Telugu News

కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు సహాకరిస్తా.

కూసుమంచి మీడియా మిత్రులు చాలా మంచివారన్న పొంగులేటి.

0

కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు సహాకరిస్తా.

* *కూసుమంచి మీడియా మిత్రులు చాలా మంచివారన్న పొంగులేటి.

* *మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన కూసుమంచి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం.

* *నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించి అభినందించిన పొంగులేటి.

 (కూసుమంచి-విజయంన్యూస్)

కూసుమంచి మండలంలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణం కోసం తన వంతు కృషి ఉంటుందని, తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి భవనం మంజూరు కోసం కృషి చేస్తానని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ర్ట నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామినిచ్చారు.  ఇటీవలే కూసుమంచి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా  ఎన్నిక జరిగింది. కాగా వారు గురువారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన క్యాంఫ్ కార్యాలయంలో మర్యాధ పూర్వకంగా కలిసి మాట్లాడారు. శీనన్నకు మొక్కను ఇచ్చి శాలువతో ఘనంగా సన్మానించారు. కాగా  పొంగులేటి శీనన్న నూతన కమిటీ అధ్యక్షుడు పెండ్ర అంజయ్యతో పాటు అందరిన్ని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. విలేకర్లందరు ప్రజల కోసం పనిచేయాలని, తద్వారా ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు పరిపాలన బాగుంటుందని, పల్లెలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. అలాంటి వార్తలను రాయాలని కోరారు. నిజాలు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లు రాయాలని కోరారు. ప్రతి వార్త ప్రజల కోసం, ప్రజలకు మేలు చేసేవిలా ఉండాలని కోరారు. విలేకర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామినిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండల కమిటీ అధ్యక్షుడు పెండ్ర అంజయ్య, గౌరవ అధ్యక్షుడు సారబుడ్ల గోవిందరెడ్డి, ప్రధానకార్యదర్శి మాతంగి భార్గవ్, కోశాధికారి కొండా శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు వడ్డెబోయిన వెంకయ్య, గరిణి నాగేశ్వరరావు,సహాయ కార్యదర్శులు ఇరుగు శ్రీనివాస్, కొమ్ము ప్రభాకర్, ప్రచారకార్యదర్శి కొలిపొంగు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.

జడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ను కలిసిన నూతన కార్యవర్గం.

కూసుమంచి మండల ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటు అయిన తరువాత గురువారం కూసుమంచి మండలం జడ్పీటీసీ ఇంటూరి బేబి, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ దంపతులను నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు వారథులుగా పనిచేయాలని కోరారు. అనంతరం దంపతులను ఘనంగా సన్మానించారు.  వారు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండల కమిటీ గౌరవ అధ్యక్షుడు సారబుడ్ల గోవిందరెడ్డి, ప్రధానకార్యదర్శి మాతంగి భార్గవ్, కోశాధికారి కొండా శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు వడ్డెబోయిన వెంకయ్య, గరిణి నాగేశ్వరరావు,సహాయ కార్యదర్శులు ఇరుగు శ్రీనివాస్, కొమ్ము ప్రభాకర్, ప్రచారకార్యదర్శి కొలిపొంగు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.

also read :-కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు చేయాలని వినతి