Telugu News

తాటి చేరికతో కాంగ్రెస్ లో ముసలం

భట్టిని కలిసిన అశ్వరరావుపేట కాంగ్రెస్ నేతలు

0

తాటి చేరికతో కాంగ్రెస్ లో ముసలం

== భట్టిని కలిసిన అశ్వరరావుపేట కాంగ్రెస్ నేతలు

== పార్టీకి సమాచారం లేకుండా, నాయకులకు సంబంధం లేకుండా పార్టీలో చేరడమేంటని ఆగ్రహం

== రేపు రేవంత్ తో బేటి అయ్యే అవకాశం

== సర్దిచెప్పే ప్రయత్నంలో కాంగ్రెస్ ఆగ్రనేతలు

అశ్వారావుపేట, జూన్ 26 (విజయం న్యూస్)

అశ్వరరావుపేట కాంగ్రెస్ లో ముసలం షూరు అయ్యింది.. ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు.. అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టాల్లో పనిచేస్తూ, అవమానాలను, కేసులను భరిస్తూ పార్టీని నడిపించుకుంటూ పనిచేస్తున్న వారిని అవమానించడమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. తాటి వెంకటేశ్వర్లు చేరిక పై కనీసం సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేర్చుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారి పరిస్థితేంటని రాష్ట్ర అగ్రనాయకత్వాన్ని అడుగుతున్నారు.. అందులో భాగంగానే ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అశ్వరరావుపేట నియోజకవర్గానికి చెందిన కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి తమ గోడును విన్నవించారు. అంతే కాకుండా సోమవారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి తమ పరిస్థితిని వివరించేందుకు సిద్దమైయ్యారు. ఇప్పటికే అపాయింట్మెంట్ ను కోరగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. అశ్వరరావుపేటలో అసలేం జరుగుతోంది..?

ALLSO READ- స్త్రీలు, పిల్లలపై పారెస్టు అధికారుల దాష్టికం

అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీ నుంచి విజయం సాధించిన తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరగా, 2018లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి మోచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమిపాలైయ్యారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అగ్రనాయకత్వం అవమానిస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చేరిక కొంత ఆలస్యమవుతుందని అనుకున్నప్పటికి అర్థాంతరంగా రెండు రోజుల్లోనే అంతా కార్యాన్ని ముగించుకున్నారు. అయితే నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకత్వాన్ని సంప్రదించడం కానీ, కనీసం జిల్లా అధ్యక్షుడికి చెప్పడం జరగలేదు. పీసీసీ నుంచి కానీ గాంధీభవన్ నుంచి కూడా అశ్వరరావుపేట నియోజకవర్గ ప్రజలకు సమాచారం లేకపోవడంతో ఆ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహంగా, అసంతప్తిగా ఉన్నారు.

== భట్టిని కలిసిన అశ్వరావుపేట కాంగ్రెస్ నేతలు                ALLSO READ- పోలీసులు.. సైకిల్ ఎక్కారు.. ఎందుకోసమంటే..?

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ లో  చేరిక పై  అశ్వరావుపేట కాంగ్రెస్ పార్టీలో  ముసలం ప్రారంభమైంది. ఆయన చేరికతో లుకలుకలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తాటి పార్టిలో  చేరుతున్నట్లు కనీస సమాచారం లేదంటూ అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులోని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి, కిసాన్ సెల్ చీకటి శ్రీనివాసరావు, దమ్మపేట మండల అధ్యక్షులు మద్దిశెట్టి సత్యప్రసాద్, అన్నపురెడ్డిపల్లి మండల ఇంఛార్జి వనమా గాంధీ, బీసీ సెల్ తుమ్మ రాంబాబు,  మొగళ్లపు చెన్నకేశవరావు చిలకా శ్రీను, కందుల వెంకటేశ్వరరావు, వెంకట్, పాండు, ములకలపల్లి మహిళ మండలి అధ్యక్షురాలు బూరుగుపల్లి పద్మ, జమలయ్య, మహేష్, అంజుమ్ తదితరులు భట్టిని కలిసి తమ గోడును వెల్లబుచ్చుకున్నారు. తాటి పార్టీలోకి చేరడం ప్రసారమాధ్యమాల్లో చూసి తెలుసుకోవాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేసారు.కనీసం జిల్లా డి.సి.సి కూడ సమాచారం లేకపోవడం ఘర్హనీయమని వారు సీఎల్పీ నాయకుడుకు పిర్యాదు చేశారు. భట్టకి అశ్వారావుపేట నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ పురోగతి గురించి సవివరంగా వివరించారు.

