త్వరలో స్టాఫ్ నర్సు ఏఎన్ఏం ఉద్యోగాలకు నోటిఫికేషన్
దసరా కానుకగా వెయ్యిమంది డాక్టర్ల నియామకం అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు
త్వరలో స్టాఫ్ నర్సు ఏఎన్ఏం ఉద్యోగాలకు నోటిఫికేషన్
దసరా కానుకగా వెయ్యిమంది డాక్టర్ల నియామకం
అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు
(హైదరాబాద్ -విజయంన్యూస్)
రాష్ట్రంలో వెయ్యి మంది డాక్టర్ల నియామక ప్రక్రియ తుదిదశకు చేరుకున్నదని, దసరా నాటికి ఉత్తర్వులు అందజేస్తామని వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
ఇది కూడా చదవండి:-అసెంబ్లీలో కేంద్రంపై మండిపడిన మంత్రి పువ్వాడ
అసెంబ్లీలో వైద్య సిబ్బంది పదవీ విరమణ వయసు పెంపు సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు.0
స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎం, ఇతర సిబ్బంది నియామకానికి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని..గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో 800 మంది సీనియర్ రెసిడెంట్లను ఇటీవలే పూర్తిగా జిల్లాల్లోనే నియమించామని వెల్లడించారు. దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు తుదిదశలో ఉన్నదని, 15 రోజుల్లో ప్రారంభమవుతుందన్నారు. తెలంగాణ ఆవిర్భవానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే, ఇప్పుడు 103కు చేరాయని చెప్పారు.
Allso read:- ఇంట్లోకి చొరబడి… చేతులు కాళ్ళు కట్టేసి… బంగారం, నగదు అపహరణ.