Telugu News

అశ్వరరావుపేటలో ఇంటర్ విద్యార్థిని ఢీకొన్న లారీ.. తీవ్రగాయాలు

0

ఇంటర్ విద్యార్థిని ఢీకొన్న లారీ

(అశ్వారావుపేట -విజయం న్యూస్)

అశ్వారావుపేట  మండలంలో రోడ్డు ప్రమాదం జరిగిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది.  స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్  సి ఇ సి చదువుతున్న విద్యార్థిని  కెమిలాయిడ్స్ సమీపంలో లారీ ఢీ కొనగా రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అవ్వడం జరిగింది. ఖమ్మం  నుండి రాజమండ్రి వైపు వెళ్తున్న NL01K8698 నెంబర్ గల లారీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్  సి  ఇ సి చదువుతున్న యశ్విత(17) వయసు గల విద్యార్థిని    కళాశాల నుండి అశ్వరావుపేట బస్ స్టాండ్ కు వస్తుండగా  ఢీ కొని రెండు కాళ్ళ మీదనుంచి లారీ వెళ్లడంతో  అమె రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయిపోయాయి.  ప్రమాదం జరిగిన బాలికకు మెరుగైన వైద్యం కొరకు ఖమ్మం పంపించడం జరిగింది  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

allso read :ఫారేస్టు చెక్ పోస్టు తాడు మెడకు చుట్టుకుని యువకుడి మృతి.