== రేవంత్ ను కలిసే అవకాశం..?

తాటి వెంకటేశ్వర్లు పార్టీలో చేరిక విషయంపై అసంతప్తిగా ఉన్న అశ్వరరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తమకు సమాచారం ఇవ్వకుండా పార్టీలో చేరికపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించాలని అశ్వరరావుపేట నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆలోచనలో ఉన్నారు. ఆదివారం భట్టిని కలిసిన వారు సోమవారం రేవంత్ రెడ్డిని కలిసేందుకు సిద్దమైయ్యారు. కాగా ఇప్పటికే అపాయింట్మెంట్ కోరగా ఆయన కలుస్తానని అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో అశ్వరరావుపేట నియోజకవర్గ పరిస్థితులపై వారికి సవివరంగా వివరించాలని భావిస్తున్నారు.

== కష్టాల్లో పార్టీని రక్షించిన వారి సంగతేంటి..?                                            ALLSO READ- పినపాక టిఆర్ఎస్ లో ముసలం…

8ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినప్పటికి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నఅనేక కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థికంగా మారింది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటూ పార్టీని మోసిన నాయకులు తాటి చేరికతో ఆయోమయంలో పడిపోయారు. అశ్వరరావుపేట టిక్కెట్ కోసం సున్నం నాగమణితో పాటు కొందరు నాయకులు ఆశపడ్డారు. కానీ మెరుపుతీగ వచ్చినట్లు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన తాటి వెంకటేశ్వర్లకు టిక్కెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు అశ్వరరావుపేటలో చర్చ జరుగుతోంది. అదే జరిగితే ఇఫ్పటి వరకు పార్టీని మోసిన నాయకులు, అశావాహుల పరిస్థితి ఏంటని..? ఆ పార్టీ నాయకులు ఆలోచనలో పడ్డారు. అలాగే తాటి వెంకటేశ్వర్లలతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన వర్గీయులు పార్టీలో చేరారు. రేపు టిక్కెట్ వచ్చిన వారికే ప్రీయార్టీ ఉంటుంది. ఇన్ని రోజుల పాటు పనిచేసిన మా పరిస్థితి ఏంటని ఆ పార్టికి చెందిన నాయకులు ఆలోచన పడ్డారు. అయితే పార్టీ నాయకులను, కార్యకర్తలను సీఎల్పీ నేత భట్టి సముదాయించినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లో ఇవ్వన్ని కామన్ గానే జరిగే ప్రక్రీయ అని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ ఒక్కర్ని పార్టీ వదులుకునే ప్రసక్తే లేదని, కచ్చితంగా న్యాయం చేస్తామని హామినిచ్చినట్లు సమాచారం.

== కాంగ్రెస్ శ్రేణులు అదైర్యపడోద్దు :తాటి

కాంగ్రెస్ శ్రేణులు అధైర్యపడవద్దని మాజీ ఎమ్మెల్యే, మాజీ ట్రైకార్ చైర్మన్ , కాంగ్రెస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. సమయాభావం వలన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులను కలవలేకపోయానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు అతి త్వరలోనే అశ్వారావుపేట నియోజకవర్గ మండలాల్లోని నాయకులను,కార్యకర్తలను, వ్యక్తి గతంగా కలిసి మద్దతు తీసుకుంటానని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ వాదిని సమన్వయం చేసుకుని కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారుజ  తెలంగాణా ఇచ్చిన సోనియమ్మ రాహుల్ గాంధీ సారథ్యంలో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్ పి నేత భట్టి విక్రమార్క, డిసిసి అధ్యక్షులు పోదెం వీరయ్య తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని అన్నారు. పార్టీ లో ఏ పదవి ఇచ్చినా పార్టీ శ్రేణులను కలుపుకుని ముందుకు సాగుతామని ప్రకటించారు.

ALLSO READ- కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే తాటీ