Telugu News

గవర్నర్ న్ను నిలదీసిన బాధితలు

అశ్వపురంలో పునరావస కేంద్రాన్నిపరిశీలించిన గవర్నర్

0

గవర్నర్ కు నిరసన సెగ

== గవర్నర్ న్ను నిలదీసిన బాధితలు

== అశ్వపురంలో పునరావస కేంద్రాన్నిపరిశీలించిన గవర్నర్

== అందర్నిఅదుకుంటామని హామి..

రిపోర్టర్: సందీఫ్: అశ్వాపురం, జులై 17(విజయంన్యూస్)

పునరావస కేంద్రంలో ఉన్న వరద ముంపు బాధిత ప్రజలను కలిసేందుకు అశ్వాపురంలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైని బాధిత మహిళలు ప్రశ్నించారు. దీంతో ఆమె అందర్ని అదుకుంటామని హామినిచ్చి వెళ్లిపోయారు.  వరదబాధితులను, గోదావరి వరద పరిస్థితిని పరిశీలిచేందుకు రెండు రోజుల పర్యటనలో భాగంగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు గవర్నర్ తమిళసై శనివారం సాయంత్రం మణుగూరుకు వచ్చారు. అక్కడ బస చేసిన ఆమె ఆదివారం ఉదయం10గంటలకు అమ్మగారిపెళ్లి గ్రామంలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన పునరావస కేంద్రంలోని బాధితులను పరామర్శించారు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  అశ్వాపురం గ్రామంలో ఎస్ కె టీ పంక్షన్ హాల్ ఉన్న పునరావాస కేంద్రంలో బాధితులకు లయన్స్ క్లబ్ ఇండియన్  రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరద బాధితులకు,చిన్నారులకు, బిస్కెట్లు, హెల్త్ కిట్టు లను గవర్నర్ తమిళ సై పంపిణి చేశారు. తిరిగి వెళ్తున్న గవర్నర్ కు నిరసన సెగ ఎదురైంది.  వరద బాధితులు తమిళ సై ని ప్రశ్నించారు. బిస్కెట్లు, హెల్త్ కిట్స్ ఇస్తే సరిపోతుందా..? మా గురించి తెలుసుకోరా, మాతో మాట్లాడేది లేదా అంటూ కొందరు మహిళలు అడ్డుకున్నారు. వరద బాధితులు నిరసన వ్యక్తం కావడం,మహిళలు అరుపులు కేకలు తీవ్ర నిరసనలు మద్య  హెవీ వాటర్ ప్లాంట్ గెస్ట్ హౌస్ కు గవర్నర్  వెనుదిరిగి వెళ్లిపోయారు.

ALLSO READ- రోడ్డు మార్గంగానే భద్రాచలానికి సీఎం