Telugu News

దేశ ప్రగతిలో జర్నలిస్టుల కీలక పాత్ర

టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే. అనిల్ రెడ్డి

0

దేశ ప్రగతిలో జర్నలిస్టుల కీలక పాత్ర
★★ టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే. అనిల్ రెడ్డి
చండ్రుగొండ ఆగస్టు 21 (విజయం న్యూస్ ):- జర్నలిస్టులు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ సమాజంలో నెలకొన్న ప్రజా సమస్యలపై కలం తో పోరాటం చేయాలని (టి డబ్ల్యూ జే ఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కే.అనిల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక భాస్కర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన అశ్వరావుపేట నియోజకవర్గ టి డబ్ల్యూ జే ఎఫ్ ప్రథమ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిజం పై ఉన్న నమ్మకంతో, ప్రేమతో ఈ వృత్తిలోకి వచ్చినవారు దీర్ఘకాలం కొనసాగుతారని, సంపాదించుకోవడానికి వచ్చిన ఎక్కువ కాలం నిలువలేరున్నారు. జర్నలిస్టుల హక్కులకోసం సంఘం నిరంతరం పనిచేస్తుందని, జర్నలిస్టుల కు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ప్రభుత్వం మంజూరు చేయాలని, ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు. కలం పట్టిన ప్రతి విలేఖరికి అక్రిడేషన్ కార్డులు, బస్ పాస్ లు ఇవ్వాలన్నారు. అనంతరం నియోజకవర్గ కమిటీ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Allso read-కల్యాణం..కమనీయం..పువ్వాడ వారి పరిణయం

టిడబ్ల్యూజేఎఫ్ అశ్వరావుపేట నియోజకవర్గ అధ్యక్షునిగా మట్లకుంట చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి గా కుంజా వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఎండి పాషా, శివకుమార్ లు, గౌరవ అధ్యక్షులుగా సయ్యద్ రబ్బానీ, సహాయ కార్యదర్శిలుగా పువ్వాల శ్రీనివాస్, కృష్ణ ప్రసాద్, కోశాధికారిగా ఆకుల శివ, సభ్యులుగా కురం సురేష్, చెన్నారావు, కుక్క మూడి దినేష్, సోమనపల్లి వెంకటేశ్వర్లు,సవడం వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో టి డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామిశెట్టి సైదయ్య, మడిపల్లి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పూదోట సూరిబాబు, ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వర్లు, మునగాల వెంకట కోట చారి, రవికుమార్, రమేష్, హరి నాగ వర్మ, బొగ్గుల శివనాగిరెడ్డి, సంపత్ రెడ్డి, నెరేళ్ల కుంట సుధాకర్ రావు, ఉప్పుతల ఏడుకొండలు, ఎస్కే జాఫర్, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.