Telugu News

అశ్వాపురంలో టీఆర్ఎస్ నేతల ఢిష్యూండిష్యూం

రేగా వర్సెస్ పొంగులేటి వర్గీయుల మధ్య ఘర్షణ

0
అశ్వాపురంలో టీఆర్ఎస్ నేతల ఢిష్యూండిష్యూం
== రేగా వర్సెస్ పొంగులేటి వర్గీయుల మధ్య ఘర్షణ
== వరద బాధితుల చుట్టూ బురద రాజకీయం.
== ఆధిపత్యం కోసం కారు పార్టీ నేతల సైయ్యాట.
== నేతల బాహా బాహి…
== పరస్పరం ఓ వర్గంపై మరో వర్గం దాడులు.
== తాజా మాజీ అనుచర్ల మధ్య ఆదిపత్య పోరు.
==  బాధితుల ఓదార్పు పేరుతో మాజీ ఎంపీ చక్కర్లు.
== రాయలసీమను తలపిస్తున్న రాజకీయ రణరంగం

(రిపోర్టల్లు: మంచుల క్రిష్ణా, సందీఫ్)

మణుగూరు/అశ్వాపురం. జులై 24 (విజయం న్యూస్)
అశ్వాపురం మండలంలోని కారు పార్టీ నేతల మధ్య కారు చిచ్చు మళ్లీ రాజుకుంది.తాజాగా  తాజా మాజీల అనుచరుల మధ్య అనందాపురం గ్రామంలోని వరదబాధిత జాబితా లో  పేర్ల నమోదులో చిన్న సంఘటన చిలికి చిలికి గాలివానలా మారింది కారు పార్టీ నేతల మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకొని ముష్టి యుద్ధానికి దిగారు. నిన్న మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న ఆధిపత్య పోరు వరద జాబితా పేర్ల ప్రకటనపై పరస్పర దాడులతో కారు పార్టీలో నెలకొన్న అసమ్మతులు బహిరంగంగా వ్యక్తమయ్యాయి.
ఇది కూడా చదవండి: భద్రాచలం భవిష్యత్తేమిటి? విశ్లేషణాత్మక కథనం
తాజా మాజీ ఎమ్మెల్యేలు వర్గాలుగా విడిపోయిన గులాబీ నేతలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కొనసాగించేందుకు చేస్తున్న బల ప్రదర్శనకు ఆనందపురం గ్రామం వేదికగా మారింది. గత రెండు రోజుల క్రితం పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు గ్రామంలో పర్యటించి వరద బాధితులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వారికి ప్రభుత్వ నుండి మంజూరైన బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేసి బాధితులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మాజీ ఎంపీపీ ప్రధాన ఆకర్షణగా నిలిచి అన్నితామై రేగా వెంటా నడిచారు. గ్రామంలో రేగా కాంతారావు పర్యటనకు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున నీరాజనం పలకగా ప్రభుత్వ విప్ రేగా పర్యటనకు మాజీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన జడ్పిటిసి వర్గీయులు దూరంగా ఉన్నారు. కాగా ఆదివారం ఖమ్మం మాజీ ఎంపీ నియోజకవర్గ పర్యటనకు ఆనందపురం గ్రామంలో పర్యటించేందుకు జెడ్పిటిసి వర్గీయులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఇలా ఒకరిపై ఒకరు బల ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధమవుతుండడంతో గులాబీ పార్టీలో నేతల మధ్య నెలకొన్న అంతర్గత పోరు బహిరంగ ప్రదర్శనకు వేదిక అయింది. దీంతో గ్రామం పై ఆధిపత్యం కోసం తాజా మాజీ ఎమ్మెల్యే వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ జడ్పిటిసి వర్గీయులు గ్రామంలో ఆదివారం ఉదయం ఒకరి పై మరొకరు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటూ బాహాబాహి తో తలపడ్డారు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి గ్రామంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను అదుపు చేసేందుకు 144 సెక్షన్ విధించారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరద బాధితులను పరామర్శించి సహాయం అందించేందుకు గ్రామానికి వచ్చారు. ఆయనకు జడ్పిటిసి వర్గీయులు స్వాగతం పలికారు ఆది నుండి అశ్వాపురం మండలం ప్రత్యేక రాజకీయ చరిత్రను సంతరించుకుంది తాజాగా పినపాక నియోజకవర్గ నికీ చెందిన తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న వర్గ పోరు ఆనందపురం గ్రామంలో  ఘర్షణ వాతావరణం సృష్టించింది. ఓ వర్గం పై మరోవర్గం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసుకొవడంతో గ్రామంలో ని   రాజకీయం రాయలసీమ రణ రంగాన్ని తలపిస్తుంది. కాగా టిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తి జ్వాలలు వరద బాధితుల పట్ల బురద రాజకీయం చేస్తూ తమ రాజకీయ ప్రాబల్యాన్ని చాటుకునేందుకు ఒకరిపై మరొకరు పై చేయి సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలతో వరద బాధితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా కష్టాల్లో ఉన్న తమను ఆదుకొని సహాయం అందించి ఆదుకోవాలని చేతులు జోడించి బాధితులు వేడుకుంటున్నారు. కాగా మాజీ ఎంపీ ముంపు గ్రామాల ప్రజలను ఓదార్పు పేరుతో నియోజకవర్గంలోని గ్రామాలలో చక్కర్లు కొడుతున్నారు.
ఇది కూడా చదవండి:- భద్రాద్రికి ముప్పు తప్పదా..? వాతావరణ శాఖ ఆదేశాల మేరకు విశ్లేషణత్మక కథనం
దీంతో రేగా కాంతారావు వర్గీయులు మాజీ ఎంపీ పర్యటనకు దూరంగా ఉండి పరిస్థితులను గమనిస్తున్నారు ఏది ఏమైనా వరద బాధితులను ఆదుకునే విషయంలో కారు పార్టీ నేతల మధ్య నెలకొన్న రణరంగం ఎటువైపు దారి తీస్తుందోననే పరిస్థితులు నెలకొన్నాయి . మరోవైపు గులాబీ పార్టీలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న పోరు అధికార ప్రతిపక్ష పాత్ర ను పోషిస్తున్నాయి. ప్రతిపక్షం లేని లో టును కూడా అధికార పార్టీ నేతలే పూడ్చుతుండటం గమనార్హం. ఏది ఏమైనా గులాబీ పార్టీ లోని  నేతల మధ్య సయ్యాట ఎలా ఉన్నా వరద బాధితులకు న్యాయం జరిగేనా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి వరద బాధితులను ఆదుకోవడంలో అధికార పార్టీ వైఫల్యం చెందిందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా తమ పార్టీలో ఆధిపత్యపోరును పక్కకు పెట్టి వరద బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో కోరుతున్నారు వీరికి విపత్తులు వస్తేనే ప్రజలు గుర్తుకొస్తారని బహిరంగ విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరద బాధితులను ఆదుకునేందుకు పరస్పరం ప్రకటించిన సహాయాన్ని తమకు సత్వరమే అందించి న్యాయం చేయాలని ప్రజలు గులాబీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకరిపై ఒకరు నువ్వా నేనా అన్నట్లు సాగిస్తున్న ఆధిపత్య పోరుకు రానున్న ఎన్నికలే సమాధానం కానున్నాయని నియోజకవర్గంలోని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.