కుమార్తె వివాహం ఉట్నూర్ జరుగగా ఈ వివాహానికి జంగాం గ్రామం నుండి శ్రీకాంత్ కూడా వెళ్లి తిరిగి మ్యాక్స్ పికప్ వాహానంలో వస్తున్నాడు . జంగాం ఘాట్ ప్రాంతంలో అటవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెకో పోస్టు వద్ద దండకు తాడు బిగించి ఉంటుంది . అట్టి తాడు కిందస్థాయిలో వేలాడుతుండగా మ్యాక్స్ వాహానంలో ప్రయాణిస్తున్న శ్రీకాంత్ మెడకు తగలింది . దీంతో శ్రీకాంత్ తాడు తగలడంతో కిందపడ్డాడు . అట్టి తాగు గట్టిగా మెడకు తగలడం , శ్రీకాంత్ రోడ్డుపై పడటంతో తీవ్రగాయాలు అయ్యాయి . తోటి వారు శ్రీకాంథ్ కు చికిత్స కోసం ఉట్నూర్ దవాఖానాకు తరలించగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబికులు తెలిపారు . అటవి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద అటవి శాఖ సిబ్బంది ఉండటం లేదని , దండకు తాడు బిగించి ఉంటుండగా అదికింద స్థాయి వరకు వేలాడుతుందని , దీంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి : లక్ష్మీదేవిపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి మృతి.