Telugu News

స్త్రీలు, పిల్లలపై పారెస్టు అధికారుల దాష్టికం

బెల్ట్ లు, కర్రలతో దాడి.. ఉరికించి కొట్టిన పారెస్టు అధికారులు

0

స్త్రీలు, పిల్లలపై పారెస్టు అధికారుల దాష్టికం

== బెల్ట్ లు, కర్రలతో దాడి.. ఉరికించి కొట్టిన పారెస్టు అధికారులు

== తీవ్ర ధాష్టీకాన్ని ప్రదర్శించిన చండ్రుగొండ అటవీ అధికారులు
==  ఫారెస్ట్ అధికారుల ప్రవర్తనా తీరుపై సర్వత్రా విమర్శలు

== మెచ్చా సమన్వయానికి తూట్లు 

== ఫారెస్ట్ అధికారులపై పోలీసు స్టేషన్ లొ పిర్యాదు

చండ్రుగొండ, అశ్వారావుపేట జూన్ 26( విజయం న్యూస్)

పారెస్టు అధికారులు మహిళల పట్ల దాష్టికం చూపించారు.. తమ భూమిని కాపాడుకునేందుకు వచ్చిన మహిళలు, పిల్లలపై పారెస్టు అధికారులు విచక్షణ రహితంగా దాడి చేసినట్లు వీడియో స్పష్టం చేస్తోంది.. బెల్ట్ లు, కర్రలతో దాడి చేశారు.. మహిళలను, పిల్ల తల్లులను ఊరికించి బాదినట్లుగా వీడియోలో స్పష్టంగా క

నిపిస్తోంది.. ఒక వైపు ప్రభుత్వం పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెబుతుంటే మరో పక్క పారెస్టు అధికారులు అమాయక గిరిజన బిడ్డలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు.. ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు.. పోలీసులంటే సహనశీలులు అంటారు.. ఆడబిడ్డకు ఉన్న ఓపిక పోలీసులకు ఉండాలంటారు.. కానీ పారెస్టు అధికారులు ఎంత ఒపిక పట్టారో..? వీడియో చూస్తే కనిపిస్తుంది.. ఆ వీడియో చూస్తే పారెస్టు అధికారులపై జాలి కలుగుతుంది..

ఇది కూడా క్లిక్ చేసి చూడండి : పోలీసులు.. సైకిల్ ఎక్కారు.. ఎందుకోసమంటే..?

వివరాలు ఇలాఉన్నాయి…ఎర్రబోడులొ గత ఇరువది అయిదు సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్నారు.అటవీ హక్కుల చట్టం క్రింద పట్డాకై దరఖాస్తులు చేసుకోవడం జరిగింది.అవి ప్రభుత్వం పరిశీలనలొ ఉన్నాయి. ఇదిలాఉండగా ఎప్పటి వలే తొలకరి వచ్చింది కాబట్టి పొలాలు దున్ని పత్తి విత్తనాలు పెడుతున్నారు.ఆదివారం ఉదయం ఫారెస్ట్ అధికారులు తమ సిబ్బందితో వచ్చి అడ్డుకోవటంతో పాటు పత్తి గింజలు నాటుతున్న స్త్రీలను చూడకుండా దుర్భాషలాడుతు,ఎటువంటి హెచ్చరికలు లేకుండా బెల్ట్స్ తోను,కర్రలతో దాడి చేసినట్లు తీవ్రంగా గాయపడిన గిరిజన మహిళలు పోలీస్ స్టేషనులొ పిర్యాదు చేసి తెలిపారు.అలాగే దాడి సమయంలో ఓ స్త్రీ చంకలో ఉన్న రెండు సంవత్సరాల పిల్లను లాగి వేయడం జరిగింది. ఈ దాడి పట్ల పలు వామపక్ష సంఘాలు తీవ్రంగా ఖండించాయి. సర్వత్రా ఫారెస్ట్ అధికారుల దుందుడుకు పై విమర్శలు వినిపిస్తున్నాయి.పోడు సమస్యను తాను అధికారం లోకి వస్తే అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని పరిష్కరిస్తానన్న దొర మాటల నైతికను ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: – పోడు భూమిపై  తాటి ఆరోపణ వాస్తవమేనా?

== మెచ్చా ప్రయత్నానికి విఘాతం

సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొందాం,ఆవేశాలొద్దు అంటున్న అశ్వారావుపేట ఎమ్.ఎల్.ఎ మెచ్చా నాగేశ్వరరావు ఆలోచనకు విఘాతం కలిగిస్తు నియోజకవర్గం లోని అటవీ శాఖాధికారులు దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తు ,ఆదివాసి గిరిజనులలొ చిచ్చుపెడుతు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారు.తాజాగా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారు ఎర్రబోడులో పోడు భూములలొ సాగును అడ్డుకొంటు అడ్డొచ్చిన గిరిజనులపై తీవ్ర ధాష్టీకాన్ని ప్రదర్శించారు.