ఆ పార్టీ వైపు తాటి చూపు
== తాటిని టచ్ లోకి తీసుకున్న రాష్ట్ర ఆగ్ర నేతలు..?
== టిక్కెట్ తో పాటు ప్రభుత్వం వస్తే క్యాబినెట్ హోదా అవకాశం..?
== పూర్తి హామి తరువాతనే విలేకర్ల సమావేశం..?
== అతి త్వరలో ఢిల్లీలో పెద్దసార్ తో బేటి..?
== జిల్లాలో మారనున్న రాజకీయ సమీకరణాలు
తాటి గులాబీ గూటిని వీడనున్నారా..? ఆ పార్టీకి గుడ్ బై చెప్పే రోజులు దగ్గరపడ్డాయా..? మరోపార్టీ గూటికి చేరే అవకాశం ఉందా..? ఆయనతో పాటు మరికొంత మందిని వెంటబెట్టుకుని వెళ్తున్నాడా..? అంటే నిజమేనని అంటున్నారు ఆ రాజకీయ విశ్లేషకులు.. గులాబీ వనంలో గుచ్చకుంటున్న ముళ్లను తట్టుకోలేకపోతున్న మాజీ ఎమ్మెల్యే.. తనను గుండెల్లో పెట్టుకునే పార్టీకి సిప్ట్ అవుతున్నట్లే కనిపిస్తున్నారు.. ఆయనే కాకుండా ఆయన వర్గీయులు, అనుచరగణంతో, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి త్వరలో గుడ్ బై చెప్పే అవకాశం కనిపిస్తోంది. మూకుమ్మిడిగా రాజీనామాలు చేసి ఢిల్లీ స్థాయి నాయకుడి సమక్షంలో మరో పార్టీ కండువ కప్పుకునే అవకాశం కనిపిస్తోంది.. అందులో భాగంగానే తాటి అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. అసలు ఆయన పార్టీ ఎందుకు మారాలనుకుంటున్నారు…? ఏ పార్టీలోకి వెళ్తున్నారు..? ఏ నేతలు ఆయనకు టచ్ లోకి వచ్చారు..? ఎలాంటి హామినిచ్చి ఒప్పించారో..? తెలియాలంటే ‘విజయం’ తెలుగుదినపత్రిక అందిస్తున్న ప్రత్యేక కథనం పూర్తిగా చదవాల్సిందే.
Allso read:- గులాబీ పార్టీకి తాటి ఝలక్..
ఖమ్మం ప్రతినిధి,అశ్వరావుపేట, జూన్ 22(విజయంన్యూస్)
భద్రాద్రికొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు హాట్ టాఫిక్ గా మారిపోయాయి. మొన్నటి వరకు నిశబ్ధంగా ఉన్న నియోజకవర్గం.. తాటి వెంకటేశ్వర్లు విలేకర్ల సమావేశంలో చేసిన అసక్తికర ప్రకటనతో ఒక్కసారిగా హీట్ ఎక్కింది. నేను బోతా అనే ఒక్క మాటతో అశ్వరావుపేట నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రమే మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. అంతే కాకుండా గులాబీ పార్టీలో గుబులు పుట్టింది.. పార్టీ శ్రేణుల్లో ఆయోమయం నెలకొంది. ఏ నాయకుడు ఎటువైపు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి నేలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరరావుపేట నియోజకవర్గం 2009లో ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఇప్పటి వరకు మూడు సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ పార్టీలు ఒక్కోక్కసారి విజయం సాధించాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మిత్రసేన, 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తాటి వెంకటేశ్వర్లు, 2018 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు విజయం సాధించారు. 2014 ఎన్నికల అనంతరం తాటి వెంకటేశ్వర్లు వైసీపీని వీడి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటికి 2014 ఎన్నికల్లో పోటీ చేసిన అదినారాయణ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గా ఉన్నారు. ఆ సమయంలో టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పూర్తి బాధ్యతలను తాటి వెంకటేశ్వర్లకు అప్పగించింది. అదినారాయణ పార్టీ ఇంచార్జ్ అయినప్పటికి నిశబ్ధం పాటించాల్సి వచ్చింది. ఆ తరువాత 2018 ఎన్నికల్లో అదినారాయణకు టిక్కెట్ రాకపోగా, తాటి వెంకటేశ్వర్లు టీఆర్ఎస్ టిక్కెట్ వచ్చింది. అప్పుడు మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ నుంచి విజయం సాధించారు. ఆ తరువాత 2021లో సండ్ర వెంకటవీరయ్యతో కలిసి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి వరకు అశ్వరావుపేట నియోజకవర్గ ఇంచార్జ్ గా తాటి వెంకటేశ్వర్లు ఉండగా, ప్రస్తుతం ఆ బాధ్యతలను మెచ్చా నాగేశ్వరరావు చూస్తున్నారు. దీంతో తాటి వెంకటేశ్వర్లు, అదినారాయణకు అడుగడుగున అవమానాలు తప్పడం లేదు. మెచ్చా నాగేశ్వరరావు తన వర్గీయులకు పదవులు ఇవ్వడంతో పాటు అందర్ని కలుపుకొని పోకుండా వన్ సైడ్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తాటి వెంకటేశ్వర్లు బహిరంగానే విమర్శించారు.
