కాంగ్రెస్ గూటికీ తాటి..నేడు చేరిక
** గాంధీభవన్ లో రేవంత్ సమక్షంలో పార్టీలో చేరిక..
** హైదరాబాద్ పయనమైన తాటి..ఆయన అనుచరులు
చంద్రుగొండ, అశ్వరావుపేట, జూన్ 24(విజయంన్యూస్)
అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్న తాటి వెంకటేశ్వర్లు ఈరోజుతో ఆయన టిఆర్ఎస్ తో ఉన్న బందాన్ని విడదీసుకున్నారు.
allso read:- గులాబీ పార్టీకి తాటి ఝలక్..
గత రెండు రోజుల క్రితం కార్యకర్తల సమక్షంలో అత్యవసర సమావేశం నిర్వహించిన తాటి పార్టీ మార్పుపై ఏకాభిప్రాయం తీసుకున్నారు. ఆతరువాత అశ్వరావుపేట లో విలేకర్ల సమావేశంలో టీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అనంతరం ఆయన శనివారం అశ్వారావుపేట నియోజకవర్గం చేరుకొని తన అనుచరులు అభిమానులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన “విజయం” ప్రతినిధితో పార్టీలో చేరిక అంశంపై స్పష్టత ఇచ్చారు టిఆర్ఎస్ పార్టీలో అడుగడుగున అవమానిస్తూ అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సీనియర్ నాయకుడిగా ఆ అవమానాలను ఎదుర్కొనే పరిస్థితి లేదని అందుకే ప్రజా వారధి ప్రజల ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ లో చేరితే బాగుంటుందని కార్యకర్తలు అభిప్రాయం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇప్పటికే హైదరాబాద్ పయనమయ్యారు.
Allso read:- కరకగూడెం టిఆర్ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ..