Telugu News

అశ్వాపురంలో పునరావస బాధితుల నిరసన

పునరావస కేంద్రాలకు తాళాలు

0

అశ్వాపురంలో పునరావస బాధితుల నిరసన

== పునరావస కేంద్రాలకు తాళాలు

== పోలీసుల భారీ బందోబస్తు

== సీఎంను కలవకుండా చేశారని పోలీసులపై ఆగ్రహం

== గేట్లు తొలగించుకుని బయటకు వచ్చిన బాధితులు

== నిండు వర్షంలో రోడ్డుపై బేటాయింపు

రిపోర్టర్ : సందీప్, అశ్వాపురం, జులై 17(విజయంన్యూస్)

గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించేందుకు, వరద పరిస్థితులను తెలుసుకునేందుకు గోదావరి పారిత ప్రాంతాలను పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ రెండు జిల్లాల పర్యటనలో భాగంగా ఆదివారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాకు వచ్చారు. ఆయన మణుగూరు, అశ్వాపురం మండలాల మీదగా వస్తుండగా, అక్కడే పునరావస కేంద్రాల్లో ఉన్న జనం సీఎంను కలిసేందుకు అవకాశం కల్పించాలని పోలీసులను, అధికారులను వేడుకున్నారు. వారు అవకాశం ఇవ్వకపోవడంతో పోలీసులను వారించారు. కాగా పోలీసులకు, బాధితులకు తోపులాట జరిగింది. దీంతో పోలీసులు గేట్లు వేసి తాళాలు వేశారు. అయినప్పటికి బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి గేట్లు తీసుకుని రోడ్లపైకి వచ్చారు. అశ్వాపురం ఎస్ కెటీ పంక్షన్ హాల్ లో ఉన్న వరద బాధితులు, అలాగే మెండికుంట కేవీఆర్ పంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గేట్లను తెరుచుకుని రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. దీంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అశ్వాపురంలో ఉత్కంఠత నెలకొంది.

ALLS0 READ- గవర్నర్ న్ను నిలదీసిన బాధితలు