Telugu News

ఏడోసారి… అసెంబ్లీలో అడుగిడుతున్న ఈటల రాజేందర్

అందర్నీ కలుపుకొని పోతారన్న అభిప్రాయం

0

ఏడోసారి…
అసెంబ్లీలో అడుగిడుతున్న ఈటల
– వరుస విజయాలతో జయకేతనం
– ఆయనంటే ఎనలేని అభిమానం
– అందర్నీ కలుపుకొని పోతారన్న అభిప్రాయం
– ఆ సాన్నిహిత్యమే విజయం వైపు తీసుకెళ్ళేలా చేస్తోంది
– అందరి బంధువు ఆయన

(కరీంనగర్ నుంచి విజయం ప్రత్యేక ప్రతినిధి):
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్ ఏడోసారి అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. విశేషం వరుస విజయాలతో టిఆర్ఎస్ లో చొచ్చుకుపోయిన ఆయన ఈసారి భారతీయ జనతా పార్టీ నుండి జయకేతనం ఎగురవేశారు. మొత్తం ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు నియోజకవర్గంలో ప్రత్యేకమైన స్థానముంది. అధికార పార్టీ దళిత బంధువుకు పెద్దపీట వేస్తే అంతకంటే ఎక్కువగా ఆయన అందరి బంధువని నియోజకవర్గ ప్రజలు పెనవేసుకున్నారు. ఈ కోవలోనే ఆయన విజయం చాలా సులువైంది. చావులోనూ.. శుభకార్యాల్లోనూ అందరిని తడుతూ ఆత్మీయతను పంచే ఆయనంటే నేటికీ ఎనలేని అభిమానం. నియోజకవర్గ ప్రజలు ఏడుసార్లు ఆయనకు పెద్దపీట వేశారని ఎన్నికల చరిత్రను బట్టి తెలుస్తోంది.

హుజూరాబాద్ నియోజకవర్గం నుండి ఈటల రాజేందర్ మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అభ్యర్థి ఈటల రాజేందర్ పై విజయం సాధించిన ఆయన ఏడోసారి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుతున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ఆయన విజయాన్ని ఆపలేకపోయాయన్న అభిప్రాయాలు నియోజకవర్గ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు లక్ష్యంగా చేసుకుని ప్రచార పర్వం చేపట్టినప్పటికీ ఆయన వ్యక్తిగత ఓటు బ్యాంకును కొల్లగొట్టలేక పోయారని చాలామంది చెప్పుకుంటున్నారు.

ఇప్పటికి ఆరు సార్లు గెలుపు…
తొలుత కమలాపూర్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొదటిసారి కమలాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందినా.. ఐదుసార్లు హుజురాబాద్ నుండి విజయం సాధించారు. వరుసగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్దసాని దామోదర్ రెడ్డి తో పాటు కృష్ణమోహన్, కేతిరి సుదర్శన్ రెడ్డి, కౌశిక్ రెడ్డిలను ఆయన ఓటమి పాలు చేశారు. ఏడు అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ సునాయాసంగా ఓడించారు.

భారీ మెజార్టీతోనే గెలుపు.. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ ఈ సారి సైతం దేశ దృష్టిని ఆకర్షిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆరు ఎన్నికల విషయానికి వస్తే 2008 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 19 వేల 609 ఓట్ల మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దసాని దామోదర్ రెడ్డి పైవిజయం సాధించారు. అదేవిధంగా 2009లో టిడిపి అభ్యర్థి పై 22 వేల 708 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతోపాటు 2009లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కృష్ణమోహన్ పై 15 వేల పైచిలుకు ఓట్లతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా 2010లో ఎన్నికల మాత్రం ఆయన భారీ మెజార్టీ సాధించారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ పడ్డ సుదర్శన్ రెడ్డిని 79702 ఓట్ల మెజారిటీతో ఓడించారు. అనంతరం 2014 ఎన్నికల్లో 57 వేల పైచిలుకు ఓట్లతో.. 2018లో 43 వేల 719 ఓట్లతో ఈటల విజయం సాధించారు.

సంవత్సగెలుపొందిన మెజార్టీ
అభ్యర్థి
2004ఈటెల రాజేందర్ 19,619
2008. ఈటెల రాజేందర్ 22,284
2009 ఈటల రాజేందర్ 15,035
2010 ఈటెల రాజేందర్ 79,227
2014. ఈటెల రాజేందర్ 57,037
2018. ఈటెల రాజేందర్ 43,719

all so read ;- ఈటెల ఘన ‘విజయం’