Allso read:- బీజాపూర్ లో ఎన్ కౌంటర్..
సభ్యత్వాల నమోదు నుంచి అభివద్ది పథకాలు శంకుస్థాపన కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు వారికి ఆహ్వానం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా అవమానాలను భరించిన తాటి వెంకటేశ్వర్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి నన్ను రాజకీయంగా అణగదొక్కుతున్నారని, అవమానాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ మంత్రి కేటీఆర్ పై, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపే బహిరంగంగానే ఆరోపణలు చేశారు. గెలవలేని వ్యక్తి నన్ను టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తుండటం సిగ్గుచేటని ఆరోపించడం సంఛలనంగా మారింది. అయితే తాటి వెంకటేశ్వర్లు ఎందుకు ఇంత ఫైర్ అయ్యారనే విషయంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తర్జనభర్జన పడుతున్నారు. ఏదైన సమస్య ఉంటే సీఎం కేసీఆర్ కో, లేదంటే మంత్రి కేటీఆర్ కో చెప్పుకోవాలి కానీఇంత బహిరంగంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఆరోపణలు చేయడమేంటని పలువురు ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆలోచనలో పడ్డారు. ఎందుకు మరీ ఆయన పార్టీపై, పార్టీ నేతలపై ఆరోపణలు చేశాడు..? చూద్దాం..?
Allso read:- ఇట్టా అయితే నేనుబోతా..? తాటి
== గుడ్ బై చెబుతున్నారా..?
గులాబీ వనంలో నాయకుడిగా ఉన్న తాటి వెంకటేశ్వర్లు వనం వీడి బయటకు పోయే పరిస్థితి కనిపిస్తోంది.. గులాబీ వనంలో గుచ్చుకుంటున్న అవమానం అనే ముళ్లుల నుంచి బయటపడేందుకు తాటి వెంకటేశ్వర్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకు గాను నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనాయకులు, అభిమానులతో రహాస్య సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మారితే భవిష్యత్ అనే విషయాన్ని వారు గుర్తించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముందుగా పార్టీలో ఉంటూ పద్దతి మార్చుకోవాలనే ప్రకటన చేసి, ఆతరువాత తీరు మారకపోతే పార్టీని వీడి మరో పార్టీ గూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించి పార్టీపై, పార్టీ అగ్రనాయకులపై ఆరోపణలు ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. పక్కా ప్రణాళిక ప్రకారమే ఆయన ఆ విధంగా ఘాటైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఇంతకు ఆయన ఏ గూటికి చేరుతున్నట్లు…?
== త్వరలో ఢిల్లీ ప్లైట్ ఎక్కనున్నారా..?
అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గులాబీ గూటిలో నుంచి బయటపడి, జాతీయ పార్టీలో చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.. ఇదే విషయాన్ని ఆయన వర్గీయులు కొందరు అంతర్గతంగా ద్రువీకరిస్తున్నారు. కానీ తాటి వెంకటేశ్వర్లు మాత్రం ఎక్కడ పార్టీ మార్పుపై స్పందించడం లేదు. గిట్లా అయితే నేను బోతా అని అన్నారే తప్ప, ఏ పార్టీలోకి వెళ్తారనే విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆయన్ను ఇప్పటికే జాతీయ పార్టీ నేతలు టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కీలక బాధ్యతలు వహిస్తున్న అగ్రనాయకుడు ఇప్పటికే తాటితో మాట్లాడినట్లు సమాచారం. అశ్వరావుపేట సీటుతో పాటు నియోజకవర్గ పూర్తి బాధ్యతలు, అలాగే అధికారం వస్తే క్యాబినెట్ హోదాను కల్పిస్తామని హామినిచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అతి కొద్ది రోజుల్లోనే ఆయన ఢిల్లీలోని అగ్రనేతలను కలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీ నేత హామినిస్తే కచ్చితంగా ఆ పార్టీలో చేరే అవకాశం లేకపోలేదు. అయితే ఒక్కడే పార్టీని వీడతారా..? లేదంటే ఆయన అనుచరగణాన్ని తీసుకొని వెళ్తారా..? అనేది కా స్పష్టంకాలేదు. కానీ నియోజకవర్గంలో ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న కొంత మంది నాయకులను, అభిమానులను, కార్యకర్తలను తనతో పాటు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. అదే జరిగితే అశ్వరావుపేట నియోజవర్గంలో రాజకీయ ముసలం ఏర్పడే అవకాశం ఉంది. పార్టీ మారితే తాటి వెంకటేశ్వర్లు గెలిచే అవకాశాలున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. చూద్దాం.. రాబోయే రోజుల్లో తాటి వెంకటేశ్వర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారో..? ఆయనతో ఎవరోస్తారో..?